Wrinkle Removing Tips: ముఖంపై ముడతలు తొలగిపోయి.. షైనీగా మారాలంటే పడుకునే ముందు ఇలా చేయండి..

Published : Apr 14, 2022, 04:23 PM IST

Wrinkle Removing Tips: చర్మ సమస్యల కారణంగా ముఖ సౌందర్యం పాడువుతుంది. అయితే పడుకునే ముందు ఈ నూనెను ముఖానికి అప్లై చేస్తే మాత్రం మొటిమలు, మొటిమల తాలూకు మచ్చలు, ముడతలు ఇట్టే వదిలిపోతాయి.   

PREV
17
Wrinkle Removing Tips: ముఖంపై ముడతలు తొలగిపోయి.. షైనీగా మారాలంటే పడుకునే ముందు ఇలా చేయండి..

Wrinkle Removing Tips: బాదం పలుకులే కాదు బాదం నూనె కూడా మనకు ఎంతో సహాయపడుతుంది. ఈ బాదం నూనె అన్ని రకాల చర్మ సమస్యలకు చెక్ పెట్టగలదు. ఈ నూనెలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవే చర్మ సమస్యలను తొలగించి.. ముఖాన్ని కాంతివంతంగా తయారుచేస్తాయి. 

27

చర్మం ఆరోగ్యంగా ఉండేదుకు, చర్మ సమస్యలు తొలగిపోయేందుకు బాదం నూనె ఎంతో సహాయపడుతుంది. ఈ బాదం నూనెను రెగ్యులర్ గా ముఖానికి పెట్టడం ద్వారా ముఖం పై ఉండే మచ్చలు తొలగిపోతాయి. అలాగే చర్మ రంధ్రాలు కూడా తెరచుకుంటాయి. దీంతో చర్మ కణాలకు ఆక్సిజన్ బాగా చేరుతుంది. 
 

37

ఈ బాదం నూనెలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, జింక్, ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చర్మాన్ని ఆరోగ్యంగా షైనీగా తయారుచేస్తాయి. అంతేకాదు ఎన్నో రకాల చర్మ సమస్యలకు చెక్ పెడతాయి కూడా. 
 

47

బాదం నూనెను ముఖానికి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

మచ్చలు పోతాయి.. ముఖానికి బాదం నూనెను అప్లై చేయడం వల్ల ముఖం మీద ఉండే నల్లని మచ్చలన్నీ తొలగిపోతాయి. ఇందుకోసం రాత్రిపడుకునే ముందు కాటన్ కు కాస్త బాదం నూనె పట్టించి.. దాన్ని ముఖానికి అప్లై చేయాలి. కొన్ని నిమిషాల తర్వాత ముఖం క్లీన్ చేసుకోవాలి. 
 

57

మొటిమలు తొలగిపోతాయి..  ముఖంపై మొటిమల సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ బాదం నూనెను ముఖానికి అప్లై చేస్తే ఈ సమస్య నుంచి విముక్తి పొందుతారు. ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి మొటిమలను, మొటిమల వల్ల ఏర్పడ్డ మచ్చలను తొలగించడానికి సహాయపడతాయి. 

67

డార్క్ సర్కిల్స్ వదులుతాయి.. విపరీతమైన ఒత్తిడి, నిద్రసరిగ్గా పోకపోవడం వంటి కారణాల వల్ల కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడుతుంటాయి. ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు రాత్రి పడుకునే ముందు కాస్త బాదం నూనె తీసుకుని అందులో రోజ్ వాటర్ లేదా.. తేనెను కలిపి డార్క్ సర్కిల్స్ కి అప్లై చేయాలి. క్రమం తప్పకుండా ఈ చిట్కాలను ఫాలో అయితే ఈ సమస్య తొందరగా వదులుతుంది. 
 

77
wrinkles

ముడతలు పోతాయి.. ముఖంపై ముడతలు రావడం వృద్ధాప్య లక్షణాలు. కానీ ఈ ముడతలు ముఖ సౌందర్యాన్ని పూర్తిగా తగ్గిస్తాయి. అయితే ఈ సమస్య తగ్గాలంటే మాత్రం కాస్త బాదం నూనెను తీసుకుని అందులో కాస్త కలబంద జెల్ ను కలపండి. దీన్ని ముఖానికి పట్టించండి. దీనివల్ల ముఖంపై ముడతలు తొలగిపోయి.. ముఖం షైనీగా కనిపిస్తుంది. 

click me!

Recommended Stories