ఈ ఆహారాలతో.. మీ హృదయం పదిలం...

First Published Jul 10, 2021, 2:14 PM IST

ఆరోగ్యకరమైన జీవనశైలి, ఫైబర్, మంచి కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారం గుండెను లయతప్పకుండా చేస్తాయి. చక్కెర, ప్రాసెస్ చేసిన మాంసాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం అధికంగా ఉంటుందని తేలింది.

గుండె లయతప్పకుండా కొట్టుకుంటుంటేనే మన జీవితం ముందుకు సాగుతుంది. ఆ లయ క్రమం తప్పితే ఆరోగ్యమే తలకిందులవుతుంది. మరి గుండె ఆరోగ్యానికి ఏం చేయాలి? ఎలాంటి జీవనవిధానాన్ని అనుసరించాలి.. అంటే ఆరోగ్యకరమైన, పోషకాహారం మీ హృదయాన్ని పదిలంగా కాపాడుతుంది.
undefined
ఆరోగ్యకరమైన జీవనశైలి, ఫైబర్, మంచి కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారం గుండెను లయతప్పకుండా చేస్తాయి. చక్కెర, ప్రాసెస్ చేసిన మాంసాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం అధికంగా ఉంటుందని తేలింది.
undefined
గుండెకు ఏ ఆహారాలు మంచివి అని జరిపిన పరిశోధనల్లో శాస్త్రీయంగా రుజువు చేయబడిన కొన్ని ఆహార పదార్థాలు ఇవి..
undefined
కార్బోహైడ్రేట్లు తక్కువగా తీసుకోవాలి : కార్బోహైడ్రేట్లు..గుండె ఆరోగ్యంపై కొవ్వు కంటే ఎక్కువ హానికరమైన ప్రభావాన్ని చూపుతాయి. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారం అంటే ప్రోటీన్లు, కొవ్వుల విషయంలో కూడా రెగ్యులర్ గా తీసుకునే ఆహారంలో కంటే తక్కువగా ఉండడం. దీనివల్ల బరువు పెరుగుతామనే భయం ఉండదు.
undefined
శరీరంలో మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డిఎల్) స్థాయిలను ప్రోత్సహిస్తూ, అధిక బరువు, అధిక ట్రైగ్లిజరైడ్, రక్తపోటు స్థాయిలను తగ్గించడం ద్వారా ఇది గుండె పరిస్థితిని గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఈ లో కార్బ్ డైట్ లో కూరగాయలు వంటి మొక్కల ఉత్పత్తుల నుండి తగినంత ఫైబర్, అవోకాడోస్, నట్స్, సీడ్స్, అతి తక్కువగా ప్రాసెస్ చేసిన ప్లాంట్ ఆయిల్స్, ఒమేగా -3 ఎక్కువగా ఉండే చేపల వంటి ఆరోగ్యకరమైన కొవ్వులపై దృష్టి పెట్టాలని సిఫార్సు చేయబడింది.
undefined
సెమీ-వెజిటేరియనిజం : సెమీ-వెజిటేరియన్ డైట్ ను ఫ్లెక్సిటేరియన్ డైట్ అని కూడా పిలుస్తారు. శాఖాహారం తింటూ అప్పుడప్పుడూ మాంసం, చేపలు లేదా పౌల్ట్రీ ఉత్పత్తులను తీసుకోవడం సెమీ-వెజిటేరియనిజం.
undefined
ఈ డైట్ లో అధిక చక్కెరలు, రిఫైన్డ్ చేసిన గ్రెయిన్స్, ప్రాసెస్ట్ చేసిన మాంసాలు, ఎక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాల విషయంలో కఠిన నిబంధనలు ఉంటాయి. అంతేకాదు శాఖాహారం గుండె పరిస్థితి మెరుగుపడటాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ డైట్ లో మాంసం తీసుకోవడం మానేయకుండా, శాఖాహారం నుండి గుండె ఆరోగ్య ప్రయోజనాలను పొందాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.
undefined
వేగనిజం, వెజిటేరియనిజం : ఈ రెండు రకాల్లోనూ ఆహారంనుంచి పూర్తిగా మాంసఉత్పత్తులు తొలగించబడతాయి. రెండు పద్ధతుల్లోనూ చికెన్, రెడ్ మీట్, చేపలను ఆహారం నుండి మినహాయించాలి.
undefined
శాకాహారులు పాల ఉత్పత్తులు, పాలు, గుడ్లు తేనె లేదా జెలటిన్ వంటి జంతు ఉత్పత్తులను వాడతారు. కానీ ఈ వేగనిజం, వెజిటేరియనిజంలో వాటి ద్వారా వచ్చే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ కోసం పూర్తిగా శాకాహారం మీదనే ఆధారపడతారు. దీనివల్ల గుండెకు మంచి ప్రయోజనం ఉంటుంది. గుండె సంబంధిత మరణాల సంఖ్య తగ్గించడానికి ఈ ఆహారపు అలవాట్లు మంచిదని చాలా అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి.
undefined
DASH ఆహారం : ది డయేటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్ లేదా డాష్ డైట్.... దీనివల్ల రక్తపోటు, అధిక రక్తపోటులను నివారించవచ్చు. వీటి చికిత్సలో బాగా సహాయపడుతుంది.
undefined
ఈ డైట్ వల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు, లీన్ మీట్, తృణధాన్యాలు వంటివి క్యాలరీలు ఎంత అవసరమో దాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది.
undefined
ఇక ఈ డైట్ లో రెడ్ మీట్, రిఫైన్డ్ గ్రెయిన్స్, చక్కెరలను తీసుకోవడం నిషిద్ధం. సోడియం వాడకాన్ని తగ్గించడం వల్ల రక్తపోటును నియంత్రిస్తుంది. రక్తపోటు, ఊబకాయం, కొలెస్ట్రాల్ స్థాయిలు, ఇన్సులిన్ నిరోధకత వంటి ప్రాణాంతక శరీర సమస్యలను తగ్గించడం ద్వారా హృదయాన్ని పదిలంగా కాపాడుతుంది.
undefined
click me!