మీ పొట్ట భద్రమేనా? ఇలా తెలుసుకోండి....

First Published Sep 13, 2021, 2:38 PM IST

మీ పొట్ట ఆరోగ్యంగానే ఉందా? ఎలా కనిపెట్టాలి? పొట్ట ఆరోగ్యం పాడైతే ఎలా కనుక్కోవాలి? అనే సందేహాలు వస్తాయి. వీటికీ పొట్టనే సమాధానం చెబుతుంది. మీ పొట్ట ఆరోగ్యం పాడైతే దానంతట అదే మీకు సిగ్నల్స్ పంపుతుంది. వాటిని గుర్తించి, పొట్ట ఆరోగ్యం కోసం చర్యలు తీసుకోవడమే మనం చేయాల్సింది. 

మీ పొట్ట ఆరోగ్యం.. మీ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మెదడు హెల్తీగా ఉండడానికి దోహదపడుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. 

అయితే, మీ పొట్ట ఆరోగ్యంగానే ఉందా? ఎలా కనిపెట్టాలి? పొట్ట ఆరోగ్యం పాడైతే ఎలా కనుక్కోవాలి? అనే సందేహాలు వస్తాయి. వీటికీ పొట్టనే సమాధానం చెబుతుంది. మీ పొట్ట ఆరోగ్యం పాడైతే దానంతట అదే మీకు సిగ్నల్స్ పంపుతుంది. వాటిని గుర్తించి, పొట్ట ఆరోగ్యం కోసం చర్యలు తీసుకోవడమే మనం చేయాల్సింది. అలాంటి సిగ్నల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

బాగా తీపి పదార్థాలు తినాలనిపించడం అందులో మొదటిది. పొట్టలో చెడు బ్యాక్టీరియా వల్ల తీపి పదార్థాలు తినాలన్న క్రేవింగ్ బాగా వస్తుందట. సో మీకూ ఇలాంటి లక్షణం కనిపిస్తే వెంటనే ఓ సారి మీ ఆరోగ్యం విషయంలో రీ చెక్ చేసుకోండి. 

రెండోది.. పొట్టలో గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు, మలబద్ధకం, గుండెల్లో మంట..ఇలాంటి పొట్ట సంబంధిత సమస్యలు.. మీ పొట్ట అనారోగ్యాన్ని సూచిస్తాయి. దీనివల్ల ఆహారాన్ని సరిగా జీర్ణం చేయలేకపోతుంది. ఆహారంలోని వ్యర్థాలను విడదీసే శక్తిని కోల్పోతుంది. 

ఎలాంటి డైటింగ్ చేయకుండానే ఒక్కసారిగా బరువు పెరగడం లేదా, బరువు తగ్గడం మీ కూడా పొట్ట అనారోగ్యాన్ని సూచించే వాటిల్లో ఒక సంకేతం. అనారోగ్యకరమైన పొట్ట ఆహారంలోని పోషకాలు మీ శరీరంలోకి శోషించుకోవడాన్ని నిరోధిస్తుంది. కొవ్వును పేరుకుపోయేలా చేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిల్ని నియంత్రించలేదు. 

ఒక అధ్యయనం ప్రకారం.. పొట్టకు, మెదడుకు సంబంధం ఉంటుంది. అనారోగ్యకరమైన పొట్ట వల్ల మైగ్రెయిన్ వచ్చే అవకాశం చాలా ఉంది. ఇక మైగ్రెయిన్ మిగతా ఆరోగ్య సమస్యలకూ సంబంధం ఉంటుంది. 

నిద్ర పోవడంతో ఇబ్బందులు, సరిగా నిద్ర పట్టకపోవడం, ఇన్సోమేనియా లాంటివి కూడా పొట్ట అనారోగ్యాన్ని సూచిస్తుంది. నిద్రకు కారణమయ్యే, మీ మూడ్ ను మంచి చేసే సెరటోనిన్ అనే హార్మోన్ కేవలం పొట్టలోనే ఉత్పత్తి అవుతుంది. పొట్ట అనారోగ్యం వల్ల ఇది ఉత్పత్తి కాకుండా పోతుంది. 

చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. పొట్టలో అనారోగ్యం వల్ల కొన్ని రకాల ప్రోటీన్లు చర్మం నుండి బైటికి వస్తాయి. దీనివల్ల చర్మం దురదలకు కారణమవుతుంది. ఎగ్జిమా లాంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

పొట్టలో చెడు బ్యాక్టీరియా వల్ల కొన్ని రకాల ఆహారపదార్థాలు తినలేకపోతారు. వాటిని తినడం వల్ల కడుపులో ఉబ్బరం, గ్యాస్, పొట్ట పై భాగంలో నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు లాంటివి వస్తాయి. 

click me!