Smart Gadgets: 50 రూపాయలలోపు దొరికే సూపర్ గ్యాడ్జెట్లు.. వీటితో మీ పనులు చాలా ఈజీ!

Published : Jun 02, 2026, 01:51 PM IST

Smart Gadgets: రోజువారీ జీవితంలో చిన్న చిన్న స్మార్ట్ గ్యాడ్జెట్లు మన పనులను చాలా ఈజీ చేస్తాయి. వాటిలో కొన్ని కేవలం రూ. 50లోపే దొరుకుతాయి. ఇవి ఇంట్లో, ఆఫీస్‌లో లేదా ప్రయాణాల్లో చక్కగా ఉపయోగపడతాయి. తక్కువ ధరలో లభించే సూపర్ గ్యాడ్జెట్లు ఏంటో చూద్దాం.

PREV
15
మినీ ప్లాస్టిక్ బ్యాగ్ సీలర్

వంటగదిలో పప్పు, చక్కెర, టీ పొడి, స్నాక్స్ ప్యాకెట్లను ఓపెన్ చేశాక, వాటిని సురక్షితంగా ఉంచడం చాలా ముఖ్యం. ఈ మినీ ప్లాస్టిక్ బ్యాగ్ సీలర్ ఆ పని చేస్తుంది. ఇది ఆన్ లైన్ లో రూ. 50 లోపే దొరుకుతుంది. స్టెప్లర్ లాంటి డిజైన్‌లో ఉండే ఈ గ్యాడ్జెట్, ప్లాస్టిక్ బ్యాగులను మళ్లీ సీల్ చేయడానికి చక్కగా సహాయపడుతుంది. ఇది ఆహార పదార్థాలను తేమ, కీటకాల నుంచి కాపాడుతుంది.

25
ఫ్రూట్ పిక్స్

పండ్లను స్టైల్ గా సర్వ్ చేయాలనుకుంటే, ఈ బర్డ్ షేప్ ఫ్రూట్ పిక్ ఒక అద్భుతమైన ఆప్షన్. ఇది మీకు ఆన్ లైన్ లో రూ. 50 లోపే దొరుకుతుంది.  పిల్లల టిఫిన్ బాక్సుల కోసం, పండ్లు, స్నాక్స్ సర్వ్ చేయడానికి, పార్టీ ప్లేటర్లను అలంకరించడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి.

35
ట్రావెల్ పేపర్ సోప్ సెట్

ప్రయాణాల్లో చేతులు కడుక్కోవడానికి ఈ ట్రావెల్ పేపర్ సోప్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ సోప్ బాక్స్‌లో చాలా సబ్బు షీట్లు ఉంటాయి. ప్రయాణాలు, ఆఫీస్, ఇతర బయటి పనులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అవసరమైనప్పుడు ఒక షీట్ తీసి నీటితో ఉపయోగించుకుంటే సరిపోతుంది.

45
సెల్ఫ్-వాటరింగ్ ప్లాంటర్ టూల్

మొక్కల సంరక్షణ చేసేవారికి ఇది చాలా ఉపయోగపడే గ్యాడ్జెట్. ఇది మీకు ఆన్ లైన్ లో 50 రూపాయలలోపే లభిస్తుంది. దీన్ని ఏదైనా వాటర్ బాటిల్‌తో ఉపయోగించవచ్చు. డ్రిప్ సిస్టమ్ ద్వారా ఇది మొక్కలకు నెమ్మదిగా నీటిని అందిస్తుంది. వేసవిలో మీరు ఊరికి వెళ్లినప్పుడు కూడా, ఇది మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందేలా చూస్తుంది.

55
7-రోజుల పిల్ బాక్స్

మీరు రోజూ మందులు వేసుకోవాల్సి వస్తే, ఈ చిన్న పిల్ బాక్స్ చాలా ఉపయోగపడుతుంది. ఇది మీకు ఆన్ లైన్ లో రూ. 20కే దొరుకుతుంది. ఇందులో వారం రోజుల పాటు మందులను వేర్వేరు కంపార్ట్‌మెంట్లలో సర్దుకోవచ్చు. ముఖ్యంగా వృద్ధులకు, క్రమం తప్పకుండా మందులు వాడేవారికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories