Summer Skincare: ఇలా చేస్తే.. వారం రోజుల్లో ముఖంపై మొటిమలు మాయం!

Published : Mar 06, 2025, 03:53 PM IST

ముఖంపై మొటిమలు రావడం సహజం. కానీ వాటి వల్ల ముఖం అందం తగ్గిపోతుంది. మొటిమల నివారణకు చాలామంది రకరకాల చిట్కాలు ట్రై చేస్తుంటారు. కానీ వారం రోజుల్లో మొటిమలను తొలగించే చిట్కాలెంటో మీకు తెలుసా? అయితే చూసేయండి.

PREV
15
Summer Skincare: ఇలా చేస్తే.. వారం రోజుల్లో ముఖంపై మొటిమలు మాయం!

ముఖంపై మొటిమలు రావడం సాధారణ సమస్య. చాలా మంది మహిళలు మొటిమలతో బాధపడుతుంటారు. వేసవిలో ఈ సమస్య ఎక్కువ అవుతుంది. అయితే ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా మొటిమలను వారం రోజుల్లోనే తగ్గించుకోవచ్చు. అవెంటో తెలుసుకోండి.

25
పసుపు, పెరుగు ఫేస్ ప్యాక్

పసుపు, పెరుగు ఫేస్ ప్యాక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పసుపులో యాంటీ-అలెర్జీ గుణాలు, పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటాయి. కాబట్టి ఈ రెండింటితో ఫేస్ ప్యాక్ వేసుకుంటే మొటిమలు త్వరగా తగ్గిపోతాయి.

35
ఓట్స్, తేనె ఫేస్ ప్యాక్

ఓట్స్ చర్మంపై ఉండే మృతకణాలను తొలగిస్తుంది. తేనె చర్మపు మంటను తగ్గిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే వారం రోజుల్లోనే మంచి ఫలితం ఉంటుంది.

45
గుడ్డు, నిమ్మ ఫేస్ ప్యాక్

గుడ్డులోని తెల్లసొన చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ మృతకణాలను, మొటిమల మచ్చలను తొలగిస్తుంది. ఈ రెండింతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ ఇతర చర్మ సమస్యలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

55
దాల్చిన చెక్క, తేనె

దాల్చిన చెక్క, తేనెలోని యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలను తగ్గిస్తాయి. కొత్త మొటిమలు రాకుండా అడ్డుకుంటాయి.

click me!

Recommended Stories