సమ్మర్ స్కిన్ కేర్ అండ్ బ్యూటీ టిప్స్..

Published : Mar 07, 2022, 12:44 PM ISTUpdated : Mar 07, 2022, 12:47 PM IST

ఎండాకాలం వచ్చేసింది. ఇక ఇప్పటి నుంచి భానుడి సెగ మొదలైనట్టే. ఈ  కాలంలో అందాన్ని ఎలా రక్షించుకోవాలి? ఎండబారి నుంచి ఎలా తప్పించుకోవాలో అంటూ టీనేజర్లు  తెగ బెంగపెట్టుకుంటుంటారు. ముఖ సౌందర్యాన్ని, చర్మాన్ని రక్షించుకోవడానికి ఈ ఖచ్చితంగా ఈ టిప్స్ ను ఫాలో అవ్వాల్సిందే.

PREV
111
సమ్మర్ స్కిన్ కేర్ అండ్ బ్యూటీ టిప్స్..

శివరాత్రితో శివ.. శివ అనుకుంటూ చలికాలం వెల్లిపోయింది. ఇక అప్పటి నుంచి భానుడి భగ భగ మొదలైంది. చలికాలం అలా వెళ్లిపోయిందో లేదో.. అప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఎండలు ముదిరాక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడానికి భయం వేస్తుంది కదూ. 

211
Summer

సమ్మర్ రాకతో చాలా మంది టీనేజర్లు తెగ ఆందోళన పడిపోతుంటారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల మూలంగా స్కిన్, ఫేస్ రక్షణ ఎలా? అంటూ భయపడిపోతుంటారు. అయితే ఎండాకాలంలో స్కిన్, ఫేస్ తాజాగా, కోమలంగా ఉండాలంటే ఈ సింపుల్ బ్యూటీ టిప్స్ ను ఫాలో అవ్వాల్సిందే. 

311

ఇతర కాలాల కంటే సమ్మర్ లో స్కిన్ కేర్ గురించి ఎక్స్ ట్రా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే భగ్గుమంటున్న ఈ ఉష్ణోగ్రతలకు మీ స్కిన్ ట్యాన్ అయిపోవడం పక్కాగా జరుగుతుంది. అలాగే మీ ముఖం కాంతివిహీనంగా తయారవుతుంది మరి. కాబట్టి ఈ సమ్మర్ లో చర్మాన్ని రక్షించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

411

మండుతున్న ఎండల నుంచి మన చర్మం సురక్షితంగా ఉండాలంటే సన్ స్రీన్ లోషన్ లేదా క్రీమ్ చాలా అవసరం. ఇది స్కిన్ కు హానీ చేసే యూవీ కిరణాల నుంచి రక్షణకల్పిస్తాయి. కాబట్టి బయటకు వెల్లాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా సన్ స్రీన్ లోషన్ రాసుకోవాలి.

511

అలాగే యాంటీ టానింగ్ క్రీమ్స్ ను కూడా వాడితే.. మీ  చర్మం స్మూత్ గా ఉంటుంది. అంతేకాదు ట్యాన్ అవదు. దాంతో మీరు కాంతివంతంగా కనిపిస్తారు. మార్కెట్ లో సన్ స్క్రీన్ లోషన్స్ ను కొనాలనుకున్నప్పుడు వాటిపై యూవిబి లేడా యూవిఎ, ఎస్ ఎఫ్ ఫి  +  ఉన్న వాటినే కొనాలి. 

611

డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడానికి నలుగు పిండి ఎంతో సహాయపడుతుంది. ఈ పిండిని ఇంట్లోనే తయారుచేసుకుంటే మరింత సురక్షితమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఎండాకాలంలో ఆర్గానిక్ స్క్రబ్ ను వాడటం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
 

711


బయటకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా తలపై స్కార్ఫ్ ను ధరించాలి. దీనివల్ల మీరు డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. అలాగే ఎండ తగలకుండా మీ ముఖాన్ని కూడా కవర్ చేయాలి. దీనివల్ల  మీ ఫేస్ ఎండబారిన పడకుండా ఉంటుంది. 

811

ఇకపోతే ప్రతిరోజూ రాత్రి పడుకునే సమయంలో లిప్స్ కు నెయ్యి రాసి నెమ్మదిగా మర్దన చేయాలి. దీనివల్ల మీ పెదాలు మృదువుగా, అందంగా తయారవుతాయి. 

911

మండుతున్న ఎండలకు ఎక్కువగా కళ్లే ప్రభావితమవుతంటాయి. కాబట్టి ఎండ నుంచి కళ్లను రక్షించడానికి కూలింగ్ గ్లాసెస్ ధరించడం ముఖ్యం. 

1011

ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఎండకు బాడీ డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉండాలి. 

1111

అలాగే కొబ్బరి నీళ్లు, మజ్జిగ, సజ్బా గింజలు, పండ్ల రసాలు వంటివి తాగుతూ ఉంటే మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఎండలో నుంచి ఇంటికి రాగానే చల్లని నీళ్లతో ముఖం, కాళ్లూ చేతులను కడుక్కోవాలి.  
  

click me!

Recommended Stories