గుడ్డులో ప్రోటీన్లు, విటమిన్ ఎ,సి, డి, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిని తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఎంతో మంది గుడ్లను ప్రతిరోజూ తింటున్నారు. వీటిని డైలీ తినేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. మెరుగైన ఆరోగ్యానికి ప్రతిరోజూ కనీసం ఒక గుడ్డన్నా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.