ప్రేమ పెరగాలంటే.. పార్టనర్ తో గొడవ పడాలా..?

First Published | Mar 7, 2022, 11:49 AM IST

కోప తాపలు, గొడవలు, కొట్లాటలు లేని రిలేషన్ షిప్ ఉండదేమో కదా.. ప్రేమలో అయినా.. పెళ్లిలో అయినా ఇవన్నీ కామనే. అయితే మీ భాగస్వామికి మీకు మధ్య ప్రేమ పెరగాలంటే ఖచ్చితంగా గొడవ పడాల్సిందేనంటున్నారు నిపుణులు... ఎందుకంటే..?
 

ప్రేమలో  అయినా.. వైవాహిక జీవితంలో అయినా ప్రేమలు, అలకలు, చిన్న చిన్న కొట్లాటలు, గొడవలు చాలా కామన్. ఇవన్నీ వారిద్దరి రిలేషన్ షిప్ ను స్ట్రాంగా చేస్తే.. మరికొన్ని సార్లు ఇద్దరి మధ్య ఎవరూ చెరపలేని దూరాన్ని పెంచుతాయి. ఏదైనా వారిద్దరి అండర్ స్టాండింగ్ తోనే ముడిపడి ఉంటుంది. 

మీకో విషయం తెలుసా.. పార్టనర్స్ మధ్య ప్రేమ మరింత పెరగాలంటే మాత్రం ఇద్దరూ కొట్లాడాలని నిపుణులు చెబుతున్నారు. అవునండీ.. గొడవ పడితే వారిద్దరి మధ్యన అంతులేని ప్రేమ పుట్టుకొస్తుందట. 


అయితే కొంతమంది కపుల్స్ మధ్య గొడవలు జరిగినప్పుడు మానసికంగా వీక్ అయిపోతారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ గొడవల వల్ల మానసికంగా, శారీరకంగా కూడా కొన్ని మార్పులు జరుగుతాయట. గొడవ పడటం వల్ల  వారి శరీరంలో హార్మోన్లలో మార్పులు వస్తాయట. ఆ మార్పుల వల్ల ఏం జరుగుతుందో తెలుసా..

కోరికలు పెరుగుతయ్: భాగస్వామితో లేదా వేరే ఎవరితోనైనా వాదించేటప్పుడు.. మీ శరీరంలో కార్టిసాల్, టెస్టోస్టెరాన్, అడ్రినలిన్ వంటి హార్మోన్లలో మార్పులు వస్తాయట. ఒత్తిడి కారణంగా కోర్టిసోన్ అనే హార్మోన్ ఉద్భవిస్తుంది. దాంతో మీరు శారీరక సంబంధం కోసం మీ మనస్సు, శరీరం రెండూ ఆందోళన చెందుతాయని నిపుణులు చెబుతున్నారు. 
 

గొడవ ముగిసిన తర్వాత లైంఘిక కోరికలు అందుకే పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కొట్లాడినప్పుడు లేదా, ఎవరితోనైనా వాధించినప్పుడు , లేదా కోపంగా ఉన్నప్పుడు ఈ హర్మోన్ ఉత్పత్తి అయ్యి మానసికంగా మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది. ఆ తర్వాత శాంతింపజేస్తుంది. 

ప్రయోజనాలు:  గొడవ పడటం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం మీకు తెలుసా.. కొట్లాడినప్పుడు మీ మనసులో గూడుకట్టుకున్న కోపతాపాలు, అసౌకర్యాలన్నీ ఇట్టే తొలగిపోతాయి. దీనివల్ల మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఓ సర్వే ప్రకారం.. ఏదైనా విషయంలో వాదులాడటం, కొట్లాటపెట్టుకునే కపుల్స్ మిగతా జంటల కంటే పది రెట్లు సంతోషంగా ఉంటారని తేల్చి చెప్పింది. 

ఆందోళన పెరిగినప్పుడు: ఏదైనా విషయంపై మీలో ఆందోళన పెరిగినప్పుడు మీ శ్వాస క్రియ, మీ Heart rate, Blood circulation పెరుగుతుందట. ఇలాంటి సమయంలో మీరు మరింత ఉత్సాహంగా ఉంటారట.  మీరు ఏదైన కొట్లాటలో ఒత్తిడికి గురైనప్పుడు మీ బాడీలో ని అన్ని Nervous systems చురుగ్గా మారతాయట. దీనివల్ల మీరు మరింత ఉత్తేజంగా ఉంటాయి. మీ శరీరానికి శక్తి అందించబడుతుంది. దీనివల్ల శరీరక కార్యకలాపాలు చేయడానికి మీరు ప్రేరేపించబడతారు. 

శారీరక సంబంధం:  మీ భాగస్వామితో గొడవ పడినప్పుడు మీ శరీరంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అదంతా లైంఘిక కాంక్షను పెంచుతాయి. ఎందుకంటే మీ పార్టనర్ తో మీరు గొడవ పడినప్పుడు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. ఆ ఒత్తిడిని దూరం చేసేందుకు సెక్స్ బాగా ఉపయోపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మీలోని అభద్రతా భావనను కూడా దూరం చేస్తుంది.  

సాన్నిహిత్యం: శారీరక సంబంధం ఇద్దరి మధ్యన ఉన్న అంతరాలన్నీంటిని దూరం చేస్తుంది. భార్య భర్తల మధ్యన ఏదైనా వివాదం తలెత్తినప్పుడు వారి అవి తొలగిపోవడానికి శారీరక సంబంధం ఎంతో సహాయపడుతుంది. ఈ శారీరక సంబంధం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

రూలేమీ లేదు: రిలేషిప్ ఎలాంటిదైనా.. వారి మధ్య ప్రేమ పెరగాలంటే వారు ఖచ్చితంగా గొడవ పడాలని రూలెక్కడా లేదు. వారిద్దరి మధ్య కమ్యూనికేషన్, అండర్ స్టాండింగ్ ఉంటే ఎలాంటి గొడవలైనా క్షణాల్లోనే తొలగిపోతాయి. వీరిద్దరి మధ్య కమ్యూనికేషన్ మెరుగుపడాలంటే భార్య భర్తలు మంచి విషయాలనే కాదు, చెడు విషయాలను కూడా మాట్లాడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

Latest Videos

click me!