Summer Tips: ఇలా చేస్తే.. ఏసీ లేకున్నా ఇల్లు కూల్‌గా ఉంటుంది తెలుసా?

Published : Mar 03, 2025, 01:16 PM ISTUpdated : Mar 03, 2025, 01:18 PM IST

వేసవిలో ఎండలు మామూలుగా ఉండవు. కూలర్, ఏసీ లేకపోతే ఇంట్లో కూర్చోలేని పరిస్థితి. కానీ అందరి ఇంట్లో ఈ వస్తువులు ఉండొచ్చు. ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్న కూడా ఎప్పుడూ  ఏసీలో ఉండటం ఆరోగ్యానికి అంతమంచిది కాదు. మరి మీ ఇంటిని ఏసీ లేకుండా కూడా చల్లగా ఉంచడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవెంటో ఇక్కడ చూద్దాం.

PREV
15
Summer Tips: ఇలా చేస్తే.. ఏసీ లేకున్నా ఇల్లు కూల్‌గా ఉంటుంది తెలుసా?

వేసవి కాలం స్టార్ట్ అయింది. ఎండకాలంలో ఎంత వేడిగా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. ఎండలకు బయపడి చాలామంది బయటకు వెళ్లడమే మానేస్తుంటారు. ఏ పని ఉన్నా ఉదయం, సాయంత్రం ఎండలేని టైంలో చేసుకుంటూ ఉంటారు. మిగతా టైం అంతా ఇంట్లోనే గడుపుతారు. ఎండకాలం ఇంట్లోనే కూర్చోవాలంటే కచ్చితంగా కూలర్ లేదా ఏసీ వాడుతుంటాం. కానీ ఏసీ వాడటం ఆరోగ్యానికి అంతమంచిది కాదు.

25
ఏసీ లేకుండా ఇల్లు చల్లగా ఉంచడం ఎలా?

ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఎండ వేడి నుంచి ఎలా తప్పించుకోవాలి అనుకుంటున్నారా? ఏసీ, కూలర్ లేకుండా ఇంటిని చల్లగా ఉంచడానికి కొన్ని నాచురల్ చిట్కాలు ఉన్నాయి. అవెంటో ఇక్కడ చూద్దాం.

35
ఇంటి రంగులు:

వేసవి కాలానికి తగ్గట్టుగా పెయింట్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. ఎండాకాలంలో ఇంట్లో వేడి పెరగడానికి ముఖ్య కారణం ఇంట్లో వేసిన పెయింట్ రంగు.

తెరలు:
వేసవిలో ఇంటి లోపలికి వేడి గాలి రాకుండా కిటికీలు, తలుపులు మూసి వాటికి బయట ముదురు రంగు కాటన్ తెరలు వేయండి. ఇలా చేయడం వల్ల ఇల్లు చల్లగా ఉంటుంది.

45
చల్లని ప్రకృతి తెరలు:

వెట్టివేర్, తాటి ఆకులతో చేసిన తెరలను ఇంటి బాల్కనీ, కిటికీలకు వేలాడదీస్తే ఇల్లు చల్లగా ఉంటుంది. ఇది ఇంటికి అదనపు అందాన్ని ఇస్తుంది.

ఇండోర్ మొక్కలు:
వేసవిలో ఇంట్లో చల్లదనం కోసం ఇండోర్ మొక్కలు కొనండి. ఇవి ఇంటికి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా అందాన్ని కూడా ఇస్తాయి.

55
కూల్ లైట్లు:

మార్కెట్లో చాలా కూల్ లైట్లు అమ్ముతున్నారు. వాటిని ఈ వేసవిలో కొని వాడండి. ఇంట్లో వేడి తట్టుకోలేరు కాబట్టి ఇవి వాడటం మంచిది. ఈ లైట్లు గది ఉష్ణోగ్రతను కూడా తగ్గిస్తాయి.

రాత్రిపూట కిటికీలు తెరవండి

రాత్రిపూట ఇంటి కిటికీలు తెరవండి. కిటికీ పక్కన టేబుల్ ఫ్యాన్ పెట్టండి. ఇది గదిలోకి సహజమైన గాలిని తెస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories