భారత బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ 80వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఆయన స్టైలిష్ లుక్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆయన ఎప్పటి నుంచో ఒకటే హెయిర్ స్టైల్ ని మొయింటైన్ చేస్తూ వస్తున్నారు. దాని వెనక ఉన్న కథేంటో ఓసారి చూద్దాం..
28
ఆయన హెయిర్ స్టైల్ చాలా స్పెషల్ గా ఉండేది. బెల్ బోటమ్ ప్యాంట్స్, టాక్స్ సూట్స్ ఎక్కువగా ధరించేవారు. అన్నింటికన్నా... ఆయన హెయిర్ స్టైల్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉండేది.
38
బిగ్ బి హెయిర్ స్టైల్ లో మధ్యలో పార్టీషన్ చేసేవారు. సైడ్ బర్న్స్ హెవీగా ఉండేలా డిజైన్ చేశారు. ఈ స్పెషల్ హెయిర్ స్టైల్ వెనక ఉన్న వ్యక్తి హమీమ్ కైర్నావి. ఈయన బిగ్ బి పర్సనల్ హెయిర్ స్టైలిష్ట్. ఈయనే.. ఈ స్పెషల్ హెయిర్ ని ఆయన కోసం చేశారు.
48
ఈ హెయిర్ స్టైలిష్ చాలా తక్కువ మందికి చేశాడు. ముఖ్యంగా లెజెండ్స్ అమితాబచ్చన్, రాజేష్ ఖాన్, బ్రూస్ లీ , మహ్మద్ అలీ లాంటివారికి మాత్రమే చేశాడు.
58
హకీమ్ మార్చి 28, 1984లో ప్రమాదవశాత్తు చనిపోయారు. ఆయన చివరగా హెయిర్ స్టైల్ చేసింది మాత్రం అమితాబ్ కే. మార్డ్ అనే సినిమాలో ఆయనకు ఈ హెయిర్ స్టైల్ చేశారు.
68
హకీమ్ ముంబయిలోని తాజ్ హోటల్ సమీపంలో ఓ సెలూన్ నిర్వహించేవాడు. ఆ తర్వాత తన ఇంటి బాల్కనీలోనే ఓ సెలూన్ పెట్టుకున్నాడట. పెద్ద పెద్ద స్టార్లు.. ఆయన ఇంటికి వెళ్లి హెయిర్ కట్ చేయించుకునేవారట. దిలీప్ కుమార్, సునీల్ దత్, శశి కపూర్ లాంటివాళ్లు హకీమ్ ఇంటికి వెళ్లి హెయిర్ కట్ చేయించుకునేవారట.
78
ఇప్పుడు హకీమ్ కుమారుడు ఈ ఆలిమ్ తన ట్రెండ్ ని కంటిన్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం హలీమ్ కుమారుడు అలిమ్.. సంజయ్ దత్, విరాట్ కోహ్లీ, రణబీర్ కపూర్, ధోనీ, సల్మాన్ ఖాన్ లాంటివారికి హెయిర్ స్టైలింగ్ చేస్తున్నాడు.
88
కాగా... హకీమ్ తనకు హెయిర్ స్టైలింగ్ చేశాడని.. ఇప్పుడు ఆయన కుమారుడు ఆలిమ్... తన కుమారుడికి హెయిర్ స్టైలింగ్ చేస్తున్నాడంటూ అమితాబ్ ట్వీట్ చేయడం విశేషం.