Onion Peel: ఉల్లి తొక్కలు పడేస్తున్నారా? ఇన్ని రకాలుగా వాడొచ్చే తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Published : Mar 17, 2026, 02:14 PM IST

Onion Peel: ఉల్లిపాయ తొక్కలను అందరూ చెత్తలోనే పడేస్తారు. కానీ,ఈ ఉల్లి తొక్కలో సల్ఫర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వాటిని ఇంట్లో ఎన్ని రకాలుగా వాడచ్చో తెలుసా? 

PREV
13
Onion peel

ఉల్లిపాయ ఆరోగ్యానికి ఎంత మంచిదో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు.. వంటకు రుచిని అందించడంలోనూ ఉల్లి ముందు వరసలో ఉంటుంది. అయితే.. ఉల్లిపాయ మనకు ఎన్ని ప్రయోజనాలు అందిస్తుందో.. ఉల్లి తొక్క కూడా అంతే ప్రయోజనాలు అందిస్తుంది. మరి.. ఈ ఉల్లి తొక్కలను ఎన్ని రకాలుగా వాడచ్చో ఇప్పుడు చూద్దాం...

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. ఉల్లి తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి, అందానికి, ఇంటి నిర్వహణలో ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి.

23
ఉల్లి తొక్కలను వాడే విధానం...

1.మొక్కలకు సహజ ఎరువు...(Natural Fertilizer)

మొక్కల ఎదుగుదలకు ఉల్లి తొక్కలు ఒక వరం అని చెప్పొచ్చు. వీటిని మొక్కలకు సహజ ఎరువుగా వాడొచ్చు. చాలా బాగా పెరుగుతాయి.

విధానం: ఉల్లిపాయ తొక్కలను ఒక రోజంతా నీటిలో నానపెట్టి, ఆ నీటిని మొక్కలకు పోయాలి. ఇందులో ఉండే పోటాషియం, కాల్షియం మొక్కలు పచ్చగా, ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడతాయి. ఇది సహజమైన పురుగు మందుగా కూడా పని చేస్తుంది.

2.జుట్టు పెరుగుదలకు.. (Hair Care)

జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరగడానికి ఉల్లి తొక్కల నీరు ఎంతో మేలు చేస్తుంది.

ఎలా వాడాలంటే: ముందుగా ఉల్లి తొక్కలను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీరు రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత ఆ నీటిని కాస్త చల్లపరిచి.. గోరు వెచ్చగా ఉన్నప్పుడు.. ఆ నీటిని తలకు బాగా పట్టించాలి. గంట తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది ఇలా చేయడం వల్ల ఇది జుట్టుకు మంచి మెరుపును ఇవ్వడమే కాకుండా సహజమైన రంగును కూడా ఇస్తుంది.

33
3. ఉల్లి తొక్కల టీ (Health Drink)

వినడానికి వింతగా ఉన్నా, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

ప్రయోజనం: ఈ టీ తాగడం వల్ల రక్తపోటు (BP) అదుపులో ఉంటుంది, అలర్జీలు తగ్గుతాయి. బరువు తగ్గడానికి (Weight loss) తోడ్పడుతుంది. ఇందులో ఉండే 'క్వెర్సెటిన్' అనే మూలకం శరీరంలోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.

4. మెరిసే చర్మం కోసం (Skin Care)

చర్మంపై వచ్చే మచ్చలు, దురదలను తగ్గించడానికి ఉల్లి తొక్కల నీరు ఉపయోగపడుతుంది.

విధానం: తొక్కలు మరిగించిన నీటిని ముఖానికి టోనర్‌లా అప్లై చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని రక్షిస్తాయి.

5. ఇంటిని శుభ్రం చేయడానికి (Cleaning)

కిచెన్‌లోని జిడ్డు మరకలు, దుర్వాసనను పోగొట్టడానికి ఇది ఒక మంచి గృహ చిట్కా.

విధానం: ఉల్లి తొక్కల నీటితో కిచెన్ కౌంటర్ టాప్స్ లేదా సింక్ దగ్గర తుడిస్తే బ్యాక్టీరియా నశిస్తుంది. గాఢమైన వాసనలు మాయమవుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories