ఈ నీళ్లతో స్నానం చేస్తే నెత్తిమీద చుండ్రు లేకుండా పోతుంది

First Published | Jan 8, 2025, 10:38 AM IST

చాలా మందికి చుండ్రు సమస్య ఉంటుంది. కానీ దీనివల్ల జుట్టు బలహీనపడి వెంట్రుకలు బాగా రాలిపోతాయి. అయితే ఒక ఆయుర్వేద నీళ్లతో స్నానం చేస్తే గనుక నెత్తిమీద చుండ్రు లేకుండా పోతుంది. 

Dandruff

ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చుండ్రుతో. చుండ్రు చిన్న సమస్యగా అనిపించినా దీనివల్ల జుట్టు బలహీనపడుతుంది. నెత్తి ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే వెంట్రుకలు బాగా ఊడిపోయి నెత్తి పల్చగా అవుతుంది. బట్టతల వస్తుంది. అలాగే జుట్టు జీవంలేనట్టుగా కనిపిస్తుంది. అందుకే ఈ సమస్యను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. 

చుండ్రు వల్ల నెత్తిమీద విపరీతంగా దురద పెడుతుంది. అలాగే ఇన్ఫెక్షన్ వస్తుంది. అందుకే దీన్ని వీలైనంత తొందరగా తగ్గించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తారు. అయితే నెత్తిమీద చుండ్రు లేకుండా చేయడంలో ఆయుర్వేద వాటర్ చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


Fenugreek Water

చుండ్రును తగ్గించే ఆయుర్వేద వాటర్ ట్రీట్ మెంట్

మెంతి నీళ్లు

మెంతినీళ్లతో ఎన్నో జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఈ వాటర్ నెత్తిమీద చుండ్రును తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మీరు గనుక మెంతి నీళ్లతో తలస్నానం చేస్తే గనుక చుండ్రు తగ్గుతుంది. అలాగే మీ జుట్టు బలంగా అవుతుంది. పొడుగ్గా పెరుగుతుంది. అలాగే మెంతులను రాత్రంతా నీళ్లతో నానబెట్టి పేస్ట్ చేయండి. దీన్ని జుట్టుకు అప్లై చేస్తే చుండ్రు తగ్గిపోయి మీ జుట్టు బలంగా అవుతుంది. 

hair care

వేప పువ్వు నీళ్లు

వేప పువ్వు నీళ్లు కూడా మన జుట్టుకు మంచి మేలు చేస్తాయి. ఇన్ఫెక్షన్లు, అలర్జీల నుంచి ఉపశమనం పొందేందుకు వేప ఒక మంచి ఆయుర్వేద ఔషధం.  వేప పువ్వును నీటిని ఉపయోగిస్తే చుండ్రు తగ్గిపోతుంది. వేప పువ్వు వాటర్ లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ నీళ్లతో స్నానం చేయడం వల్ల నెత్తిమీది నుంచి జుట్టు చివర్ల వరకు ఉన్న మురికి మొత్తం తొలగిపోతుంది. అలాగే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. షాంపూతో స్నానం చేసిన తర్వాత వేప పువ్వు నీటితో తలస్నానం చేయండి. 

నిమ్మరసం

నిమ్మకాయలో ఎన్నో ఔషదగుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, చర్మానికి, జుట్టుకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మీకు తెలుసా? నిమ్మకాయ చుండ్రును తగ్గించే బెస్ట్  నేచురల్ రెమిడీ. ఇది చుండ్రును తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. నిమ్మరసం చుండ్రుకు కారణమయ్యే ఫంగస్ ను విచ్ఛిన్నం చేస్తుంది.  అలాగే నెత్తిమీద నూనె ఉత్పత్తిని తగ్గించి చుండ్రు కాకుండా చేస్తుంది. 

పసుపు నీళ్లు

పసుపు నీటిలో దివ్య ఔషదగుణాలుంటాయి. ముఖ్యంగా దీనిలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. మీరు పసుపు నీళ్లతో తలస్నానం చేస్తే మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వాటర్ చుండ్రును పూర్తిగా పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం పచ్చి పసుపును గ్రైండ్ చేసి నీటిలో మరిగించండి. ఈ వాటర్ చల్లారిన తర్వాత జుట్టును శుభ్రమైన నీళ్లతో కడిగేయండి. 
 

కరివేపాకు నీరు

కరివేపాకు వాటర్ కూడా జుట్టుకు మంచి ప్రయోజకరంగా ఉంటుంది.ఈ కరివేపాకు పొడి జుట్టు పెరగడానికి, జుట్టు తొందరగా తెల్లబడకుండా ఉండటానికి బాగా సహాయపడుతుంది. కరివేపాకును నూనెలో మిక్స్ చేసి జుట్టుకు పెడితే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. మీరు కరివేపాకు నీళ్లను వాడితే చుండ్రు లేకుండా పోతుంది. కరివేపాకు సారంలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చుండ్రు సమస్యను తగ్గిస్తాయి. 
 

Latest Videos

click me!