Sperm Donation: భారత్‌లో స్పెర్మ్‌ అమ్ముతూ డబ్బులు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా.?

Published : Feb 22, 2025, 01:51 PM ISTUpdated : Feb 22, 2025, 07:07 PM IST

'విక్కీ డోనర్' ఈ సినిమా చాలా మందికి తెలిసే ఉంటుంది. స్పెర్మ్‌ను అమ్ముకునే ఓ యువకుడి కథను ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే నిజంగానే స్పెర్మ్‌ డొనేషన్ చేయొచ్చని మీకు తెలుసా.? ఇంతకీ భారత్‌లో స్పెర్మ్‌ డొనేషన్‌ ప్రాసెస్‌ ఎలా ఉంటుంది.? ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
15
Sperm Donation: భారత్‌లో స్పెర్మ్‌ అమ్ముతూ డబ్బులు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా.?

సినిమాలో చూపించినట్లుగానే నిజ జీవితంలో కూడా వీర్యాన్ని (స్పెర్మ్‌) దానం చేయొచ్చని మీకు తెలుసా.? విదేశాల్లో ఎప్పుడో మొదలైన ఈ ట్రెండ్ ప్రస్తుతం భారత్‌లోనూ విస్తరిస్తోంది. దేశంలో అనేక చోట్ల స్పెర్మ్‌ డొనేషన్‌ జరుగుతుంది. ఇందుకోసం స్పెర్మ్‌ బ్యాంకులు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇందుకోసం సంస్థలు ఒక విధానాన్ని ఫాలో అవుతాయి. ఇంతకీ వీర్యాన్ని ఎవరు దానం చేయొచ్చు.? ఇందుకు ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి లాంటి పూర్తి వివరాలు. 
 

25

స్పెర్మ్‌ దానం చేయడానికి ఎవరు అర్హులు.? 

ఎవరు పడితే వారు వీర్యాన్ని దానం చేయకూడని కుదరదు. వైద్యుల అభిప్రాయం ప్రకారం కొన్ని రకాల బ్లడ్ గ్రూప్‌లకు చెందిన వారు మాత్రమే దీనికి అర్హులుగా ఉంటారు. దాత నుంచి సేకరించిన వీర్యాన్ని ప్రత్యేక పద్ధతుల్లో నిల్వ చేస్తారు. స్త్రీల నుంచి సేకరించిన అండాలను స్టోర్‌ చేసేందుకు కూడా ఇలాంటి బ్యాంకులు అందుబాటులోకి వచ్చాయి. ఇది పూర్తిగా చట్టబద్ధమైన ప్రక్రియ. 

అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లు, 2021 ప్రకారం భారతదేశంలో 18 నుంచి 39 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుషులు తమ స్పెర్మ్‌ను దానం చేయవచ్చు. కొన్ని స్పెర్మ్ డొనేషన్ బ్యాంకులలో, స్పెర్మ్ డొనేషన్ వయస్సును కూడా 34 సంవత్సరాలుగా నిర్ణయిస్తారు. 
 

35

నిబంధనలు ఏంటంటే.? 

స్పెర్మ్‌ దానం చేసే వ్యక్తి కుటుంబ చరిత్రను, కుటుంబ సభ్యులకు ఏమైనా వ్యాధులు ఉన్నాయా.? అన్న వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. వివాహితులు, పెళ్లికానీ వారు అనే దానికి ఎలాంటి సంబంధం లేదు. సేకరించిన స్పెర్మ్‌ను క్రయో స్టోరేజ్ చేస్తారు. అనంతరం దాని నాణ్యతను చెక్‌ చేసిన తర్వాత స్త్రీ శరీరంలోకి ఇంజెక్ట్‌ చేస్తారు. ఇక స్పెర్మ్‌ దాతల గుర్తిపును పూర్తి రహస్యంగా ఉంచుతారు. 

స్పెర్మ్‌ డొనేషన్ కు ముందు, రక్త పరీక్ష, హెచ్ఐవి పరీక్షలను నిర్వహించారు. వైద్య వివరాలతో పాటు మద్యం, సిగరెట్లు లేదా ఏదైనా మందులు తీసుకునే అలవాటు ఉంటే వాటి గురించి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. శారీరకంగా, మానసిక ఆరోగ్యం బాగుండాలి. ఎలాంటి జన్యుపరమైన లేదా ఆరోగ్య సమస్యలు లేకుండా తండ్రి, తల్లి వైపు కుటుంబ ఆరోగ్య చరిత్ర పరిశీలిస్తారు. 
 

45

ఎక్కడ ఇవ్వొచ్చు.? 

స్పెర్మ్‌ బ్యాంక్‌ లేదా ఫెర్టిలిటీ సెంటర్స్‌లో వీర్యాన్ని సేకరిస్తారు. భారతదేశంలో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో స్పెర్మ్ బ్యాంకులు, ఫెర్టిలిటీ క్లినిక్స్ ఉంటాయి. అక్కడికి వెళ్లి మీ పూర్తి వివరాలతో అప్లికేషన్‌ ఫామ్‌లను అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెడికల్‌ టెస్టులు నిర్వహించి ఓకే అనుకుంటే స్పెర్మ్‌ టెస్టింగ్ చేసి అప్రూవ్‌ చేస్తారు. ఇందులో భాగంగా శుక్రకణాల కౌంట్, మొబిలిటీ (చలనం), మోర్ఫాలజీ (శుక్రకణం ఆకారం) వంటివి పరిశీలిస్తారు. సేకరించిన వీర్యాన్ని 6 నెలల పాటు క్రయో స్టోరేజ్ చేసిన నాణ్యతను పరీక్షిస్తారు. ఆ తర్వాతే ఉపయోగిస్తారు. 
 

55

ఎన్ని డబ్బులు ఇస్తారు.? 

డబ్బు అనేది ఆయా సంస్థపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఒక్కసారి స్పెర్మ్‌ దానం చేస్తే రూ. 500 నుంచి రూ. 1500 వరకు చెల్లిస్తారు. కొన్ని సందర్భాల్లో శుక్రకణాల సంఖ్య, ఆరోగ్యం ఆధారంగా రూ. 2000 వరకు చెల్లిస్తారు. కొన్ని హై ప్రీమియం ఫెర్టిలిటీ సెంటర్లలో రూ. 5 వేల వరకు కూడా చెల్లిస్తున్నారు. భారతీయ చట్టాల ప్రకారం, స్పెర్మ్ దాత వివరాలు గోప్యంగా ఉంచుతారు. స్పెర్మ్‌ దాతకు పుట్టిన బిడ్డపై ఎలాంటి హక్కులు ఉండవు. 

నోట్‌: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించడం జరిగింది. పూర్తి వివరాల కోసం ప్రముఖ ఫెర్టిలిటీ సెంటర్లు, లేదా స్పెర్మ్‌ బ్యాంకులను నేరుగా సంప్రదించడం మంచిది. 

click me!

Recommended Stories