మన పాదాల గురించి మనకే తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు

First Published | Nov 17, 2023, 4:28 PM IST

పాదాలు ఉన్నవి నడవడానికి, మనం నిలబడటానికే కదా అంటుంటారు చాలా మంది.. కానీ మనకు తెలిసింది కొంతే. పాదాల గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. అవన్నీ తెలిస్తే మీరు నోరెళ్లబెట్టకుండా ఉండలేరు తెలుసా? 

మన శరీరంలో ఎక్కువగా పనిచేసే భాగం ఏదైనా ఉందా అంటే అది పాదమే. అవును ఇదే మన శరీరంలో ఎక్కువగా పనిచేస్తుంది. కానీ వీటి గురించి మాత్రం పెద్దగా పట్టించుకోరు. ఒక రోజులో ఒక వ్యక్తి సగటున 8000 నుంచి 10,000 అడుగులు నడుస్తాడు. మనం పాదం లేకుండా ఒక్క అడుగు వేయలేం. మన పాదాల గురించి మనకే తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ నిజాల గురించి ఓ లుక్కేద్దాం పదండి. 
 

మీకు తెలుసా? మన శరీరంలోని మొత్తం ఎముకలలో పావు వంతు ఎముకలు పాదాలలోనే ఉంటాయి. మన ప్రతి పాదంలో 26 ఎముకలు ఉంటాయి. ఇది చేతిలో కంటే తక్కువ. మనం పుట్టినప్పుడు మన పాదాల ఎముకలు ఎక్కువగా మృదులాస్థి కలిగి ఉంటాయి. మనం 21 ఏండ్ల వయసులోకి వచ్చిన తర్వాతే ఎముకలు పూర్తిగా గట్టిపడతాయి. 
 


ప్రస్తుత కాలంలో చాలా మంది బూట్లను వేసుకోవడానికే ఎక్కువగా ఇష్టపడతారు. అసలు ఈ బూట్ల వాడకం ఎప్పటి నుంచి వచ్చిందంటే ఏం చెప్తారు. మీకు తెలుసా? సుమారు 40,000 సంవత్సరాల కిందటే బూట్లను వాడారట. సెయింట్ లూయిస్లోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధన ప్రకారం.. నియాండర్తల్స్ , ప్రారంభ మానవుల పాదాల ఎముకలను విశ్లేషించారు. పాత నమూనాలు మందమైన, బలమైన కాలి వేళ్లను కలిగి ఉన్నాయి. చెప్పులు లేకుండా నేలపై నడవడం వల్ల ఇలా కావొచ్చు. అలాగే  పురావస్తు రికార్డు ప్రారంభ మానవులలో కళాత్మక, సాంకేతిక పురోగతిని చూపిస్తుంది. వీటిలో మొదటి రాతి పనిముట్లు ఉన్నాయి. ఇవి బూట్ల ఉత్పత్తికి సహాయపడ్డాయి. అత్యంత పురాతనమైన షూ 5500 సంవత్సరాల పురాతనమైనది. 
 

బొటనవేలు మన పూర్వీకులు చెట్లు ఎక్కడానికి, మనుషులను, వస్తువులను పట్టుకోవడానికి సహాయపడుతుంది. ఒకవేళ మనకు బొటన వేళు లేకుంటే మనం ఏ వస్తువును అంత బలంగా పట్టుకోలేం. 
 

వెచ్చని, చెమటతో కూడిన పాదాలు బ్యాక్టీరియాకు నివాసంగా మారుతాయి. ఈ బ్యాక్టీరియా మన చనిపోయిన చర్మ కణాలను తింటాయి. అలాగే పాదాల వాసనలను విడుదల చేసే వాయువులు, ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి. 

మీకు తెలుసా? పాదాలతో కూడా చక్కిలిగింతలు అవుతాయి. మన పాదాలలో దాదాపు 8000 నరాలు ఉంటాయి. ముఖ్యంగా చర్మం దగ్గర పెద్ద సంఖ్యలో నరాల చివరలు ఉంటాయి. చక్కిలిగింత పాదాలను కలిగి ఉండటం మంచి సంకేతమంటున్నారు నిపుణులు. 

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పాదాల తిమ్మిరి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎన్నో సమస్యలను కలిగిస్తుంది. డయాబెటిస్ సమస్యలలో పేలవమైన రక్త ప్రసరణ, పాదాల తిమ్మిరి ఉన్నాయి. ఇవి తీవ్రమైన చర్మపు పూతలకు దారితీస్తాయి. 
 

మీకు తెలుసా? అమెరికా, యూకేల్లో పాదాల సైజులు, వెడల్పులు పెరుగుతున్నాయట. యూకేలోని కాలేజ్ ఆఫ్ పొడియాట్రీ 2014 అధ్యయనం ప్రకారం.. 1970 ల నుంచి సగటు పాదం రెండు పరిమాణాలు పెరిగింది. ప్రజలు ఎత్తుగా, బరువు పెరిగినప్పుడు పాదాలు పెరుగుతాయి. కానీ జనాలు పాదాలు పెరిగాయంటే మాత్రం అస్సలు ఒప్పుకోరట. అలాగే పురుషులు, మహిళలు తమ కాళ్లకు సరిపోని బూట్లనే కొంటున్నారట. మహిళల్లో పాదాల సమస్యలకు సరిగ్గా సరిపోని బూట్లే కారణమని పోడియాట్రిస్టులు చెబుతున్నారు.

ఇది ఆశ్చర్యం కలిగించే విషయమే. ఎందుకంటే? చాలా మంది గ్లామరస్ సెలబ్రిటీలకు పెద్ద పెద్ద కాళ్లు ఉంటాయట మరి. గత, ప్రస్తుత గ్లామరస్ మహిళలు చాలా మంది సగటు కంటే పెద్ద పాదాలను కలిగి ఉన్నారు. వీరిలో జాక్వెలిన్ కెన్నెడీ, ఓప్రా విన్ఫ్రే, ఉమా థర్మన్, ఆడ్రీ హెప్బర్న్ ఉన్నారట. 

Latest Videos

click me!