బాదం నుంచి అంజీర వరకు.. ఈ డ్రై ఫ్రూట్ ను నానబెట్టే ఎందుకు తినాలో తెలుసా?

First Published Jan 21, 2023, 1:54 PM IST

చలికాలంలో డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువగా తింటుంటారు. డ్రై ఫ్రూట్స్ ను తినడం వల్ల మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. ముఖ్యంగా ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే వీటిని నానబెట్టి తింటేనే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

డ్రై ఫ్రూట్స్ చాలా శక్తివంతమైన ఫుడ్. అందుకే ఈ సూపర్ ఫుడ్స్ ను క్రమం తప్పకుండా తినాలంటారు ఆరోగ్య నిపుణులు. రోజూ గుప్పెడు డ్రై ఫ్రూట్స్ ను తింటే మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు. ఈ డ్రై ఫ్రూట్స్ ను తింటే మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు అందుతాయి. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ చలికాలంలో ఎక్కువగా తినాలని నిపుణులు సలహానిస్తుంటారు. ఎందుకంటే ఇవి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంతో పాటుగా శరీరాన్ని వెచ్చగా కూడా ఉంచుతాయి. 
 

అయితే వీటిని అలాగే తినడం కన్నా.. రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినడం మంచిదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా బాదం, వాల్ నట్స్, ఎండుద్రాక్ష, అత్తి పండ్లు వంటి ఇతర డ్రై ఫ్రూట్స్ ను రాత్రంతా నానబెడితే వాటిలోని పోషకాలు రెట్టింపు అవుతాయట. ఇలా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ను ఉదయాన్నే పరగడుపున తింటే మీరు రోజంతా శక్తివంతంగా ఉంటారు. నానబెట్టిన ఈ డ్రై ఫ్రూట్స్ సరైన జీర్ణక్రియకు సహాయపడతాయి, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా మారుస్తాయి కూడా. ఇంతకీ ఏయే డ్రై ఫ్రూట్స్ ను ఖచ్చితంగా నానబెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

soaked badam

బాదం పప్పులు

బాదం పప్పులను అలాగే తినడం కంటే నానబెట్టి తింటేనే ఆరోగ్యానికి మంచిది. నానబెట్టిన బాదం పప్పులను ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది.  బాదం పప్పుల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. దీనిలో ఇనుము, ఫోలేట్, విటమిన్ బి 12, విటమిన్ డి, విటమిన్ ఇ తో పాటుగా ఎన్నో సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి ఎంతో శక్తినిస్తాయి. అలాగే మనల్నిఆరోగ్యంగా ఉంచుతాయి. 

ఎండుద్రాక్ష

కిస్ మిస్ లల్లో కూడా ఎన్నో పోషకాలుంటాయి. నల్ల ఎండుద్రాక్షలను రాత్రంతా నానబెట్టి తర్వాతి  రోజు ఉదయాన్నే తినడం వల్ల ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ఇలా తింటే జుట్టు రాలడం తగ్గుతుంది. రాత్రిపూట ఆరు నుంచి ఎనిమిది ఎండుద్రాక్షలు, రెండు గింజల కుంకుమపువ్వును తినడం ద్వారా పీరియడ్స్ నొప్పి తగ్గుతుంది. అలాగే నెలసరి సమయం ప్రకారమే అవుతుంది. 

వాల్ నట్స్

వాల్ నట్స్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటినిన రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే తింటే అభిజ్ఞా పనితీరు పెరుగుతుంది. నానబెట్టిన వాల్ నట్స్ పిల్లలకు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. ఏకాగ్రతను పెంచుతాయి. 
 

అత్తి పండ్లు

చలికాలంలో మలబద్దకం సమస్య ఎక్కువగా వస్తుంటుంది. అయితే ఈ సమస్యను పోగొట్టడానికి అత్తిపండ్లు బాగా ఉపయోపడతాయి. ఇందుకోసం కొన్ని అత్తి పండ్లను రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే తినండి. ఇలా రోజూ తింటే కొన్ని రోజుల్లోనే మలబద్ధకం నుంచి ఉపశమనం పొందుతారు. ఈ అత్తిపండ్లు సాధారణంగా కాబోయే తల్లులకు ప్రయోజనకరంగా ఉంటాయి.

click me!