స్మార్ట్ టీవీని ఎలా శుభ్రం చేయాలో తెలుసా?

First Published | Aug 29, 2024, 3:25 PM IST

ఇంట్లోకి దుమ్ము, ధూళి వస్తూనే ఉంటాయి. దీనివల్ల ఇంట్లో ఉన్న సోఫాలతో పాటుగా స్మార్ట్ టీవీకి కూడా ఇవి అంటుకుంటాయి. క్లియర్ గా కనిపిస్తాయి కూడా. అయితే టీవీ డ్యామేజ్ కాకుండా.. ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో స్మార్ట్ టీవీ ఖచ్చితంగా ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే దీనిని సరైన పద్ధతిలో క్లీన్ చేస్తారు. చాలా మంది టీవీకి ఎంత దుమ్ము, ధూళి అంటుకున్నా అలాగే వదిలేస్తారు. దీనివల్ల టీవీ పాతగా కనిపించడమే కాకుండా.. క్లారిటీ మిస్ అవుతుంది. 

నిజానికి టీవీలను అప్పుడప్పుడైనా క్లీన్ చేస్తుండాలి. అప్పుడే వీటిపై మొండి మరకలు ఏర్పడవు. అలాగని టీవీని ఎలా పడితే అలా క్లీన్ చేస్తే టీవీ డ్యామేజ్ అవుతుంది. అందుకే డ్యామేజ్ కాకుండా టీవీని ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


మీ ఇంట్లో ఉన్న స్మార్ట్ టీవీని శుభ్రం చేయడానికి ముందుగా టీవీ ప్లగ్ పాయింట్ నుంచి వైర్‌ను తీసేయండి. అలాగే టీవీ స్క్రీన్‌ను తడిగుడ్డతో  పొరపాటున కూడా తుడవకూడదు.

ఆ తర్వాత పొడి గుడ్డను తీసుకుని టీవీస్క్రీన్ కు అంటిన దుమ్ము, ధూళిని నెమ్మదిగా శుభ్రం చేయండి. దీని కోసం మీరు కాటన్ లేదా పాలిస్టర్ గుడ్డ లేదా పేపర్ వంటివి ఉపయోగించొచ్చు. వీటివల్ల టీవీ స్క్రీన్‌పై ఎలాంటి గీతలు పడవు. అలాగే మీరు మైక్రోఫైబర్ గుడ్డను కూడా ఉపయోగించొచ్చు.

టీవీ స్క్రీన్‌పై మరకలు ఉంటే వాటిని వేళ్ల గోళ్లతో అస్సలు క్లీన్ చేయకండి. దీని వల్ల స్క్రీన్‌పై గీతలు ఏర్పడతాయి. అలాగే సబ్బును కూడా ఉపయోగించకూడదు. వీటిని పోగొట్టడానికి మీరు శానిటైజర్‌ని ఉపయోగించొచ్చు. ఇది కూడా మంచిదే. మీ ఇంట్లో స్క్రీన్ క్లీనర్ ఉంటే దాన్ని వాడండి. 

అలాగే,ఒకసారి గుడ్డతో తుడిచిన తర్వాత వేరే క్లాత్ ను ఉపయోగించండి. ఒకే క్లాత్ ను మళ్లీ మళ్లీ ఉపయోగిస్తే స్క్రీన్‌పై గీతలు పడతాయని మరి.ఈ పని అస్సలు చేయకండి.

Latest Videos

click me!