ఒక్క పూజకే కాదు.. కర్పూరాన్ని ఇందుకోసం కూడా ఉపయోగించొచ్చు

First Published | Aug 29, 2024, 3:02 PM IST

చాలా మంది కర్పూరాన్ని కేవలం పూజలో మాత్రమే ఉపయోగిస్తుంటారు. కానీ కర్పూరాన్ని మీరు ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవచ్చు. అసలు కర్పూరం దేనిదేనికి ఉపయోగపడుతుందంటే? 
 


సనాతన ధర్మంలో.. పూజా సమయంలో కర్పూరాన్ని ఖచ్చితంగా కాల్చుతారు. దీనికి సంబంధించి ఎన్నో పరిహారాలు కూడా జ్యోతిషశాస్త్రంలో వివరించబడ్డాయి. కర్పూరం మనుషుల జీవితాల్లో ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే పూజతో పాటుగా కర్పూరాన్ని కూడా చాలా పనులకు ఉపయోగిస్తారు తెలుసా? కర్పూరం దేని దేనికి ఉపయోగపడుతుందంటే? 
 

దగ్గు నుంచి ఉపశమనం: అవును కర్పూరాన్ని దగ్గును తగ్గించుకోవడానికి కూడా ఉపయోగించొచ్చు. కర్పూరంలో ఉండే లక్షణాలు దగ్గు నుంచి ఉపశమనం పొందటానికి సహాయపడతాయి. అలాగే దీని వాడకం శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. మీకు దగ్గు సమస్య ఉంటే ముందుగా కర్పూరాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీన్ని కొబ్బరినూనెలో మిక్స్ చేసి ఛాతీ లేదా గొంతుపై అప్లై చేయండి.


dandruff

చుండ్రును తగ్గించడానికి సహాయపడుతుంది: కర్పూరం కూడా జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. కర్పూరాన్ని ఉపయోగిస్తే చుండ్రు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇందుకోసం ముందుగా కర్పూరం గ్రైండ్ చేయండి. దీన్ని కొబ్బరినూనెలో కలిపి తలకు పట్టించి బాగా మసాజ్ చేయండి. 

దురద ఉపశమనం: మీకు శరీరంలో ఎక్కడైన దురగా అనిపిస్తే కర్పూరాన్ని ఉపయోగించండి. ఇందుకోసం కొబ్బరినూనెలో కర్పూరాన్ని మిక్స్ చేసి దురద పెట్టే ప్రాంతంలో అప్లై చేయండి.

joint pain

ఒళ్లు నొప్పుల నుంచి ఉపశమనం: మీరు కండరాలు లేదా కీళ్ల నొప్పులతో బాధపడుతుంటే కూడా కర్పూరాన్ని ఉపయోగించొచ్చు. ఎందుకంటే ఇది  బాడీ పెయిన్ ను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.  కీళ్ల లేదా కండరాల నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి కర్పూరాన్ని నీటిలో మిక్స్ చేసి ప్రభావిత ప్రాంతానికి అప్లై చేయండి. ఇది చాలా రిలాక్స్ కలిగిస్తుంది. 

Latest Videos

click me!