చలికాలంలో డ్రై స్కిన్ ను దూరం చేసే చిట్కాలు మీకోసం..

First Published Jan 17, 2023, 12:58 PM IST

చలికాలంలో మన శరీరంలో నీటి శాతం చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల చర్మం పొడిబారడమే కాదు.. ఎన్నో చర్మ సమస్యలు కూడా వస్తాయి. అందుకే.. 
 

Skin care

అన్ని వయసుల వారు జీవితంలో ఒకసారైనా పొడి చర్మం సమస్యను ఫేస్ చేస్తారు. చర్మంపై దురద, పొరలుగా మారడం, చర్మం ఆరోగ్యం దెబ్బతినడం పొడి చర్మానికి సంకేతాలు. చర్మం త్వరగా తేమను కోల్పోయినప్పుడు చర్మం పొడిబారుతుంది. చర్మం అందంగా, ఆరోగ్యంగా, గ్లోగా ఉండటానికి చర్మానికి సరిపడా నీరుండాలి. పొడి చర్మం వల్ల చర్మ ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. దీనివల్ల చర్మం పొలుసులుగా మారుతుంది. ముఖ్యంగా చలికాలంలో పొడి చర్మం సర్వసాధారణం. దీనికి కారణం ఈ సీజన్ లో శరీరంలో నీటి పరిమాణం బాగా తగుగుతుంది. నిజానికి చాలా మంది ఈ సీజన్ లో నీటిని చాలా తక్కువగా తాగుతుంటారు. దీనివల్ల బాడీలో నీటి కొరత ఏర్పడి చర్మం తేమని కోల్పోయి పొడిబారుతుంది. 

skin care

చర్మ సహజ నూనెలు, కొవ్వులను తగ్గించే డియోడరెంట్లు, నిర్దిష్ట సబ్బులు, శుభ్రపరిచే ఉత్పత్తుల వాడకం వంటి అలవాట్లు కూడా చర్మాన్ని పొడిబారుస్తాయి. అంతేకాదు వేడినీటి స్నానంతో కూడా చర్మం పొడిబారుతుంది. పొడి, చల్లని వాతావరణంలో ఉండటం వల్ల కూడా చర్మం పొడిబారుతుంది. సరైన చర్మ సంరక్షణ చిట్కాలను అనుసరించి  మీ చర్మాన్ని హైడ్రేట్ గా, తేమగా చేయొచ్చు. చలికాలంలో పొడి చర్మం నుంచి బయటపడటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

skin care


మూలికా నూనెలు

పొడి చర్మాన్ని వదిలించుకోవడానికి కొవ్వు ఆమ్లం ఎక్కువగా ఉండే మొక్కల ఆధారిత నూనెలను వాడొచ్చు. వీటిని నేరుగా డ్రై స్కిన్ కు అప్లై చేయొచ్చు. అధిక కొవ్వు ఆమ్ల కంటెంట్ ఉన్న ఈవినింగ్ ప్రింరోస్ నూనెను ఉపయోగించడం వల్ల డ్రైస్కిన్ సమస్య తొలగిపోతుంది. ఇది మీ చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. చర్మం తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది.చికాకును తగ్గిస్తుంది. కొబ్బరి, నువ్వులు, పొద్దుతిరుగుడు నూనెలు మీ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. 

ఆలివ్ ఆయిల్, షుగర్ స్క్రబ్

ఎక్స్ఫోలియేట్ చేసేటప్పుడు సహజంగా మాయిశ్చరైజ్ చేసే స్క్రబ్ ను చక్కెర, ఆలివ్ నూనెతో తయరుచేసుకోవచ్చు. ఇందుకోసం 1/2 కప్పు పంచదారను తీసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ లో కలపండి. అయితే దీనికి లావెండర్ వంటి ముఖ్యమైన నూనెను కూడా కలపొచ్చు. ఇది సహజ సువాసనను కలిగి ఉంటుంది. అంతేకాదు ఇది మీరు విశ్రాంతి తీసుకోవడానికి కూడా సహాయపడుతుంది. సున్నితమైన ఒత్తిడితో మీ చర్మానికి స్క్రబ్ చేయండి. ఆ తర్వాత కడిగేయండి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ ను అప్లై చేస్తే మీ స్కిన్ తేమగా ఉంటుంది. 
 

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. పొడి చర్మం ఉన్నవాళ్లు పడుకునేటప్పుడు లేదా ఇతర సమయాల్లో మాయిశ్చరైజింగ్ లోషన్ గా ఉపయోగించండి. ఎందుకంటే ఇది గది ఉష్ణోగ్రత వద్ద గట్టిపడుతుంది. పగిలిన చేతులు, మడమలపై కొబ్బరి నూనెను రాయండి. ఆ తర్వాత మందపాటి సాక్స్ లేదా నాన్-లేటెక్స్ గ్లౌజులను తొడగండి. కొబ్బరి నూనెను చాలా మాయిశ్చరైజింగ్, అనేక ఇతర ప్రయోజనాలను కలిగి ఉంటుంది. 

అరటిపండు, తేనె మాస్క్

అరటిపండులో యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్, తేమ పుష్కలంగా ఉంటాయి. ఈ పండులోని పొటాషియం కంటెంట్ చర్మాన్ని హైడ్రేట్ గా చేస్తుంది. తేనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీసెప్టిక్ లక్షణాలు ఉంటాయి. ఇది చర్మాన్ని జిడ్డుగా మార్చకుండా తేమగా మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇందుకోసం బాగా పండిన ఒక అరటిపండును ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిలో మిక్స్ చేసి అందులో 1.5 టీస్పూన్ల పసుపు, 2 టీస్పూన్ల తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. 15 నుంచి 20 నిముషాలు అలాగే ఉంచి..  తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేయండి. 
 

skin care


కలబంద

కలబంద మన చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది పొడి చర్మాన్ని సులువుగా వదిలిస్తుంది. అంతేకాదు ఎన్నో చర్మ సమస్యలను తగ్గిస్తుంది. అందుకే చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో దీన్ని బాగా ఉపయోగిస్తారు. వాణిజ్యపరంగా లభించే అనేక లోషన్లు, క్రీములకు కూడా దీనిని కలుపుతారు. ఇది పాలిసాకరైడ్లను కలిగి ఉంటుంది. ఇవి చర్మంలో తేమను నిలిపి ఉంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంతేకాదు ఇది చర్మం కొల్లాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇవి చర్మం మృదువుగా, ఆరోగ్యంగా, కాంతివంతంగా, తేమగా ఉండటానికి సహాయపడతాయి. 

click me!