వయసు పెరుగుతున్నా.. యంగ్ గా కనిపించాలంటే ఇవి తినండి..

First Published Nov 21, 2022, 11:53 AM IST

వయసు పెరుగుతున్న కొద్దీ చర్మం ముడతలు పడుతుంది. ముఖంపై నల్లని మచ్చలు ఏర్పడతాయి. కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ వస్తాయి. ఇవన్నీ తొందరగా రాకూడదంటే.. కొన్ని ఆహారాలను మీ రోజు వారి ఫుడ్ లో చేర్చుకోండి చాలు.. 
 

మెరిసే అందమైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి.. ఎంత వయసున్నా.. ఇంకా యంగ్ గానే కనిపించాలని చాలా మంది ఆశపడుతుంటారు. నిజానికి మనకు శరీర ఆరోగ్యం ఎంత ముఖ్యమో చర్మ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. కానీ మన వయసు పెరుగుతున్నసంగతిని మన చర్మం ఇట్టే చెప్పేస్తుంది. అందుకే వయసును చర్మాన్ని బట్టి గుర్తిస్తుంటారు. అయితే కొంతమందికి వయసు ఏమాత్రం ఎక్కువ లేకున్నా..  చర్మంపై ఇలాంటి సంకేతాలే కనిపిస్తాయి. ముడతలు, నల్లటి వలయాలు, పల్చటి గీతలు కేవలం పెద్దవారిలోనే కాదు.. ప్రస్తుతం చిన్న వయసు వారిలో కూడా కనిపిస్తున్నాయి.  ఇవన్నీ చర్మానికి సంబంధించిన సమస్యలు.

అయితే వయస్సును ఏం చేసినా తగ్గించలేం. కానీ చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా ఉంచడానికి కొన్ని ఆహారాలు బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే శరీర ఆరోగ్యంతో పాటు చర్మ సంరక్షణలో ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మీ చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచడానికి మీ ఆహారంలో చేర్చాల్సిన కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ఆరెంజ్

ఆరెంజ్ ను చలికాలంలో తప్పకుండా తినాలి. ఇది ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచుతుంది. ఇకపోతే ఈ పండు చర్మానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో  విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఈ పండ్లు చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వడదెబ్బ వల్ల కలిగే చర్మ సమస్యలను నివారిస్తాయి. అలాగే చర్మాన్ని సహజసిద్ధంగా హైడ్రేట్ చేస్తాయి. ముఖ్యంగా చర్మం పొడిబారడాన్ని నివారిస్తాయి. 
 

బచ్చలికూర

బచ్చలికూర మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. పోషకాలు సమృద్ధిగా ఉండే ఈ ఆకుకూర శరీర ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. వీటిలో ఉండే ఫోలేట్, బీటా కెరోటిన్, విటమిన్ కె, జింక్ వంటి పదార్థాలు చర్మంపై ముడతలను తొలగించడంలో సహాయపడతాయి. చర్మంపై ముడతలే వృద్ధాప్యానికి ప్రధాన సంకేతం. ఇలాంటి వారు తమ రోజు వారి ఆహారంలో బచ్చలికూరను చేర్చుకుంటే చర్మం ప్రకాశవంతంగా మెరిసిపోతుంది. 

ఉసిరి

ఉసిరిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉండే ఉసిరికాయ చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వృద్ధాప్య సంకేతాలు చర్మాన్ని ప్రభావితం చేయకుండా నిరోధించడానికి ఇవి సహాయపడతాయి. ముడతలు లేట్ గా వచ్చేలా చేస్తాయి.

tomatoes

టమాటాలు

చర్మ ఆరోగ్యానికి టమాటాలు కూడా ఉపయోగపడతాయి. టమోటాలను తీసుకోవడం వల్ల వృద్ధాప్యంలో భాగంగా వచ్చే చర్మంపై ముడతలను, నల్లని మచ్చలను తొలగిపోతాయి. సూర్యకిరణాల వల్ల చర్మంపై అయ్యే మొటిమలను తొలగించడానికి కూడా ఇవి సహాయపడతాయి. 
 

క్యారెట్లు

క్యారెట్లు చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో ముందుంటాయి. విటమిన్ ఎ, పొటాషియం, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే క్యారెట్లు చర్మ ఆరోగ్యానికి చాలా మంచివి. క్యారెట్లు చర్మంపై నల్లటి మచ్చలను తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే ముఖాన్ని అందంగా, ఆకర్షణీయంగా చేస్తుంది.
 

click me!