గ్రీన్ కాఫీ.. ఎప్పుడూ పేరు విన్నట్టు లేదా.. మనందరికీ తెలిసింది.. రోస్ట్ చేసిన కాఫీ గింజలే.. అందుకే కాఫీ అనంగానే ముదరు బ్రౌన్ కలరే గుర్తుకువస్తుంది. అంతేకాదు షాపింగ్ చేసేప్పుడు బట్టలు, ఇతర రకాల రంగుల వస్తువులు కొనేప్పుడు ప్రత్యేకంగా కాఫీ కలర్ అని అడిగి మరీ ఆ రంగువి కొనుక్కుంటాం. ఇక కాఫీ ప్రియులైతే.. ఆ కాఫీ గింజల రోస్టింగ్ వాసనకే తమ జిహ్వను ఆపుకోలేరు. ఎప్పుడెప్పుడు కప్పులకొద్ది కాఫీ తాగేద్దామా అంటూ ఎదురుచూస్తుంటారు.
undefined
మరి ఈ గ్రీన్ కాఫీ అంటే ఏంటీ.. కాఫీ ఆకులతో చేస్తారా? అంటే కాదు.. కాఫీ గింజల్ని రోస్ట్ చేయకముందే ఉండేవాటిని గ్రీన్ కాఫీ అంటారు. కాఫీ గింజల్ని వేయించడం వల్ల ప్రస్తుతం మనం తాగుతున్న కాఫీ పొడి తయారవుతుంది. అయితే వేయించడం వల్ల కాఫీ గింజల్లోని ఆరోగ్యానికి, చర్మానికి, జుట్టుకు ప్రయోజనకరమైన ఆరోగ్యకరమైన పోషకాలన్నీ కోల్పోతాయి. అయితే, కాల్చిన కాఫీతో పోలిస్తే గ్రీన్ కాఫీ కూడా దాదాపుగా అదే రుచిని కలిగి ఉంటుంది. అంతేకాదు వేయించిన కాఫీ గింజల కాఫీతో పోలిస్తే మిగతా ప్రయోజనాలు అధికంగా ఉంటాయి.
undefined
నేటి రోజుల్లో బ్యూటీకి సంబంధించిన ఏ చిన్న అంశమైనా చాలా ప్రాచుర్యం పొందుతుంది. అందానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉండడం.. బ్యూటీ ఉత్పత్తుల వ్యాపారంలో పోటీ నెలకొని ఉండడంతో.. ఎక్కువ మంది వినియోగదారులను ఆకట్టుకోవాలంటే తమ ప్రాడక్ట్ కొత్తగా ఉండాలని ఆశిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ మధ్య సౌందర్య సాధనాల్లో గ్రీన్ కాఫీ హాట్ ఫేవరేట్ ఇంగ్రీడియంట్ గా మారింది.
undefined
గ్రీన్ కాఫీ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది చర్మం వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది. చాలా కాలం పాటు చర్మం బిగుతుగా ఉండేలా.. సాగిపోనివ్వకుండా ఉండేలా సహాయపడుతుంది. వీటితో పాటు గ్రీన్ కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్ ఉండటం వల్ల చర్మం ఎర్రబడటాన్ని తగ్గిస్తుంది. ఎండనుంచి చర్మాన్ని కాపాడుతుంది. గ్రీన్ కాఫీ చర్మాన్ని బిగుతుగా చేసి, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. కొల్లాజెన్ బూస్టర్ గా గ్రీన్ కాఫీ పనిచేస్తుంది. దీనివల్ల చర్మం ఎలాస్టిసిటీని సంతరించుకుంటుంది. దీనివల్ల చర్మం వదులు కావడం తగ్గుతుంది. చర్మం మీద ముడతలు, గీతలు ఇక కనిపించవు.
undefined
గ్రీన్ కాఫీలో ఉన్న ఈ ప్రయోజనాల వల్లనే ఆయుర్వేద, ఆర్గానిక్ చర్మ సంరక్షణ బ్రాండ్లు గ్రీన్ కాఫీ బేస్ గా తమ ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నాయి. చాలా మంది గ్రీన్ కాఫీని పానీయంగా మాత్రమే ఉపయోగిస్తున్నారు. దీంతో పాటు గ్రీన్ కాఫీ బాడీ స్క్రబ్, గ్రీన్ కాఫీ బాడీ వాష్ వంటి ఉత్పత్తులను మీ రోజువారీ దినచర్యలో చేర్చితే.. గ్రీన్ కాఫీ ప్రయోజనాలు మరింతంగా పొందడంలో మీకు సహాయపడతాయి.
undefined
గ్రీన్ కాఫీ గింజల్ని పొడి చేసి వీటితో బాడీ స్క్రబ్ చేయడానికి ఉపయోగించినప్పుడు, పొడిగా మారి కాఫీ బీన్స్ అద్భుతమైన ఎక్స్‌ఫోలియేట్‌ను తయారు చేస్తాయి, ఇది మొటిమలను నివారించడంతో ప్రభావంతంగా పనిచేస్తుంది. దీంతో పాటు మూసుకుపోయిన చర్మ రంధ్రాల చికిత్సకు సహాయపడుతుంది.
undefined
చర్మం పొడి బారిపోకుండా ఉండడానికి మేకప్ వేసుకునేముందు... తరువాత మీరు మాయిశ్చరైజర్ వాడుతున్నట్లైతే.. మాయిశ్చరైజర్ రాయడానికి ముందు గ్రీన్ కాఫీ సీరంను రాసుకోవాలి. దీనివల్ల మీ చర్మం ఆకృతిని మెరుగుపరుస్తుంది. చర్మం నిగారింపుతో, యవ్వనంగా కనిపించేలా సహాయపడుతుంది.
undefined
గ్రీన్ కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మీ చర్మాన్ని ఎండదెబ్బనుంచి కాపాడుతాయి. గ్రీన్ కాఫీ ఎక్స్ ట్రాక్ట్ నుంచి తయారైన ఏ క్రీమ్, లోషన్ అయినా సరే ఎండదెబ్బనుంచి మీ చర్మాన్ని రక్షించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. చర్మాన్ని మాయిశ్చరైజర్ చేసి సూర్యరశ్మి ప్రభావంతో పోరాడడంలో సహాయపడతాయి. మీ చర్మం దాని సహజ కాంతిని తిరిగి పొందడంలో సహాయపడుతుంది.
undefined
బ్యూటీ ఉత్పత్తుల్లో గ్రీన్ కాఫీ తో తయారైన వాటికి మారిన తరువాత తమ చర్మ సౌందర్యం, ఆకృతి, మెరుపు విషయంలో మంచి ఫలితాలు కనిపించాయని చాలామంది చెబుతున్నారు. దీంతో పాటు చర్మ సంరక్షణ కోసం మీ దినచర్యలో కొంత మార్పులు చేసుకోవాలి. గ్రీన్ కాఫీ ఉత్పత్తులను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చడం వలన మీ చర్మంపై వృద్ధాప్య ప్రభావాన్ని తగ్గించవచ్చు.
undefined