వాలెంటైన్స్ డే : డేట్ నేట్ కి వెడుతున్నారా? ఈ డ్రెస్ లు ట్రై చేయండి...

First Published | Feb 7, 2021, 9:30 AM IST

వాలెంటైన్స్ డే దగ్గర పడుతోంది. యువత డేటింగ్ కి సిద్ధమవుతోంది. చాలామంది తమకు క్రష్ ఉన్న వారితో సరదాగా సమయం గడపడానికి రెడీ అవుతుంటారు. అయితే ఇలాంటి సరదా సమయాన్ని మరింత అద్భుతంగా మీకు అనుకూలంగా మార్చుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. 

వాలెంటైన్స్ డే దగ్గర పడుతోంది. యువత డేటింగ్ కి సిద్ధమవుతోంది. చాలామంది తమకు క్రష్ ఉన్న వారితో సరదాగా సమయం గడపడానికి రెడీ అవుతుంటారు.
అయితే ఇలాంటి సరదా సమయాన్ని మరింత అద్భుతంగా మీకు అనుకూలంగా మార్చుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

ముఖ్యంగా మీరు ఎలాంటి బట్టలు వేసుకుంటారు. ఏ రంగుని ప్రిఫర్ చేస్తారు అనేదానిమీద ఆధారపడే మీ డేట్ సక్సెస్ ఉంటుంది. ఇక్కడ మీకు కొన్ని సలహాలిస్తాం.. వాటిని మీకనుగుణంగా మార్చుకుని ఫాలో అయితే మీ డేట్ నైట్ అద్భుతంగా మారిపోతుంది.
ఎరుపులో మెరిసిపోండి.. ఎరుపుకు తిరుగులేదు. ప్రేమకు ఎరుపుకు సంబంధం ఉంటుంది. సో రెడ్ అనేది మీ డేట్ డ్రెస్ గా సెలక్ట్ చేసుకుంటే మీరు మరింత వన్నె తేరుతారు.
ఎరుపులో మెరిసిపోండి.. ఎరుపుకు తిరుగులేదు. ప్రేమకు ఎరుపుకు సంబంధం ఉంటుంది. సో రెడ్ అనేది మీ డేట్ డ్రెస్ గా సెలక్ట్ చేసుకుంటే మీరు మరింత వన్నె తేరుతారు.
వాలెంటైన్స్ డే సమయంలో ముఖ్యంగా మీకు వంకపెట్టలేని విధంగా ఇది తయారు చేస్తుంది. ఎరుపు రంగు మినీ డ్రెస్, లేదా మీ శరీర ఒంపుల్ని పట్టిచ్చే ఎరుపు డ్రెస్ సెలెక్ట్ చేసుకోండి. దీనికి తగిన మేకప్, మంచి షూస్, హ్యాండ్ బ్యాగ్ మ్యాచ్ చేయండి.Picture Credit: Sonam Kapoor Instagram
నలుపు : పూర్తిగా నలుపు ఉండే అవుట్ ఫిట్ తో మీరు వంకపెట్టకుండా ఉంటారు. నలుపు సన్నగా కనిపించేలా చేస్తుంది. మీ బాడీని, మైండ్ ను రిఫ్రెష్ చేస్తుంది. నలుపు మిమ్మల్ని ఆకర్షనీయంగా మార్చేస్తుంది.
బ్లాక్ లెదర్ ప్యాంటు మీద సౌకర్యవంతమైన బ్లాక్ టాప్, లేదా ఆల్-బ్లాక్ జంప్సూట్ వేసుకోవచ్చు. దీనికి స్టైలిష్ బ్లాక్ బ్యాగ్, చక్కటి హెయిర్ స్టైల్, తక్కువ జ్యుయలరీ వేసుకుంటే బెటర్.
తెలుపు ఇది అందరికీ నచ్చే అద్భుతమైన రంగు. తెలుపురంగు ప్యాంట్స్ ను తీసుకుని దాన్ని వాలెంటైన్స్ డేకి సిద్దం చేసుకోండి. తెలుపు ప్యాంట్స్ ను ఎలా అనేదే కదా మీ డౌట్. తెలుపురంగు ప్యాంట్ మీద ఎలాంటి టాప్ అయినా సెట్ అవుతుంది. లాసీ పాస్టెల్ షేడెడ్ టాప్, లేదా స్లీవ్ లెస్, బాక్ లెస్ టాప్ లు బెస్ట్ గా ఉంటాయి. దీనికి జుట్టు కాస్త గజిబిజి హెయిర్ స్టైల్ కూడా బాగా సూటవుతుంది. వీటికి బెస్ట్ షూస్, చక్కటి హ్యండ్ బాగ్ జతచేస్తే సరిపోతుంది.
ఈ కలర్స్ మీకు అంతగా నచ్చకపోతే ఏ కలర్ ది అయినా మినీ డ్రెస్ బెటర్ గా ఉంటుంది. దీంతో మీరు అందరి దృష్టినీ ఆకర్షించొచ్చు. ఇక ఇందులోనూ ఫ్రిల్-డిటైల్డ్ మినీ డ్రెస్‌ అయితే అన్నిటికీ అనువుగా ఉంటుంది. మట్టి రంగు ఆఫ్-షోల్డర్ మినీ డ్రెస్ మీదికి ఉంగరాల జుట్టు బాగా సూటవుతుంది. మినీ డ్రెస్ లు వేసుకున్నప్పుడు మేకప్, జ్యూయలరీ చాలా తక్కువగా ఉండేలా చూసుకోవాలి.
మీరు డేట్ కి వెల్తున్న వ్యక్తికి యానిమల్ ప్రింట్స్ అంటే ఇష్టమని తెలిస్తే దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. వాలెంటైన్స్ డే డేట్ నైట్ కి చీతా ప్రింట్ స్కర్ట్ లు ప్రిఫర్ చేయండి. దీని మీద పూర్తి నలుపు, లేదా పూర్తి ఎరుపు టాప్ వేసి మ్యాచ్ చేయండి. ఇక దీనికి మీకిష్టమైన హీల్స్ తో పేరప్ చేసి చక్కటి హ్యాండ్ బ్యాగ్ ధరిస్తే సరిపోతుంది.

Latest Videos

click me!