శృంగారం, రొమాన్స్ లాంటి పదాలు వినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ.. వాటి గురించి ఆలోచనలు రాకుండా మాత్రం ఎవరూ ఉండరు. అయితే.. శృంగారంలో తెలిసీ తెలియక కొందరు అమ్మాయిలు చేసే పనులు.. అబ్బాయిలకు అస్సలు నచ్చడం లేదట. మరి అవేంటో ఓసారి చూసేద్దామా..
శృంగారం రసపట్టుగా సాగుతున్న సమయంలో కొందరు మహిళలు.. పురుషులను కొరుకుతున్నారట. ఆ విషయం తమకు అస్సలు నచ్చదని కొందరు పురుషులు ఓ సర్వేలో చెప్పడం గమనార్హం.
శృంగారం తర్వాత వెంటనే ఏమీ పట్టనట్లు నిద్రపోవడం కూడా నచ్చదట. కాసేపు సమయం గడిపితేనే వారికి కూడా నచ్చుతుందట.
శృంగారం సమయంలో.. మాజీ ప్రియుడి ప్రస్తావన తీసుకువస్తే.. అబ్బాయిలకు అసలు నచ్చదట. కనీసం నోటి వెంట పేరు వచ్చినా కూడా చాలా మందికి నచ్చదట. ఆ విషయం గమనించకుండా పలుమార్లు ప్రస్తావిస్తే.. మీ రిలేషన్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది.
కొందరు అబ్బాయిలు.. సెక్స్ తర్వాత కాసేపు రిలాక్స్ అవ్వాలని అనుకుంటారట. అలాంటి సమయంలో.. మాటలతో, చేతలతో విసిగించేవారంటే అబ్బాయిలకు నచ్చదట.
శృంగారం తర్వాత ఎలా ఉంది.. అని అమ్మాయిలు.. అబ్బాయిలను అడగకూడదట. వారు కొంచెం ఇబ్బందిగా ఫీలయ్యే అవకాశాలు ఉన్నాయట.
రొమాన్స్ మధ్యలో సంబంధం లేని టాపిక్స్ తీసుకురాకూడదట. దాని వల్ల అబ్బాయిల మూడ్ మొత్తం దెబ్బతింటుంది.
ఎలాంటి ముద్దూ, ముచ్చట లేకుండా శృంగారం చేయడం అబ్బాయిలకు పెద్దగా నచ్చదట. వారిని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే మజా వస్తుందట.
సెక్స్ అయిపోగానే చాలా మంది అమ్మాయిలు వెంటనే బాత్రూమ్ కి పరుగులు తీస్తారట. అది కూడా అంత మంచిదేమీ కాదని వారు చెబుతున్నారు.