ఒత్తిడిని చిత్తు చేయండిలా..

Published : Feb 22, 2022, 11:51 AM IST

ప్రతి ఒక్కరినీ కామన్ గా వేధించే సమస్యల్లో ఒత్తిడి కూడా ఒకటి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి సర్వసాధారణ సమస్యగా మారింది. కానీ తీవ్రమైన ఒత్తిడితో చాలా కాలం బాధపడేవారు ఫ్యూచర్ లో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాల ద్వారా ఈ ఒత్తిడిని ఈజీగా జయించొచ్చు.  

PREV
112
ఒత్తిడిని చిత్తు చేయండిలా..

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఒత్తిడి సమస్యతో బాధపడుతున్నారు. ఈ ఒత్తిడి ప్రస్తుతం సర్వసాధారణ విషయమైపోయింది. కానీ ఈ ఒత్తిడి ఎక్కు కాలం వేధిస్తే మాత్రం ఫ్యూచర్ లో అనేక అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 

212

ఈ ఒత్తిడి ముదిరితే మాత్రం డిప్రెషన్ బారిన పడాల్సి వస్తుంది. ఈ డిప్రెషన్ తో చిరాకు, ఆందోళన, అలసట, తీవ్రమైన తలనొప్పి వంటి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. 

312

మీరు కోరుకున్న లక్ష్యాన్ని రీచ్ కావాలంటే కాలంతో పాటుగా మీరు కూడా ఉరకాల్సిందే. అయితే క్రమంలోనే చాలా మంది  తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు. అయితే ఈ ఒత్తిడి ఎక్కుక కాలం కొనసాగితే మీరు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటప్పుడు ఒత్తిడిని జయించడమొక్కటే మీకున్న ఏకైక మార్గం. కాబట్టి ఒత్తిడిని చిత్తు చేసేందుకు మీకు ఈ చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

412

ఒత్తిడితో కూడుకున్న లైఫ్ వల్ల మీరు ఎన్నటికీ మనశ్శాంతిగా ఉండలేదు. కాబట్టి ఒత్తిడిని జయించడమెలాగో మీరు తెలుసుకోవాలి. అందుకోసం ప్రయత్నం చేయాలి.

512

ఒత్తిడి నుంచి బయటపడాలంటే ముందుగా మీరు చేయాల్సి అతి ముఖ్యమైన పని.. ఒత్తిడి ఏ కారణంగా కలుగుతుందో గుర్తించాలి. అలాగే ఆ సమస్య నుంచి బయటపడే మార్గాలను కనుక్కోవాలి. లేదా ఒత్తిడి కలిగించే విషయాలకు ఎలా దూరంగా ఉండాలో తెలుసుకోవాలి.

612

మీరు చేస్తున్న పని వల్లే స్ట్రెస్ పెరుగుతుందని మీకు అనిపిస్తే .. మీరు చేసే పనిని మార్చుకోవడమే బెటర్. అలా కుదరదు అనుకుంటే .. దానికి Alternative గా ఏదైనా ఉందేమో చూసుకోవాలే తప్ప ఒత్తిడితో కూడిన లైఫ్ ను లీడ్ చేయడం అంత మంచిది కాదు.
 

712

తీవ్రమైన ఒత్తిడి నుంచి బయటపడేందు మెడిటేషన్ చక్కని మార్గం. ప్రతి రోజూ కాసేపు మెడిటేషన్ లేదా ప్రాణాయామం చేయడం ద్వారా ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. దీని వల్ల మీకు కాస్త ఉపశమనం లభిస్తుంది.

812

స్నానంతో శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాదు.. ఒత్తిడి నుంచి కూడా దూరమవొచ్చు. ఎలా అంటే.. మన శరీరంపై నీళ్లు పడగానే మన బాడీకి సరికొత్త ఉత్సాహం వచ్చి చేరుతుంది. కాబట్టి తీవ్రమైన ఒత్తిడితో బాధపడేవారు తరచుగా స్నానం చేస్తూ ఉండాలి.

912

ఒత్తిడిని తగ్గించేందుకు ఏకాగ్రత కూడా బాగా పనిచేస్తుంది. అదేపనిగా క్యాండిల్ ను లేదా ఏదైన వస్తువును చూస్తూ ఉండండి. ఒక రకంగా ఇది మెడిటేషన్ లాంటిదే. ఒక వస్తువును అదేపనిగా చూస్తే ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుందట.
 

1012

కొన్ని పరిస్థితులు తప్పించుకోలేని విధంగా మనల్నిచుట్టుముడుతాయి. అలాంటి పరిస్థితులను వ్యతిరేకిస్తే దానివల్ల మీ ఒత్తిడి మరింత పెరుగుతుంది తప్ప తగ్గదు. అటువంటప్పుడు మీరు ఆ పరిస్థితులను Acceptచేయండి. అప్పుడే మీరు ఒత్తిడి నంచి బయటపడతారు.

1112

ఒత్తిడి నుంచి బటయపడటానికి పోషకవిలువలున్న ఆహారం కూడా ముఖ్యమే. అలాగే నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉండాలి. తాజా పండ్లు, కూరగాయనలు మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవాలి. 
 

1212

స్మోకింగ్, ఆల్కహాల్ ను తాగకూడదు. ముఖ్యంగా ఒత్తిడిని జయించాలంటే మీరు కంటినిండా నిద్రపోవాలి. అప్పుడే తీవ్రమైన ఒత్తిడి నుంచి బయటపడతారు.    

click me!

Recommended Stories