Cockroach: ఎంత శుభ్రం చేసినా వంటగదిలోకి, పడకగదిలోకి బొద్దింకలు వస్తూనే ఉంటాయి. బాత్‍రూం నుంచి ఎక్కువగా ఇంట్లోకి దూరిపోతాయి. అవి నడిచిన ఆహారం తినడం వల్ల రోగాలు పుట్టుకొస్తాయి. బొద్దింకల బెడద వదిలించుకోవాలంటే ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.
వంటగది అంటే కేవలం వంట చేసే చోటు కాదు, ఇంటిల్లిపాది ఆరోగ్యం అక్కడే ఉంటుంది. వంటగదిలో చిన్నగా చెత్త ఉన్నా బొద్దింకల బెడద మొదలవుతుంది. ఒక్కటి వస్తే దానివెంట వందలు పుట్టుకొస్తాయి. ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి. బాత్‍రూం నుంచి వంటగదిలోకి, వండిన ఆహారంపైకి చేరడంతో అనారోగ్యానికి కారణమవుతుంది. బొద్దింకలే అని లైట్ తీసుకోకండి. టైఫాయిడ్ వచ్చే ప్రమాదముంది. అయితే ఎన్ని ట్రై చేసినా బొద్దింకల బెడద తప్పడం లేదా?
29
లవంగాలు
మార్కెట్లో దొరికే స్ప్రేలలో రసాయనాలు ఉంటాయి, అవి ప్రమాదకరం. అందుకే ఇంట్లోనే సహజ పద్ధతుల్లో బొద్దింకలను తరిమికొట్టొచ్చు. వంటల్లో వాడే లవంగాలు రుచిని పెంచడమే కాదు, బొద్దింకలను కూడా తరిమికొడతాయి. వాటి ఘాటైన వాసనను బొద్దింకలు భరించలేవు. వంటగది డ్రాయర్లు, క్యాబినెట్లలో ఓ 8-10 లవంగాలు పెట్టి చూడండి. ఆ వాసనకు బొద్దింకలు రావు.
39
వంట సోడా, పంచదార
బేకింగ్ సోడా తిన్న వెంటనే బొద్దింకలు చనిపోతాయి. వంట సోడా, పంచదార పొడిని సమానంగా కలిపి వంటగది మూలల్లో, సింక్ కింద, క్యాబినెట్ల వెనుక చల్లాలి. పంచదార వాసనకు అక్కడికి వచ్చే బొద్దింకలు, బేకింగ్ సోడా తిని చనిపోతాయి.
వేపాకుల వాసన బొద్దింకలకు అస్సలు నచ్చదు. ఓ 5-6 వేపాకులను నలిపి వంటగది మూలల్లో పెట్టండి. ఈ వాసనకు బొద్దింకలు వెంటనే పారిపోతాయి.మీ ఇంట్లో బొద్దింకల సంఖ్య ఎక్కువగా ఉంటే, వేప నూనె వాడొచ్చు. వేప నూనెను నీటిలో కలిపి బొద్దింకలు ఉన్న చోట స్ప్రే చేయండి. లేదా వేప పొడిని కూడా బొద్దింకలు తిరిగే ప్రదేశాల్లో చల్లవచ్చు.
59
వెనిగర్
వంటగది నుంచి బొద్దింకలను తరిమికొట్టడానికి వెనిగర్ కూడా ఒక మంచి మార్గం. స్ప్రే బాటిల్‌లో వైట్ వెనిగర్, నీటిని సమానంగా కలపండి. రాత్రి వంటగది శుభ్రం చేశాక, గ్యాస్ స్టవ్, సింక్ చుట్టూ స్ప్రే చేయండి.
69
దాల్చినచెక్క
దాల్చినచెక్క కేవలం మసాలా దినుసు మాత్రమే కాదు, బొద్దింకలను నివారిస్తుంది కూడా. వంటగది మూలల్లో దాల్చినచెక్క పొడిని చల్లండి. దీని ఘాటైన వాసన బొద్దింకలు రాకుండా అడ్డుకుంటుంది.
79
నిమ్మరసం
నిమ్మరసం ఒక మంచి క్లీనింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. రెండు నిమ్మకాయల రసాన్ని ఒక బకెట్ నీటిలో కలిపి వంటగది నేలను తుడవండి. నిమ్మలోని సిట్రస్ వాసన, శుభ్రత.. బొద్దింకల సంతానోత్పత్తిని అడ్డుకుంటాయి.
89
పుదీనా నూనె
పుదీనా నూనె వాసనను బొద్దింకలు అస్సలు భరించలేవు. నీటిలో కొన్ని చుక్కల పుదీనా నూనె కలిపి స్ప్రే చేయండి. వంటగదిలో ఈ వాసన రాగానే బొద్దింకలు అక్కడి నుంచి పారిపోతాయి.
99
దోసకాయ తొక్కలు
మనం చెత్తలో పడేసే దోసకాయ తొక్కలు కూడా బొద్దింకలను తరిమికొట్టగలవు. దోసకాయ తొక్కలను ఒక అల్యూమినియం గిన్నెలో వేసి రాత్రంతా వదిలేయండి. దోసకాయ, అల్యూమినియం మధ్య జరిగే చర్య వల్ల వచ్చే వాసనను బొద్దింకలు భరించలేవు.