Kitchen Hack: కిచెన్‌లో ఈ ఒక్కటి ఉంటే చాలు.. పచ్చిమిర్చి పాడవ్వదు, వాడిపోదు!

Published : Mar 26, 2026, 04:29 PM IST

Kitchen Hack: పచ్చిమిర్చి మార్కెట్ నుంచి తెచ్చిన రెండ్రోజులకే పండిపోతున్నాయా? లేదా కుళ్లిపోతున్నాయా? అయితే మీరు ఒక చిన్న పని చేయట్లేదన్నమాట! ఇకపై ఈ 5 నిమిషాల సింపుల్ ట్రిక్ పాటించండి. పచ్చిమిర్చి కనీసం 20 రోజుల వరకు తాజాగా ఉంటాయి.

PREV
15
ఇదిగో అద్భుతమైన పరిష్కారం

చాలా ఇళ్లలో వినిపించే కామన్ కంప్లైంట్. పచ్చిమిర్చి వాడిపోవడం, లేదా కుళ్లిపోవడం. పచ్చిమిర్చిని ఎక్కువ కాలం నిల్వ చేయడానికి చిన్న విషయాలు పాటిస్తే చాలు నెల రోజుల వరకు కూడా తాజాగా ఉంటాయి. అయితే ఈ సమస్యకు అద్భుత పరిష్కారం ఉంది.

25
మిరపకాయలు తేగానే ఈ పని చేయండి

ముందుగా పచ్చిమిర్చిని నీటిలో శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత మిరపకాయల తొడిమలు తీసేయాలి. చాలా మంది చేసే తప్పు ఇదే. మార్కెట్ నుంచి పచ్చిమిర్చి తెచ్చి అలానే ఉంచేస్తారు. అలా అస్సలు చేయకూడదు. తొడిమలు తీశాక మిరపకాయలను పూర్తిగా ఆరబెట్టాలి. వాటిపై కొంచెం కూడా తడి ఉండకుండా తుడుచుకోవాలి. తర్వాత గాలి చొరబడని డబ్బాలో పెట్టుకోవాలి. అప్పుడు ఫ్రెష్‍గా ఉంటాయి.

35
15-20 రోజుల వరకు ఏమీ కాదు
మీరు తీసుకున్న ఎయిర్ టైట్ డబ్బాలో మిరపకాయలు పెట్టే ముందు ఈ స్టెప్ పాటించండి. * డబ్బా అడుగున ఒక టిష్యూ పేపర్ లేదా న్యూస్‌పేపర్ వేయాలి. * ఈ పేపర్ మిరపకాయల్లోని తేమను పీల్చుకుంటుంది. * దీనిపై పచ్చిమిర్చి వేసి, మూతపెట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి. * ఇలా చేస్తే కనీసం 15-20 రోజుల వరకు మిరపకాయలు తాజాగా ఉంటాయి.
45
ఇంకా ఎక్కువ రోజులు రావాలంటే ఈ పని చేయండి

మిరపకాయలు ఇంకా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి. వారానికి ఒకసారైనా డబ్బా తెరిచి, కాసేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. మధ్యమధ్యలో డబ్బా తెరిచి చెక్ చేయాలి. ఏదైనా మిరపకాయ కుళ్లినట్లు అనిపిస్తే వెంటనే తీసేయాలి. లేదంటే ఆ ఒక్క మిరపకాయ వల్ల మిగతావి కూడా పాడవుతాయి. 

55
పేస్ట్ చేసుకుంటే ఇలా ట్రై చేయండి

ఒకవేళ మీరు పచ్చిమిర్చిని పేస్ట్ చేసి నిల్వ చేయాలనుకుంటే, మిక్సీ పట్టేటప్పుడు ఒక చెంచా వంట నూనె, చిటికెడు ఉప్పు కలపండి. ఇలా చేస్తే ఫ్రిజ్‌లో పెట్టినా పేస్ట్ రంగు మారదు, రుచి కూడా సూపర్ ఉంటుంది. ఈసారి మీరు మార్కెట్‍కు వెళ్లినప్పుడు పచ్చిమిర్చి ఎక్కువగా తెచ్చేసుకోండి. పైన చెప్పిన టిప్ పాటించడం వల్ల ఎక్కువ రోజులు నిల్వఉంటాయి కాబట్టి…ఇంక భయం అక్కర్లేదు.

Read more Photos on
click me!

Recommended Stories