మీరు తినే ఉప్పు ఎక్కువా? తక్కువా?... మీ శరీరం ఏం చెబుతోంది?

First Published Jul 13, 2021, 2:11 PM IST

ఆహారంలో ఉప్పు ఎక్కువగా తినడం వల్ల హైపర్ టెన్షన్, గుండెజబ్బులు, గుండెపోటు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి.

ఉప్పు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్స్ ను మనకు తెలియకుండానే మన నిత్యజీవితంలో భాగం చేసేస్తాం. దీనివల్ల ఆరోగ్యాన్ని చేజేతులారా ప్రమాదంలో పడేసుకుంటాం.
undefined
ఆహారంలో ఉప్పు ఎక్కువగా తినడం వల్ల హైపర్ టెన్షన్, గుండెజబ్బులు, గుండెపోటు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి.
undefined
అందుకే ఆహారంలో ఎంత ఉప్పు తింటున్నాం అనేదానిమీద తప్పనిసరిగా నియంత్రణ ఉండాలి. అలాగని పూర్తిగా ఉప్పును వాడకుండా ఉండడం కూడా మంచిది కాదు.
undefined
అందుకే ఆహారంలో ఎంత ఉప్పు తింటున్నాం అనేదానిమీద తప్పనిసరిగా నియంత్రణ ఉండాలి. అలాగని పూర్తిగా ఉప్పును వాడకుండా ఉండడం కూడా మంచిది కాదు.
undefined
మరెలా అంటే.. నిత్యం మీరు తీసుకుంటున్న ఉప్పు మీ శరీరానికి సరిపోతుందా? ఎక్కువవుతుందా అనేది మీ శరీరమే మిమ్మల్ని హెచ్చరిస్తుంటుంది.
undefined
ముఖ్యంగా ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్నారనడానికి వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తుంది. వీటిని సరిగా పట్టుకుంటే... రాబోయే పెను ప్రమాదాలనుంచి ఈజీగా బయటపడొచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
undefined
ఎప్పుడూ దాహంగా అనిపించడం : ఉప్పు తినాలనే కోరిక.. ఉప్పుకు బానిసవ్వడం నోటి పూతకు కారణమవుతుంది. ఎక్కువగా తీసుకునే సోడియం వల్ల శరీరంలోని ఫ్లూయిడ్స్ బాలెన్స్ ను పాడు చేస్తుంది. దీనివల్ల మీ శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. అందుకే నిత్యం దాహంగా అనిపిస్తుంటుంది.
undefined
పొట్ట ఉబ్బరం : ఆహారంలో సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల పొట్ట ఉబ్బరం ఎక్కువవుతుంది. శరీరంలో నీరు తగ్గువవడం వల్ల... మీరు తినంగానే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. శరీరం నీటిని ఫ్రీగా పోనివ్వకుండా కణజాలాల్లో నిల్వ అయ్యేలా చేస్తుంది. దీనివల్ల నీటి వల్ల పెరిగే బరువు సమస్య ఎదురయ్యే అవకాశాలుంటాయి.
undefined
తలనొప్పి : తరచుగా తీవ్రంగా తలనొప్పి వస్తుండడం.. తలనొప్పి కంటిన్యూ అవుతుండడం శరీరంలో తగ్గిన నీటి శాతానికి, సోడియం స్థాయిల్లో మార్పుకు సూచిక. మీరు కనక దీంతో బాధపడుతున్నట్లైతే వెంటనే డిటాక్స్ కు ప్రయత్నించి చూడండి.
undefined
ఉప్పు మీ ఆహారానికి రుచికి జోడిస్తుంది. ఇది వాస్తవమే అయినప్పటికీ ఒక స్థాయిలో ఉప్పు వేస్తేనే ఆహారం రుచిగా మారినట్టుగా మీ శరీరం అలవాటు పడితే అది తగ్గించడం సాధ్యం కాదు. కాబట్టి ఈ విషయంలో కాస్త మార్పులు చేసుకోవాలి.
undefined
శరీరంలో వాపులు : సోడియం వల్ల శరీరంలోని నీరు బైటికి రాకుండా నిలిచిపోవడం వల్ల శరీరంలో వాపులు లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ చర్మం బిగుతుగా మారుతున్నట్లు అనిపించినా, ఉబ్బుతున్నట్టుగా పఫ్ఫీగా అనిపించినా వెంటనే అది ఉప్పు చేసే మాయగా గుర్తించాలి.
undefined
బాధ-నొప్పులు : ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు, స్కెలిటర్ ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. ఎక్కువ ఉప్పు తినడం కాల్షియం లాస్ కు దారితీస్తుంది. దీనివల్ల ఎముకలు బలహీనపడి క్రాంప్స్, నొప్పులకు దారి తీస్తాయి.
undefined
click me!