చాలామంది డ్రింక్స్‌లో ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగడం చూసే ఉంటారు. ఐస్ వల్ల నోటిలోని నరాలు మొద్దుబారిపోతాయి. అందుకే మద్యం చేదుగా అనిపించదని డాక్టర్ రాజు వివరిస్తున్నారు.
సోడా కలిపితే
మద్యంలో సోడా కలిపినప్పుడు, అందులోని గ్యాస్ కడుపులో ఉన్న ఆల్కహాల్‌ను వేగంగా చిన్న ప్రేగులోకి నెడుతుంది. దీనివల్ల ఆల్కహాల్ రక్తంలోకి చాలా స్పీడ్‌గా కలిసిపోయి 'కిక్' తొందరగా వస్తుంది. శరీరంపై వేగంగా ప్రభావం చూపే పద్ధతి ఇది.
కూల్స్ డ్రింక్స్ కలిపితే
స్ప్రైట్ లేదా ఇతర కూల్ డ్రింక్స్ కలిపినప్పుడు, వాటిలో ఉండే అధిక గ్లూకోజ్ (చక్కెర) శరీరంలో షుగర్ లెవెల్స్‌ను పెంచుతుంది. ఇది శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. అందుకే మరుసటి రోజు తీవ్రమైన హ్యాంగోవర్, తలనొప్పి వస్తాయని డాక్టర్ రాజు హెచ్చరించారు.