ట్రైకోమోనియాసిస్
ఇది పరాన్నజీవి ద్వారా వస్తుంది. ట్రైకోమోనియాసిస్ ప్రపంచవ్యాప్తంగా 3.7 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయినప్పటికీ ఈ ఎస్టీఐ ఉన్నవారిలో కేవలం 30 శాతం మంది మాత్రమే దీని లక్షణాలను కలిగి ఉంటారు. దీనివల్ల జననేంద్రియాల్లో దురద, మంట, ఎరుపు, అసౌకర్యం, మూత్రవిసర్జనలో ఇబ్బంది, చేపల వాసన, యోని నుంచి ఉత్సర్గ వంటివన్నీ ట్రైకోమోనియాసిస్ లక్షణాలే. ఇవి గనుక మీలో కనిపిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి.