Snake Finder APP: మీ ఫోన్ లో ఈ యాప్ ఉంటే...చుట్టుపక్కల ఎక్కడ పాము ఉన్నా ఈజీగా కనిపెట్టొచ్చు..!

Published : May 23, 2026, 01:58 PM IST

 Snake Finder APP: సడెన్ గా పాము కనపడితే ఎవరికైనా భయం వేస్తుంది. అలా కాకుండా.. అసలు పాము మన చుట్టూ ఉందో లేదో ఫోన్ లోని యాప్ ద్వారా తెలుసుకోవచ్చని మీకు తెలుసా? 

PREV
13
snakes

పల్లెటూళ్లలో పాములు కనిపించడం చాలా సాధారణం. అక్కడ చెట్టు, పొలాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి... పాములు ఎక్కువగా ఉంటాయి అనుకుంటాం. కానీ.. ఓ సర్వేలో తేలిన విషయం ప్రకారం.. కేవలం పల్లెల్లోనే కాదు.. హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా పాముల సంచారం చాలా ఎక్కువగానే ఉంది. ఎప్పుడు ఎవరి ఇంట్లో పాము కనపడుతుందో ఎవరికీ తెలియడం లేదు. అయితే.. మన ఫోన్ లో ఒక యాప్ ఉంటే.. పామును ఈజీగా కనిపెట్టొచ్చని మీకు తెలుసా? ఆ యాప్ ఏంటి? దానితో పామును ఎలా గుర్తించొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం...

23
పాములను కనిపెట్టే యాప్...

మనకు ప్ల స్టోర్ లో Big 4 Mapper serpent అనే యాప్ ఉంటుంది. దానిని మనం ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా.. మన చుట్టు పక్కల ఎక్కడ పాము ఉన్నా ఈజీగా తెలుసుకోవచ్చు. పల్లెటూళ్లలో, పొలాలు, అడవుల సమీప ప్రాంతాల్లో పాముల ముప్పు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ యాప్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ యాప్ ద్వారా పాములను గుర్తించి.. అప్రమత్తంగా ఉండటానికి, ఆ ప్రాంతానికి దూరంగా ఉండటానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది.

ఈ యాప్ ఎలా పని చేస్తుంది..?

ఈ యాప్ స్పెషల్ ఫీచర్ ఏంటంటే... పాము మీకు దగ్గరలో ఏ ప్లేస్ లో ఉందో కూడా చూపిస్తుంది. అంతేకాదు.. గతంలో పాము ఏయే ప్రాంతాల్లో తిరిగింది.. ఎక్కువ పాములు తిరిగే ప్రదేశాలు కూడా చూపిస్తుంది. రాత్రిపూట లేదా పొలాల్లో పనిచేసే వారికి ఈ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా.. పాములు తిరిగే ప్రదేశాలను గుర్తించి.. అటువైపు వెళ్లకుండా జాగ్రత్త పడొచ్చు.

33
పాములో విషం ఉందో లేదో కూడా చెప్పే యాప్..

ఈ యాప్ పాములను గుర్తించడంలో మాత్రమే కాదు.. మీరు చూసిన పాము విషపూరితమైనదో కాదో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఆ యాప్ లో అన్ని రకాల పాముల సమాచారం, వాటి ఫోటోలను అందిస్తుంది. దీని ద్వారా మీరు చూసిన పాములో విషం ఉందో లేదో.. మీరు గుర్తించొచ్చు.

పాము కాటు వేస్తే...

అంతేకాకుండా, పాముకాటుకు గురైనప్పుడు ఏం చేయాలో కూడా ఈ యాప్ చెబుతుంది. వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎలాంటి పొరపాట్లు చేయకూడదో సులభమైన భాషలో వివరిస్తుంది. ఎవరికైనా సులభంగా అర్థమయ్యేలా ఉంటుంది. మీకు కనుక పాముల భయం ఉంటే... ఈ యాప్ ని మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories