Brahma Sarovaram: జీవితంలో ఒక్కసారైనా బ్రహ్మసరోవరం చూసి రండి.. ఈ పవిత్ర సరస్సు ఎక్కుడుందంటే?

Published : Jun 28, 2026, 07:07 AM IST

Brahma Sarovaram: మానస సరోవరంలాగే బ్రహ్మసరోవరం కూడా పవిత్రమైన సరస్సు. అవకాశం దొరికితే చూడాల్సిన అందమైన ప్రదేశం కూడా. ఈ సరస్సును చూస్తే మానసిక ప్రశాంతత దక్కడమే కాదు జీవితంలో ఎన్నో మార్పులు కూడా కలుగుతాయి. 

PREV
13
బ్రహ్మ సరోవరం ఎక్కడుంది?

భారతదేశంలో ఎన్నో ఆధ్యాత్మిక, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో కురుక్షేత్ర నగరానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ప్రాంతంలోనే బ్రహ్మ సరోవరం కూడా ఉంది. ఇది పవిత్ర సరస్సులలో ఒకటి. హర్యానాలోని కురుక్షేత్ర నగరంలో ఉన్న ఈ సరోవరం కేవలం ఒక చెరువు మాత్రమే కాదు.. వేల ఏళ్ల చరిత్ర, పురాణ విశ్వాసాలు, ప్రకృతి అందాలను కలిపిన అద్భుతమైన ప్రదేశం. జీవితంలో ప్రశాంతత కావాలనుకునేవరు, ఒంటరిగా ప్రయాణించే వారికి ఈ సరస్సు సరైనది. ఈ ప్రాంతం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. సరస్సు చుట్టూ ఉండే పచ్చని వాతావరణం మనసుకు ప్రశాంతతను అందిస్తుంది.

23
ఆ పేరెలా వచ్చింది?

పురాణాల చెబుతున్న ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ ప్రాంతంలో యజ్ఞం నిర్వహించాడు. అందుకే ఈ సరస్సుకు బ్రహ్మ సరోవరం అనే పేరు వచ్చిందని చెబుతారు. మహాభారత కాలంతో కూడా ఈ ప్రాంతానికి అనుబంధం ఉందని అంటారు. కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన అనేక కథలు ఈ ప్రాంతంతో ముడిపడి ఉన్నాయి. అందుకే భక్తులు ఎంతో మంది పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో సరస్సు దగ్గర నిల్చొని చూస్తే ఎంతో అందంగా కనిపిస్తుంది. బ్రహ్మ సరోవరం చాలా విశాలమైన సరస్సు. ఈ సరస్సు చుట్టూ నడక మార్గాలు, కూర్చునే ప్రదేశాలు ఉండటంతో సందర్శకులు ప్రశాంతంగా సమయాన్ని గడపవచ్చు. ఒంటరిగా ప్రయాణించే వారికి ఇక్కడి ప్రశాంతత చాలా బాగా నచ్చుతుంది.

33
ప్రతి ఏడాది పండుగలు

ప్రతి సంవత్సరం అనేక పండుగలు, ప్రత్యేక కార్యక్రమాలు ఈ సరస్సు చుట్టు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో బ్రహ్మ సరోవరం భక్తులతో కళకళలాడుతుంది. ముఖ్యంగా గీతా జయంతి వంటి సందర్భాల్లో ఇక్కడ జరిగే వేడుకలు కళ్లారా చూడాల్సిందే. దీపాలతో అలంకరించిన సరస్సు ఎంతో అద్భుతంగా ఉంటుంది. చరిత్ర, ఆధ్యాత్మికత, ప్రకృతి అందాలు ఒకే చోట చూడాలనకుంటే బ్రహ్మ సరోవరానికి వెళ్లండి. ఇది కేవలం పర్యాటక ప్రదేశం మాత్రమే కాకుండా మనసుకు ప్రశాంతత ఇచ్చే ఆధ్యాత్మిక నిలయంగా నిలిచింది.

Read more Photos on
click me!

Recommended Stories