Cockroaches: ఇంట్లో బొద్దింకలు తిరుగుతున్నాయా? ఇదొక్కటి చేస్తే.. మళ్లీ ఇంట్లో బొద్దింకలు తిరగవు..!

Published : Sep 12, 2026, 06:59 PM IST

Cockroaches: కిచెన్ ని ఎంత శుభ్రంగా ఉంచినా.. బొద్దింకలు తిరుగుతూ కనపడుతున్నాయా? వాటిని పోగొట్టేందుకు కెమికల్ స్ప్రేలు వాడుతున్నారా? అవి లేకుండా కూడా ఇంట్లో ఉన్న పదార్థాలతో వాటిని మళ్లీ ఇంట్లోకి రాకుండా చేయచ్చు.

PREV
13
కిచెన్ లో బొద్దింకలు తిరుగుతున్నాయా?

బొద్దింకలు చాలా డేంజరస్. మనం ఇంటిని ఎంత శుభ్రం గా ఉంచుతున్నా కూడా.. ఎక్కడో ఒక చోట బొద్దింకలు కనిపిస్తూనే ఉంటాయి. అవి తిరుగుతూ ఉంటే.. అసహ్యంగా అనిపించడమే కాదు.. వాటి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే, బొద్దింక కనపడగానే మార్కెట్లో దొరికే.. ఏవేవో కెమికల్ స్ప్రేలు తెచ్చి..వాడేస్తూ ఉంటారు. అయితే.. ఆ కెమికల్ స్ప్రేల నుంచి వచ్చే వాసన పీల్చడం కూడా ఆరోగ్యానికి అంత మంచిదేమీ కాదు. చిన్న పిల్లలు ఉన్నప్పుడు మరింత ప్రమాదం. అందుకే, ఆ సమస్య లేకుండా.. సింపుల్ పదార్థాలతో.. ఆ బొద్దింకలను మళ్లీ కనిపించకుండా తరిమేయచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

23
బిర్యానీ ఆకులు..

దాదాపు మన అందరి ఇళ్ల్లో బిర్యానీ ఆకులు ఉంటూనే ఉంటాయి. వాటితోనే బొద్దింకలకు చెక్ పెట్టొచ్చు. బిర్యానీ ఆకుల ఘాటైన వాసన బొద్దింకలకు అస్సలు పడదు. కొన్ని ఆకులను నలిపి కబోర్డులు, డ్రాయర్లు, సింక్ కింద, ఆహార ధాన్యాల డబ్బాల దగ్గర ఉంచాలి. ఆ వాసన తగ్గకుండా ఉండటానికి ప్రతి కొన్ని రోజులకు ఒకసారి పాత ఆకులను తీసేసి కొత్తవి పెట్టాలి. అంతే.. మీకు బొద్దింకలు కనిపించవు.

లవంగాలు : 

లవంగాల ఘాటు వాసన బొద్దింకలను సమర్థవంతంగా నివారిస్తుంది. వంటింటి మూలల్లో, మసాలా దినుసుల అలమరాల్లో, సింక్ కింద లవంగాలను ఉంచడం వల్ల బొద్దింకలు రాకుండా ఉండటమే కాకుండా వంటిల్లు మంచి సువాసనతో ఉంటుంది.

33
దాల్చిన చెక్క పొడి :

దాల్చినచెక్క సువాసన బొద్దింకలను ఇంట్లోకి రాకుండా నిరోధిస్తుంది. కిటికీలు, గుమ్మాలు, ఫ్రిజ్ వెనుక భాగం , సింక్ కింద కొద్దిగా దాల్చినచెక్క పొడిని చల్లాలి లేదా చిన్న చిన్న దాల్చిన చెక్క ముక్కలను బొద్దింకలు ఎక్కువగా తిరిగే చోట ఉంచాలి.

కాఫీ పొడి:

వాడిన కాఫీ పొడికి ఉన్న ఘాటైన వాసన బొద్దింకలను నివారించడంలో బాగా సహాయపడుతుంది. చిన్న చిన్న గిన్నెలలో కాఫీ పొడిని వేసి బొద్దింకలు కనిపించే ప్రదేశాల్లో ఉంచాలి. అయితే బూజు పట్టకుండా ఉండటానికి ఈ పొడిని క్రమం తప్పకుండా మారుస్తూ ఉండాలి.

నిమ్మకాయ తొక్కలు :

నిమ్మకాయల సిట్రస్ వాసన కూడా బొద్దింకలను దూరంగా ఉంచుతుంది. తాజా నిమ్మకాయ తొక్కలను చెత్తబుట్టల దగ్గర, డ్రెయిన్ హోల్స్ వద్ద, సింక్ కింద,చీకటి మూలల్లో ఉంచాలి. తొక్కలు ఎండిపోయి వాసన తగ్గినప్పుడు వాటిని మార్చాలి.

వంటింటిని ఎప్పుడూ శుభ్రంగా, తడి లేకుండా ఉంచుకుంటూ ఈ చిన్న చిన్న వంటింటి చిట్కాలను పాటిస్తే కెమికల్ స్ప్రేల అవసరం లేకుండానే బొద్దింకల బెడద నుండి శాశ్వతంగా ఉపశమనం పొందవచ్చు. వీటి కారణంగా.. ఎలాంటి సమస్య ఉండదు. పైగా బొద్దింకలు కూడా కనిపించకుండా పోతాయి.

Read more Photos on
click me!

Recommended Stories