రుచికరమైన కట్టె పొంగలి ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది..!

Published : Jan 14, 2023, 01:47 PM ISTUpdated : Jan 14, 2023, 01:48 PM IST

వెన్ పొంగలి లేదా కట్టె పొంగలి టేస్ట్ లో ది బెస్ట్ అనిపించుకుంటుంది. అందుకే ప్రతి పండగకు, ప్రత్యేకమైన రోజులకు తప్పకుండా దీనిని తయారుచేస్తుంటారు.  ఈ సంక్రాంతికి మీరు కట్టె పొంగలిని తయారుచేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది. 

PREV
15
 రుచికరమైన కట్టె పొంగలి ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది..!

దక్షిణ భారతీయులకు ఇష్టమైన వంటకాల్లో కట్టె పొంగలి ఒకటి. దీన్ని ప్రసాదంగా కూడా దేవాలయాల్లో పెడుతుంటారు. తర్వాతి కాలంలో చాలా మంది దీన్ని బ్రేక్ ఫాస్ట్ గా కూడా తీసుకుంటున్నారు. ఈ కట్టె పొంగలిని తెలుగు వారికంటే తమిళనాడులోనే ఎక్కువగా తయారుచేసుకుని తింటుంటారు. అసలు దీన్ని ఎలా తయారుచేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.. 

25

కట్టె పొంగలికి కావాల్సిన పదార్థాలు

1/2 కప్పుల బియ్యం

1/2 కప్పుల పెసరపప్పు

2 టేబుల్ స్పూన్ల నెయ్యి

1/2 టీ స్పూన్ల జీలకర్ర

1 టీస్పూన్ ఆవాలు, 

అల్లం

కరివేపాకు

10 జీడిపప్పులు

2 pinches ఇంగువ

ఒకటి ఎండు మిరపకాయ

రుచికి సరిపడా ఉప్పు
 

35

చక్కెర పొంగలి (Chakkera pongali) తయారీ విధానానికి కావలసిన పదార్ధాలు: ముప్పావు కప్పు బియ్యం (Rice), పావు కప్పు పెసరపప్పు (Moong dal), సగం స్పూన్ యాలకుల పొడి (Cardamom powder), చిటికెడు పచ్చ కర్పూరం (Emerald camphor), నెయ్యి (Ghee), సగం కప్పు బెల్లం (Jaggery), ముప్పావు కప్పు చక్కెర (Sugar) జీడిపప్పు (Cashew), కిస్మిస్ (Raisins).

45

తయారీ విధానం

ఇకపోతే ముందుగా బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి అర్థగంట పాటు నానబెట్టండి. ఆ తర్వాత స్టవ్ పై బాణలీ పెట్టి అందులో పెసరప్పును కొద్దిగా వేపుకోండి. అంటే మంచి వాసన వచ్చే వరకు.  తర్వాత కిందికి దించేసి కడగండి. ఆ తర్వాత మందపాటి అడుగున్న గిన్నెను తీసుకుని అందులో పెరసపప్పు, బియ్యం, నీళ్లు, కొద్ది ఉప్పు వేసుకుని స్టవ్ పై పెట్టండి. దీన్ని మీడియం ఫ్లేం లో ఉచికించుకోండి. అన్నం మెత్తగా ఉడినంక కిందికి దించండి. 

55

పొంగల్ ను కుక్కర్ లో తయారుచేస్తే అన్నింటినీ వేసి ఐదు విజిల్స్ వచ్చేదాకా ఉంచండి. ఆ తర్వాత తాలింపు వేసుకుంటే సరి. ఇక తాలింపు కోసం.. స్టవ్ పై ఒక బాణలీ పెట్టి అందులో నెయ్యిని వేయండి. అది కొద్దిగా వేడి అయిన తర్వాత దానిలో మిగిలిన పదార్థాలను వేసి నిమిషం పాటు వేయించి కిందకి దించి పొంగలీలో కలపండి. అంతే వేడివేడి కట్టె పొంగలి రెడీ అయినట్టే.. 


 


 

click me!

Recommended Stories