ROSE DAY 2024: ప్రేమించిన వారికి ఈ కలర్ గులాబీ పువ్వును మాత్రం ఇవ్వకండి

First Published | Feb 7, 2024, 9:49 AM IST

ROSE DAY 2024: ఈ రోజు నుంచి వాలెంటైన్ వీక్ స్టార్ట్ అయ్యింది. ఈ వారంలో మొదటి రోజును రోజ్ డేగా జరుపుకుంటారు. ఈ ప్రేమికులు తమ ప్రేయసికి గులాబీలు ఇచ్చి మనస్సులోని మాటను తెలియజేస్తారు. అయితే మనకు ఎన్నో రంగుల్లో గులాబీ పువ్వులు దొరుకుతాయి. ఒక్కో రంగు గులాబీ ఒక్కో అర్థాన్ని ఇస్తుంది. అందుకే ఏ రంగు గులాబీ పువ్వును ప్రేయసికి ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ప్రేమికులకు ఫిబ్రవరి నెల చాలా చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ప్రేమికుల దినోత్సవం ఈ నెల 14 నే జరుపుకుంటారు కాబట్టి. కాగా వారం రోజుల ముందు నుంచే అంటే ఫిబ్రవరి 7 నుంచి వాలెంటైన్ వీక్ స్టార్ట్ అవుతుంది. ఈ వాలెంటైన్స్ వీక్ లో మొదటి రోజును రోజ్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజు ప్రేమించి అమ్మాయిలకు గులాబీ పువ్వులు ఇచ్చి వాళ్లు ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్తారు. అయితే ఎర్ర గులాబీలతో పాటుగా తెల్ల, నారింజ అంటూ గులాబీలు ఎన్నో రంగుల్లో ఉంటాయి. మీరు మాట్లాడకున్నా.. మీ మాటలన్నీ గులాబీ పువ్వు ద్వారా తెలియజేయొచ్చు. అవును మరి కొన్ని రంగుల గులాబీ పువ్వులు మీ భావాలను అవతలి వారికి అర్థమయ్యేలా చేస్తాయి. అందుకే లవర్ కు ఏ కలర్ గులాబీ పువ్వు ఇవ్వాలి? ఏ రంగు గులాబీ పువ్వు ఎలాంటి సందేశాన్ని ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

Image: Getty Images

పింక్ కలర్ గులాబీలు

పింక్ కలర్ గులాబీ పువ్వులు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. అయితే ఈ రంగు గులాబీ పువ్వులను ఎవరికైనా కృతజ్ఞతలు తెలిపేందుకు ఇస్తారు. అలాగే మీరు ఎవ్వరినైనా ఇష్టపడుతున్నట్టైతే ఈ రంగు గులాబీ పువ్వును ఇవ్వండి. ఈ కలర్ గులాబీ పువ్వును శుభప్రదంగా భావిస్తారు. 
 


ఆరెంజ్ రోజ్

నారింజ రంగు గులాబీ ఆనందానికి సంకేతం. ఈ రంగు గులాబీలను మీకు బాగా నచ్చిన వారికి కూడా ఇవ్వవచ్చు. ఏమీ చెప్పకుండానే మీ మనస్సులోని ప్రతి మాట వారికి అర్థమవుతుంది. ఈ రంగు పువ్వు మంచి పద్ధతిలో మీ ప్రేమను సూచిస్తుంది. రిలేషన్ షిప్స్ లో మీరు ఎంత ఓపికగా ఉన్నారో ఈ రంగు చెబుతుంది. ఈ గులాబీని మీరు ఇష్టపడే వారికి ఇవ్వొచ్చు.
 

పసుపు రంగు గులాబీ

మీరు ఎవరితోనైనా స్నేహం చేయాలనుకుంటే వారికి గులాబీ పువ్వును ఇవ్వండి. మీకు తెలుసా? ప్రేమ స్నేహంతో మొదలవుతుంది. ఇది కాకుండా ఈ రంగు మీ సంరక్షణ స్వభావాన్ని కూడా చూపిస్తుంది. పసుపు గులాబీలను స్నేహానికి చిహ్నంగా భావిస్తారు. రోడ్ డే నాడు ఈ గులాబీని ఇవ్వడం వల్ల మీరు మీ స్నేహాన్ని మరింత ప్రత్యేకంగా, అందంగా మార్చుకోవచ్చు.
 

తెల్లని గులాబీ

తెల్ల గులాబీలు శాంతికి, స్వచ్ఛతకు చిహ్నం. మీకు ఒకరిపై మంచి అభిప్రాయం ఉంటే , అతనితో జీవితాన్ని గడపాలని ఆలోచిస్తుంటే.. మీ భావాలను ఈ అందమైన తెల్లని గులాబీల ద్వారా తెలియజేయొచ్చు. మీ కోపాన్ని, బాధలను తొలగించడానికి సంబంధాలను శాంతపరచడానికి ఈ గులాబీని ఇవ్వొచ్చు.
 

Peach Roses:

పీచ్ రోజ్

ఈ గులాబీ పువ్వులను ఇస్తున్నారంటే.. మీరు వారికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారని అర్థం. కాబట్టి మీ జీవితంలో ఇలాంటి వారు ఎవరైనా  ఉంటే.. వారి రాక మీ జీవితాన్ని మంచిగా, సంతోషంగా మారుస్తుంది. ఈ రోజ్ డే సందర్బంగా మీరు పీచ్ కలర్ రోజా పువ్వును ఇచ్చి ధన్యవాదాలు చెప్పండి. ప్రేమను వ్యక్తపరచలేని వారు తమ భాగస్వామికి పీచ్ గులాబీలు ఇవ్వొచ్చు. ఇది మీ ప్రేమ సందేశాన్ని ఆ వ్యక్తికి తెలియజేస్తుంది.

black rose

బ్లాక్ రోజ్

నలుపు రంగు గులాబీలను అంత శుభప్రదంగా భావించరు. ఈ రకమైన గులాబీని ఇవ్వడం అంటే మీరు ఆ వ్యక్తికి దూరంగా ఉండాలనుకుంటున్నారని అర్థం వస్తుంది. అందుకే ప్రేమించిన వారికి ఈ గులాబీలను ఇవ్వకూడదు.
 

ఎర్ర గులాబీలు 

ఎరుపు గులాబీలను ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. రోజ్ డే రోజున ఈ గులాబీని ఇస్తే.. మీ ప్రేమ వారికి తెలుస్తుంది. ఒకవేళ మీకు మీ ప్రేమను మాటల్లో చెప్పడం రాకపోతే  మీరు ఈ గులాబీని ఇవ్వొచ్చు. ఇది మీ ప్రేమను వారికి తెలియజేస్తుంది. 
 

Latest Videos

click me!