అందమైన గులాబీలు ప్రేమకు, అభిరుచికి ప్రతీకగా భావిస్తారు. మీకు తెలుసా? ఈ గులాబీలను ప్రతి సందర్భానికి ఉపయోగిస్తారు. అంటే ప్రపోజ్ చేయడానికి, ఒకరికి వీడ్కోలు పలకడానికి, డెకరేట్ చేయడానికి అంటూ ప్రతి సందర్బానికి ఉపయోగిస్తారు. గులాబీల ద్వారా మనం ఎన్నో భావాలను వ్యక్తపరచొచ్చు. అందుకే గులాబీలకు అంత ప్రాచుర్యం ఉంది. మనకు గులాబీలు ఎరుపు, తెలుపు, పసుపు పచ్చ, నలుపు అంటూ ఎన్నో రంగుల్లో దొరుకుతాయి. అయితే ప్రేమికులు మాత్రం ఎక్కువగా ఎరుపు రంగు గులాబీలనే ఉపయోగిస్తారు. మరి రేపు రోజ్ డే కాబట్టి.. నచ్చిన చెలికి అందమైన గులాబీతో ఎలా విషెస్ చెప్పాలో తెలుసుకుందాం పదండి..