Panipuri Water: పానీపూరి వాటర్ ఇష్టంగా తాగుతున్నారా? ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

Published : Feb 13, 2022, 11:16 AM IST

Panipuri Water: పానీపూరీని ఇష్టంగా లాగించేస్తున్నారా..? అయితే ఈ విషయాలను ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిందే. మీకు తెలుసా.. పానీ పూరీ వాటర్ ను అతిగా తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోకతప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

PREV
14
Panipuri Water: పానీపూరి వాటర్ ఇష్టంగా తాగుతున్నారా? ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

Panipuri Water: పానీపూరీని ఓ రేంజ్ లో లాగించేవారు చాలా మందే ఉన్నారు. ఉదయం సాయంత్రం అంటూ తేడా లేకుండా వీటిని లాగించేస్తుంటారు. ఇక సాయంత్రం వేళల్లో అయితే కాలేజీ పిల్లలు వీటిని తెగ తింటూ ఉంటారు. అందులోనూ ఈ పానీపూరీ నీళ్లను తెగ తాగేస్తుంటారు. కాలేజీ పిల్లలే కాదు పెద్దలు కూడా ఈ పానీపూరీలకు అభిమానులుగా మారారు. ఇక పట్టణాల్లో పానీ పూరీ బండి ఎక్కడ కనిపించినా దాని చుట్టూ 10 నుంచి 20 మంది పోగై ఉంటారు. అంతేకాదు చేతిలో కప్పులతో దర్శనమిస్తుంటారు. అంతగా నచ్చేస్తుంది జనాలకు ఈ పానీపూరీ. అయితే ఈ పానీపూరీ ఆరోగ్యానికి అంతగా మంచిది కాదని ఆరోగ్య  నిపుణులు ఇప్పటికే తేల్చి చెప్పారు. వీటిని తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

24

పానీపూరీ వాటర్ లో కలిపే అన్ని పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేసేవే. జీలకర్ర, చింతపండు, పుదీనా, మంచినీళ్లతో కలిపి పానీపూరీ వాటర్ ను తయారుచేస్తారు. ఇకపోతే ఈ వాటలో ఉప్పును మోతాదుకు మించి వేస్తే ఆరోగ్యానికి అన్ని విధాలా మంచే జరుగుతుంది. కాగా ఈ వాటర్ ఇంట్లోనే తయారు చేస్తేనే ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ప్రస్తుతం పానీపూరీ వాటర్ లో వివిధ రకాల మసాలాలతో రెడీ టూ మిక్స్ లాగా తయారు చేస్తేస్తున్నారు. జీలకర్ర, ఎండు మామిడి ముక్కలు, రాళ్ల ఉప్పుడు, బ్లాక్ సాల్ట్ , నల్ల మిరియాలు, ఎండు అల్లం, సిట్రిక్ యాసిడ్, చింతపండు వంటివి మసాలాలు వేసి ఈ వాటర్ ను తయారుచేస్తున్నారు. ఇకపోతే ఈ నీరు మరింత రుచికరంగా మారడానికి ఉప్పును ఎక్కువగా వేస్తున్నారు. ఇది ఆరోగ్యనికి ఏమాత్రం మంచిది కాదు.

34

వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు పానీపూరీకి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ వాటర్ వెయిట్ లాస్ అవకుండా చేస్తుంది. అంతేకాదు ఈ పూరీలను నూనెలో బాగా వేయిస్తారు. అలాగే ఈ పానీపూరీ వాటర్ లో ఉప్పును ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తారు. వీటిని తినడం వల్ల శరీర బరువు మరింత పెరిగే ప్రమాదముంది. ముఖ్యంగా ఈ పానీపూరీ వాటర్ లో ఉండే ఉప్పు మన శరీరంలో నీటి నిల్వను పెంచేస్తుంది.  తద్వారా శరీర బరువు మరింత పెరిగే ప్రమాదముంది. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు పూనీ పూరీని తినకపోవడమే బెటర్. 

44


ఈ పూరీలను మైదా పిండి, రవ్వతో తయారుచేస్తారు. కాగా ఈ మైదా పిండి మన శరీరానికి ఎంతో హానీ చేస్తుంది. అందులోనూ ఈ పూరీలను డీప్ ఫ్రై చేస్తారు. దీనివల్ల మన ఆరోగ్యం మరింత ప్రమాదంలో పడే అవకాశముంది. నూనెలో వేయించిన పూరీలను తీసుకోవడం వల్ల మన శరీరంలో ప్రమాదరకమైన టాక్సిన్లు చేరతాయి. కాబట్టి పానీపూరీలకు దూరంగా ఉండండి. అందులోనూ ఫూట్ పాత్ పై అమ్మే పానీపూరీలను ఏమాత్రం శుభ్రంగా తయారుచేయరు. అంతేకాదు అపరిశుభ్రమైన నీటితో ఈ వాటర్ ను తయారు చేస్తారు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం మరింత దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

click me!

Recommended Stories