Happy Kiss Day 2022: ముద్దుతో మురిపించేయండి.. కిస్ తో ఎన్నో లాభాలున్నాయో తెలిస్తే అస్సలు ఆగలేరు తెలుసా..

First Published | Feb 13, 2022, 10:14 AM IST


Happy Kiss Day 2022: ప్రేమికులకు ఎంతో ఇష్టమైన కిస్ డే రానే వచ్చింది. ఇక ఈ రోజు తమ ప్రేయసి లేదా ప్రియుడు అందంగా ముద్దుని ఇస్తాడని తెగ ఇదై పోతుంటారు. అంతే కాదు వారిచెంతనుంటే ముఖం సిగ్గుతో నిండిపోతుంది. మరి ఈ అందమైన కిస్ డే రోజు ముద్దుతో ఎన్ని లాభాలున్నాయో తెలుసుకుందాం పదండి..
 

Happy Kiss Day 2022: ప్రేమ ఎంతో మధురమైంది. ఆ ప్రేమలో అలకలు, బుజ్జగింపులు, చిన్న చిన్న కోపతాపాలు, ముద్దు ముచ్చట్లు ఇలా.. ఎన్నో ఉంటాయి. ఇక ప్రేమికులకు కాస్త అవకాశం వచ్చిందంటే చాలు తమ ప్రేమను తెలియజేయడానికి ఏ మాత్రం వెనకాడరు. అందులో ప్రేమికులకు ముద్దుంటే మహా ఇష్టం. అందుకే తమ లవర్లను ఒక ముద్దు ఇవ్వవా అంటూ ప్రేమగా బ్రతిమిలాడుతుంటారు.

ఇకపోతే ఇప్పుడు వాలెంటైన్ వీక్ నడుస్తోంది. రోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, హగ్ డే.. అంటూ ప్రతి రోజును ప్రేమికులు అందంగా , ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక ఈ రోజు ప్రేమికులకు ఎంతో ఇష్టమైన కిస్ డే రానే వచ్చింది. ఈ రోజు తమ లవర్లు అందమైన ముద్దు ఇస్తారని ఆశగా ఎదురుచూస్తుంటారు. అంతేకాదు ఏకాంత సమయంలో అందమైన ముద్దుతో తమ ప్రేమను తెలియజేసుకుంటుంటారు. 
 

Latest Videos


వన్స్ మీ లవర్ ముద్దు ముచ్చటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనుకో.. ఆ ముద్దును అస్సలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే ముద్దుతో ప్రేమను, తమ కోరిక తేలియజేసేందుకే కాదు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఈ వెచ్చని ముద్దు మనసుకు ఎంతో హాయినిస్తుంది. ఇది కేవలం ప్రేమికులకే కాదు స్నేహితులకు, తల్లిదండ్రులకు, పెంపుడు జంతువులకు కూడా మనస్సుకు ఊరటను కలిగిస్తుంది. ఒక వ్యక్తికి మీ పట్ల  కలిగే భావోద్వేగాన్ని తెలిజేసేందుకు ముద్దు ఎంతో ఉపయోగపడుతుంది. ముద్దు పెట్టుకున్న క్షణ కాలం పాటు వారెంతో అనుభూతికి లోనవుతారు. అంతేకాదు మాటల్లో చెప్పలేని ఎన్నో విషయాలను ఈ ముద్దు వ్యక్తపరుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ముద్దు ముచ్చట వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం పదండి..
 

Image: Getty Images


ముద్దు పెట్టుకోవడం వల్ల మన శరీరంలో ‘హ్యాపీ హార్మోన్లు’ రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్లు ఒత్తిడి కలిగించే హార్మోన్లను తగ్గిస్తాయి. అంతేకాదు లిప్ కిస్ చేయడం వల్ల పెదవులపై ఉండే నరాలు మధురమైన అనుభూతిని పొందుతాయి. ఆ సమయంలో మనస్సు ఆహ్లాదరకంగా మారుతుంది.

నుదిటిపై లేదా, చెంపపై వెచ్చని ముద్దు ఇవ్వడం వల్ల మీ భాగస్వామికి భావోద్వేగానికి లోనవుతాడు. అతని మనస్సు ఆనందంతో నిండిపోతుంది. అంతేకాదు ఈ ముద్దు వారికి సరికొత్త ఉత్సాహాన్ని కూడా కలిగిస్తుంది. 

లిప్ కిస్ సెక్సువల్ ఫీలింగ్ ను కలిగిస్తాయి. అంతేకాదు ప్రేమికులను లేదా భార్యా భర్తలకు ఈ కిస్ రొమాంటిక్ ఫీలింగ్ లోకి తీసుకెళ్తుంది. ఆ తర్వాత వారు సరికొత్త మైకంలోకి వెళతారు. అంతేకాదు ముద్దు ఎక్కువ సేపు కొనసాగితే వారిని హద్దులు దాటేలా చేస్తుందట.

తీవ్రమైన తలనొప్పితో బాధపడే వారికి ముద్దు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. తలనొప్పి ఎంతకీ తగ్గకపోతే మీ పార్టనర్ కు చిరు ముద్దు ఇచ్చి చూడండి. మీ తలనొప్పి క్షణాల్లో మటుమాయం అవుతుంది. 

మీకు తెలుసా.. ముద్దు పెట్టుకోవడం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాదు ఈ ముద్దు Blood pressure ను తగ్గించడంతో పాటుగా Heart rate ను కూడా నియంత్రించగలదని నిపుణులు చెబుతున్నారు.
 

ముద్దుతో రక్త ప్రవాహం కూడా మెరుగుపడుతుంది. అలాగే తీవ్రమైన ఒత్తిడి, కుంగుబాటుకు కూడా తొలగిస్తుంది. ముఖ్యంగా ముద్దుపెట్టుకోవడం వల్ల శరీరానికి అయిన గాయాల నొప్పి కూడా తగ్గిస్తుంది. కిస్ చేసినప్పుడు రక్తనాళాల విస్తరణ వల్ల గాయాల వల్ల కలిగే నొప్పి మటుమాయం అవుతుందట.

కిస్ చేయడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. అంతేకాదు దంతాలు కూడా ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా ముద్దుతో మన మానసిక స్థితి కూడా స్థిరంగా ఉంటుంది. ముద్దు పెట్టుకోవడం వల్ల మన నోట్లో ఏర్పడే లాలాజలం దంతాక్షయంలో పోరాడగలదు.
 

లిప్స్ పై కిస్ చేయడం వల్ల దవడ, మెడ కండరాలకు వ్యాయామం అవుతుంది. అంతేకాదు కిస్ చేసినప్పుడు మన శరీరంలో ఆక్సిటోసిన్, సెరోటోనిన్ వంటి రసాయనాలు రిలీజ్ అవుతాయి. అవి మనం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. అంతేకాదు ఇవి మన శరీరం లిరాల్స్ అయ్యేలా చేస్తాయట. 

మీకు తెలుసా కిస్ చేసే సమయంలో మన ముఖంలోని 122 పోస్ట్రల్ కండరాలు, 34 కండరాలు ఏత్తేజంగా మారతాయి. దానివల్ల మనం ముఖంలో సరికొత్త గ్లో వస్తుంది. ఇకపోతే బరువు తగ్గాలనుకునే వారికి ముద్దు దివ్య ఔషదంలా పనిచేస్తుంది. ఒకవేళ మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మీ పార్టనర్ ను ముద్దులతో ముంచెత్తక తప్పదు. లిప్ లాక్ కిస్సే ఇందుకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అదరాలతో యుద్దం చేసినప్పుడే మీ శరీరంలోని క్యాలరీలు ఖర్చవుతాయి కాబట్టి. ఒక నిమిషం లిప్ లాక్ కిస్ ఇచ్చుకోవడం వల్ల మన బాడీలో  2 నుంచి 3 క్యాలరీలు కరుగుతాయి. ఇక ఈ కిస్ డే రోజు మీరు ఎన్ని క్యాలరీలను కరింగించుకోవాలనుకుంటున్నారో మీ ఇష్టం. 

click me!