BP Control: బీపీని ఇలా కంట్రోల్ చేయండి..

Published : Apr 03, 2022, 02:00 PM IST

BP Control: మానసిక ఒత్తిడి, మారుతున్న లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు వంటి కారణాల వల్ల ఎంతో మందికి హై బీపీ సమస్య వస్తుంటుంది. ఈ సమస్యను నియంత్రించాలంటే.. 

PREV
110
BP Control: బీపీని ఇలా కంట్రోల్ చేయండి..

మారుతున్న మన జీవన  విధానం, చెడు ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి, కుబుంబ పరిస్థితుల కారణంగా నేడు ఎంతో మంది హై బీపీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ బీపీని నియంత్రణలో ఉంచుకోవడానికి ఎన్నో మందుబిల్లలను మింగుతున్నారు. ఇవి వీరి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. 

210

బీపీని నియంత్రించడానికి మందుబిల్లలను మింగడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి బీపీని సహజసిద్దంగానే కంట్రోల్ చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం వైద్యులు సూచించిన టిప్స్ మీ కోసం.. 
 

310

ఉపవాసం చేయడం వల్ల కూడా హైపర్ టెన్షన్ ను కంట్రోల్ చేసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఉపవాసం చేస్తే హైబీపీ దానికదే నియంత్రణలోకి వస్తుందట. కాబట్టి బీపీ మందుబిల్లలను మింగడం మానేసి అప్పుడప్పుడు ఉపవాసం చేయండి. అదికూడా  వైద్యుడిని సంప్రదించిన తర్వాతే. 
 

410

కూరల్లో ఉప్పు ఎక్కువుగా వేసుకున్నా.. బీపీ మరింత పెరిగిపోయే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి మీ ఆహార పదార్థాల్లో ఉప్పును వీలైనంత తగ్గించండి. అప్పుడే మీ బీపీ నియంత్రణలో ఉంటుంది. 

510
High Blood pressure

హై బీపీ సమస్యతో బాధపడేవారు ఆల్కహాల్ కు వీలైనంత దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆల్కహాల్ వల్ల మీ సమస్య మరింత పెరుగుతుంది కాబట్టి. ఇది మానేస్తేనే మీ బీపీ కంట్రోల్ లో ఉంటుంది. 

610

హైబీపీ పేషెంట్స్ మాంసాహారాన్ని తినడం తగ్గించాలలి. దీన్ని తినడం వల్ల కూడా బీపీ  పెరుగుతుంది. ఎప్పుడన్నా ఒకసారి తింటే మీ బీపీ నియంత్రణలో ఉంటుంది. 

710

హైబీపీ పేషెంట్స్ ఎక్కువుగా పండ్లు, కూరగాయలు, ఆకు కూరలను ఎక్కువగా తింటూ ఉండాలి. వీటివల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. ఇవి వీరి ఆరోగ్యానికి ఎంతో మంచివి కూడా. 

810

మొక్కల ఆధారిత ఫుడ్ ను తీసుకోవడం వల్ల బీపీ 7 పాయింట్లు తగ్గుతుందని వైద్యులు తేల్చి చెబుతున్నారు. అలాగే తక్కువ మాంసం, మొక్కల ఆధారిత ఫుడ్ ను కలిపి తీసుకుంటే 11పాయింట్ల బీపీ తగ్గుతుందట. 

910

హై బీపీ సమస్యతో బాధపడేవారు నిత్యం ఆల్కహాల్ ను తీసుకోవడం మానేయాలి. ఇలా మానేస్తేనే 5 పాయింట్ల బీపీ తగ్గుతుందని సర్వేలు చెబుతున్నాయి. 

1010

ఏరోబిక్ వ్యాయామాల వల్ల కూడా బీపీ తొమ్మిది పాయింట్లు తగ్గుతుందట. అలాగే ఉప్పును తగ్గించడం వల్ల పదిహేను పాయింట్ బీపీ తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇవన్నీ వైద్యుడి సలహాలు, సూచనలు తీసుకునే పాటించాలి. 

click me!

Recommended Stories