షేవింగ్ తర్వాత దురదా..? ఇలా చెక్ పెట్టండి

First Published | Nov 1, 2024, 2:33 PM IST

షేవింగ్  తర్వాత చాలా కామన్ గా అందరికీ దురద వస్తూ ఉంటుంది. కొందరికి అయితే.. ర్యాషెస్ కూడా వస్తూ ఉంటాయి. అయితే.. వాటిని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

షేవింగ్ తర్వాత చాల ామందికి  చర్మం ఎర్రగా మారుతుంది. అంతేకాదు.. దురద కూడా వచ్చేస్తుంది. కందరికి అయితే.. రేజర్ కట్స్ కూడా వస్తాయి. సున్నితమైన చర్మం ఉండటం ఒక కారణం అయితే.. షేవింగ్ క్రీమ్ వల్ల కూడా ఈ సమస్య రావచ్చు.

షేవింగ్ తర్వాత దురద తగ్గించుకోవడానికి చాలా రకాల క్రీములు వాడుతుంటారు. కానీ, అవి కొన్నిసార్లు చర్మానికి హాని కలిగిస్తాయి. షేవింగ్ తర్వాత దురద ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ఇక్కడ చూడండి.


షేవింగ్ తర్వాత దురద ఎందుకు?

షేవింగ్ క్రీమ్ లో కలబంద లాంటివి ఉంటాయి. అయినా దురద ఎందుకు వస్తుంది? షేవింగ్ చేసేటప్పుడు అన్ని వెంట్రుకలు తీసేయాలని లేదు. అన్ని వెంట్రుకలు తీసేసినా దురద రావచ్చు. చర్మంలోని చిన్న చిన్న బొడిపెలు, లోపలికి పెరిగే వెంట్రుకలు కూడా దురదకు కారణం కావచ్చు. దురదను పూర్తిగా ఆపలేం కానీ, తగ్గించుకోవచ్చు.

దురద తగ్గించుకోవడం ఎలా?

కలబంద జెల్

షేవింగ్ తర్వాత ఎర్రగా, దురదగా ఉంటే కలబంద జెల్ రాసుకోవచ్చు. కలబందలోని గుణాలు దురద, మంట తగ్గిస్తాయి. షేవింగ్ తర్వాత కలబంద జెల్ రాసి 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కోండి. రెండు మూడు సార్లు ఇలా చేస్తే దురద తగ్గుతుంది.

దురద తగ్గించుకోవడం ఎలా?

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె కూడా దురద, మంట తగ్గిస్తుంది. కొబ్బరి నూనె రాసుకుని కాసేపు అలాగే ఉంచి, తర్వాత నీటితో కడుక్కోండి. చర్మం మృదువుగా, తేమగా అవుతుంది. దురద, మంట తగ్గుతాయి.

పసుపు నీరు

పసుపు నీటితో కూడా దురద, మంట తగ్గుతాయి. పసుపులో నీరు కలిపి ముఖం కడుక్కోండి. పసుపులోని గుణాలు దురద, మంట తగ్గిస్తాయి.

Latest Videos

click me!