బ్రౌన్ గుడ్లు Vs తెల్ల గుడ్లు: ఏ గుడ్డు తింటే బరువు తగ్గుతారు?

Published : Mar 07, 2022, 09:54 AM ISTUpdated : Mar 07, 2022, 10:53 AM IST

వాస్తవానికి బ్రౌన్, తెల్ల గుడ్ల మధ్యన రుచి, పోషక  విలువలలో ఏ మాత్రం వ్యత్యాసం ఉండదు. వీటి షెల్ రంగులో మాత్రమే తేడా ఉంటుంది. అయితే గుడ్డు పెంగు రంగు దానిని పెట్టిన కోడి జాతి గురించి తెలియజేస్తుందంతే. 

PREV
19
బ్రౌన్  గుడ్లు Vs తెల్ల గుడ్లు:  ఏ గుడ్డు తింటే బరువు తగ్గుతారు?

గుడ్లు మంచి పోషకకాహారం. దీన్ని వండటం ఎంతో సులభం కూడా. గుడ్డుతో  మీ రోజును ప్రారంభిస్తే.. మీ శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ మెండుగా అందుతాయి. గుడ్లను ఉడికించి తిన్నా, ఆమ్లేట్ వేసుకుని తిన్నా.. అందులో ఉన్న ప్రోటీన్లు, విటమిన్లు, మంచి కొవ్వులు, ఖనిజాలు మొత్తంగా అందుతాయి. ఇవి మన అంతర్గత అవయవాలు సజావుగా పనిచేయడానికి ఎంతో సహాయపడతాయి. 

29

అయితే చాలా మందికి బ్రౌన్ గుడ్లకు, తెల్ల గుడ్లకు తేడా తెలియదు. ముఖ్యంగా బ్రౌన్ గుడ్లతోనే బరువు తగ్గుతామని, ఇవే మంచివని వాటినే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వాస్తవానికి ఏ గుడ్లు బరువు తగ్గడానికి సహాయపడతాయో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి..  
 

39

గుడ్డులోని పోషక విలువలు: గుడ్లు పోషకాలతో నిండిని ఆరోగ్యకరమైన ఫుడ్ గా చెప్పుకోవచ్చు. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు మన శరీరానికి అవసరమైన Macronutrientను ఒక గుడ్డు కలిగి ఉంటుంది. గుడ్డులో ప్రోటీన్స్ 5.5 గ్రా ఉంటే,  కొవ్వు: 4.2 గ్రా, కాల్షియం: 24.6 మి.గ్రా, ఐరన్: 0.8 మి.గ్రా, మెగ్నీషియం: 5.3 మి.గ్రా, భాస్వరం: 86.7 మి.గ్రా, పొటాషియం: 60.3 మి.గ్రా,  జింక్: 0.6 మి.గ్రా, కొలెస్ట్రాల్: 162 మి.గ్రా,  సెలీనియం: 13.4 మైక్రోగ్రాములు (mcg)ఉంటాయి. 
 

49

గుడ్డులోని పచ్చ సొన తో పోల్చితే.. గుడ్డులోని తెల్లటి భాగమే తక్కువ పోషకాలను కలిగి ఉంటుంది.  అందుకే గుడ్లను మొత్తం తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. కానీ చాలా మంది గుడ్డులోని పచ్చ సొనను తింటే లావైపోతామని దానిని అవాయిడ్ చేస్తుంటారు. కానీ ఇది పూర్తిగా తప్పు భావన. పచ్చ సొన తింటే లావు అవడం పూర్తిగా మన అపోహనేనని వైద్యులు తేల్చి చెబుతున్నారు. మనము అనుకున్నట్టుగా పచ్చసొలో కొవ్వు ఎక్కువగా ఉండదు. దీన్ని తినడం వల్ల మీరేమీ బరువు పెరగరు. 
 

59

బ్రౌన్ Vs వైట్ గుడ్లు: తేడా మరియు బరువు తగ్గడానికి ఏది మంచిది..
వాస్తవానికి బ్రౌన్, తెల్ల గుడ్ల మధ్యన రుచి, పోషక  విలువలలో ఏ మాత్రం వ్యత్యాసం ఉండదు. వీటి షెల్ రంగులో మాత్రమే తేడా ఉంటుంది. అయితే గుడ్డు పెంగు రంగు దానిని పెట్టిన కోడి జాతి గురించి తెలియజేస్తుందంతే. 

69

గోధుమ రంగు గుడ్లను ముదురు రంగు  కోడి జాతులు పెడతాయి. తెల్లని గుడ్లను తెల్ల రంగు జాతులు పెడతాయి. అయితే తెల్ల గుడ్లకంటే గోధుమ రంగు గుడ్లే ఎక్కువ ఖరీదు. ఎందుకంటే ఈ జాతి కోళ్లను చాలా పరిశుభ్రంగా ఉండే ప్లేస్ లో పెంచుతారు. అంతేకాదు వీటిని పోషకాలతో నిండిన ఆహారాన్ని పెడతారు. శాస్త్రీయంగా చూస్తే తెల్లగుడ్లు, బ్రౌన్ గుడ్ల మధ్య ఏం తేడా లేకపోయినప్పటికీ కోడి జాతి, ఆహార రకం, తాజాదనం వంటి కారణాల వల్ల గోధుమ రంగు గుడ్డు తెల్లగుడ్డు కంటే భిన్నంగానే ఉంటుంది. 

79
egg

ఇక వెయిట్ లాస్ విషయానికొస్తే..  గోధుమ మరియు తెలుపు రంగు గుడ్లూ మీకు ఒకే మొత్తంలో పోషకాలను అందిస్తాయి. కాబట్టి మీరు ఏది కొన్నా.. వాటిలో డిఫరెన్స్ లేదని గుర్తుంచుకోవాలి. 

89

బరువు తగ్గడానికి గుడ్లు ఎలా సహాయపడతాయి.. గుడ్డులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఉదయం తినడం వల్ల మధ్యాహ్నం వరకు మీ కడుపు నిండుగానే ఉంటుంది. కాబట్టి మీరు మధ్యమధ్యలో ఏదీ తినలేరు. దీని వల్ల మీరు ఆరోగ్యానికి చెడు చేసే ఆహారాలను తినకుండా సహాయపడుతుంది.  వ్యాయామం చేసిన తర్వాత ఉడకబెట్టిన గుడ్డును తినడం వల్ల మీ కండరాలను పెంచడానికి, లీన్ కండరాలను నిర్మించడానికి ఎంతో సహాయపడుతుంది. 

99

అంతేకాదు ఇందులో ఉండే ప్రోటీన్ మీ జీవక్రియను పెంచి మీరు బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. మీ రోజు వారి ఆహారంలో గుడ్లను చేర్చుకున్నప్పుడు గుడ్డులోని పచ్చసొన పక్కకు పెట్టేయకుండా గుడ్డు మొత్తాన్ని తినండి. అప్పుడే మీరు వేగంగా బరువు తగ్గుతారు. అయితే రోజుకు మూడు కంటే ఎక్కువ గుడ్లను మాత్రం తినకుండా జాగ్రత్త పడండి. 

click me!

Recommended Stories