యానిమల్ మూవీ కోసం రణ్ బీర్ కపూర్ ఇంత కష్టపడ్డారా?

First Published | Nov 30, 2023, 3:58 PM IST

‘మీ కృషి, మీ అంకితభావం, మీ వృత్తి ఎప్పటికీ ఆశ్చర్యానికి గురిచేయవు’ ఎప్పటిలాగే..  మీ ఫిట్‌నెస్ కోచ్ సోదరుడు కావడం చాలా ఆనందంగా ఉంది అంటూ రణ్ బీర్ కపూర్ పై శివోహమ్ ప్రశంసల జల్లు కురిపించాడు.
 

రణబీర్ కపూర్ యాక్టింగ్ గురించి మనకు తెలియనిది కాదు. ఇతను క్యారెక్టర్ యాక్టర్ గా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఈ మధ్యే యానిమల్ మూవీని కంప్లీట్ చేశాడు ఈ హీరో. రన్ బీర్ కపూర్, రష్మిక మందానలు నటించిన ఈ మూవీ డిసెంబర్ 1న అంటే రేపే విడుదల కానుండి. ఈ మూవీ టీజర్ మంచి టాక్ తెచ్చుకుంది. టీజర్ తో ఈ మూవీపై ప్రేక్షకులకు అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.
 

అయితే ఈ మూవీ కోసం హీరో రణ్ బీర్ కపూర్ ఎంతో కష్టపడ్డారట. ఫిట్ నెస్ కోసం హీరో రాత్రింభవళ్లు కష్టపడ్డారని ఇతని ఫిట్ నెస్ ట్రైనర్ శివోహమ్ ప్రశంసల జల్లును కురిపించారు. యానిమల్ సినిమాతో పాటుగా తన అద్భుతమైన పరివర్తనతో రణబీర్ కపూర్ చేసిన కృషిని అభినందించకుండా ఉండలేం. అందుకే హీరో ఫిట్నెస్ ట్రైనర్ శివోహమ్ కూడా రణ్ బీర్ కష్టాన్ని గుర్తిస్తూ ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక నోట్ ను రాసుకొచ్చారు. మరి ఆ నోట్ లో ఏముందంటే?


'మరో మిషన్ పూర్తయింది. మరో మైలురాయిని సాధించింది. మీ వృత్తి పట్ల మీ కృషి, అంకితభావం ఎప్పటికీ విస్మయానికి గురిచేయవు' అని శివోహమ్ పేర్కొన్నారు. అలాగే ఎప్పటిలాగే ఫిట్ నెస్ కోచ్ బ్రదర్ కావడం ఆనందంగా ఉందని తెలిపాడు. ఆల్ ది బెస్ట్. తదుపరి మైలురాయి కోసం ఎదురు చూస్తున్నాను' అని ట్రైనర్ శివోహమ్ పేర్కొన్నారు.
 

రణ్ బీర్ కపూర్ క్రమశిక్షణతో కూడిన జీవనశైలికి, అంకితభావానికి, కఠోర శ్రమకు నిదర్శనమని శివోహమ్ పేర్కొన్నారు. ఇది ఒక బృంద ప్రయత్నం. పౌష్టికాహారం, సప్లిమెంట్స్, ట్రైనింగ్ అన్నింటికీ మించి మీ పట్టుదలే మీరు మీ లక్ష్యాలను సాధించడానికి మొదటి కారణమని ఆయన పేర్కొన్నారు. ఇదే మిమ్మల్ని మిగిలిన వారి నుంచి వేరు చేస్తుందన్నారు.
 

రణ్ బీర్ కపూర్ ఉదయం 4 గంటల నుంచే తన వ్యాయామాన్ని స్టార్ట్  చేస్తారట. అలాగే రాత్రి 11:30 గంటలకు కూడా శిక్షణ సెషన్లను కూడా మొదలుపెడతారట. అలాగే కొన్ని కొన్ని సార్లు షూటింగ్ల మధ్య సమయాన్ని కుదుర్చుకుని మరీ వర్కౌట్స్ ను చేస్తారని ట్రైనర్ వెల్లడించారు. 

'రణ్ బీర్ అన్నీ చేశాడు. ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఈ విషయాలన్నీ పుస్తకాలు చదివి నేర్చుకోలేం. ఇవి మీలో నిక్షిప్తమైన విలువలు, మీ తల్లిదండ్రులు, మీరు ఉన్న సంస్థ నుంచి మీరు తీసుకోవలసిన షరతులు. నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది బ్రదర్" అని ట్రైనర్ శివోహమ్ రణ్ బీర్ కపూర్  గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. 
 

Latest Videos

click me!