రక్షా బంధన్ 2023: రాఖీ కట్టేటప్పుడు మూడు ముళ్లే ఎందుకు వేయాలి? దీని వెనకున్న రహస్యం ఏంటంటే?

Published : Aug 25, 2023, 04:14 PM ISTUpdated : Aug 26, 2023, 10:03 AM IST

raksha bandhan 2023: అన్నకు లేదా తమ్ముడికి రాఖీ కట్టేటప్పుడు మూడు ముళ్లనే వేస్తారు. అసలు మూడు ముళ్లే ఎందుకు వేయాలి? దీనివెనుక ఏదైనా రహస్యం ఉందా?   

PREV
15
రక్షా బంధన్ 2023: రాఖీ కట్టేటప్పుడు మూడు ముళ్లే ఎందుకు వేయాలి? దీని వెనకున్న రహస్యం ఏంటంటే?

raksha bandhan 2023: తోబుట్టువుల బంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ మరికొన్ని రోజుల్లో రాబోతోంది. ప్రతిఏడాది శుక్లపక్ష పౌర్ణమి రోజున రాఖీ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ రోజును ఆగస్టు 31 ను జరుపుకోబోతున్నాం. అయితే అన్నా, తమ్ముల్లకు రాఖీ కట్టేటప్పుడు కరెక్టుగా మూడు ముళ్లనే వేస్తారు. అసలు మూడు ముళ్లనే ఎందుకు వేస్తారు? ఎక్కువ లేదా తక్కువ ఎందుకు వేయకూడదు? దీని వెనకున్న కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

25
raksha bandhan 2022 new

మూడు ముళ్ల ప్రాముఖ్యత

రక్షా బంధన్ అంటే కేవలం రాఖీ కట్టడం మాత్రమే కాదు. ఇది ప్రేమ, రక్షణ, తోబుట్టువుల మధ్య విడదీయలేని బంధాన్ని తెలుపుతుంది. అయితే రాఖీని కట్టేటప్పుడు మూడు ముళ్లను వేయడం వెనుక బలమైన కారణముంది. ఈ మూడు ముళ్లు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల..  త్రిమూర్తులకు ప్రతీకగా నమ్ముతారు. సృష్టి, సంరక్షణ, వినాశనం అనేవి జీవిత శాశ్వత చక్రం.
 

35

ముళ్ల అర్థాలు

ఒక్కో ముడికి ఒక్కో అర్థం, ఉద్దేశం ఉంటుంది. మొదటి ముడి సోదరుడి దీర్ఘాయువు, శ్రేయస్సు కోసం చేసే ప్రార్థన. సోదరి సౌభాగ్యం, సుఖసంతోషాల ఆకాంక్షగా రెండో ముడిని చెప్తారు. చివరిగా మూడో ముడి వారి సంబంధంలో ప్రేమ, శాశ్వత స్వభావానికి నిదర్శనంగా చెప్తారు.

45

శుభ సమయాలు

ఈ పవిత్ర రోజును సెలబ్రేట్ చేసుకోవడానికి శుభ సమయాన్ని పాటించడం చాలా ముఖ్యం. ద్రిక్ పంచాంగం ప్రకారం.. ఈ పండుగ ఆగస్టు 30 న ప్రారంభమవుతుంది. రాఖీ కట్టడానికి అనువైన సమయం రాత్రి 9:01 గంటల తర్వాత. భద్ర కాలం ముగిసిన తర్వాత ప్రారంభమవుతుంది. భద్రకాలం దాటిన తర్వాతే రాఖీ కట్టాలి.

55

రాఖీని మూడు ముళ్లతో కట్టే ఆచారం విశ్వాసం, ఐక్యత, శాశ్వత తోబుట్టువుల సంబంధానికి అందమైన ప్రతిరూపంగా భావిస్తారు. ఇది కేవలం ఒక దారం మాత్రమే కాదు. కాలాన్ని, దూరాన్ని దాటి, సోదర సోదరీమణుల మధ్య సంబంధాన్ని బలపరిచే పవిత్ర బంధం.

click me!

Recommended Stories