పెళ్లైన 2 నెలలకే అంబానీ చిన్నకోడలు ప్రెగ్నెంట్? ఈ ఫోటోస్ చూసారా?

First Published | Sep 10, 2024, 10:55 AM IST

ముఖేష్ అంబానీ చిన్న కొడుకు పెళ్లై కేవలం రెండు నెలలే అవుతోంది. అయితే రాధికా మర్చంట్ ప్రెగ్నెంట్ అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిలో నిజమెంతంటే? 
 

లగ్జరీ లైఫ్ స్టైల్ తో పాటుగా ఎన్నో విషయాల్లో అంబానీ ఫ్యామిలీ ఎప్పుడూ వార్తల్లో కనిపిస్తూనే ఉంటుంది. ఈ సంవత్సరం అంబానీ ఫ్యామిలీలో ఎన్నో జరిగాయి. ముఖ్యంగా ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీ ఫ్రీ వెడ్డింగ్,  పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరిగాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 

అయితే ఈ సంవత్సరం వినాయక చవితిని పండుగను అంబానీ ఫ్యామిలీ ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ కార్యక్రమానికి కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అనంత్ అంబానీని పెళ్లి చేసుకున్న తర్వాత రాధికా మర్చంట్ కు ఇదే తొలి వినాయక చవితి పండుగ. కాగా ఈ పండుగను కుటుంబమంతా ఎంతో ఘనంగా జరుపుకున్నారు. 
 

anant ambani radhika merchant honeymoon 05

ఈ వినాయక చవితి వేడుకలకు బాలీవుడ్ ప్రముఖుల రాకతో అంబాని అంటిలియా ఇళ్లు ఎంతో సందడిగా మారిపోయింది. ఈ ఫెస్టివల్ కు సల్మాన్ ఖాన్ నుంచి శ్రద్ధా కపూర్ వరకు కొందరు బాలీవుడ్ స్టార్స్  హాజరయ్యారు. అయితే వినాయక చవితి సందర్భంగా నీతా అంబానీ తన కోడలు రాధికను తొలిసారిగా మీడియాకు పరిచయం చేసిన వీడియో ఒక బయటకు వచ్చింది. ఈ వీడియోలో ఉద్ధవ్ ఠాక్రే సతీమణి రష్మీ ఠాక్రే కూడా ఉన్నారు. ముగ్గురూ కలిసి కెమెరాలకు పోజులిచ్చారు.


అయితే ఇంటర్ నెట్ లో ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. అంతగా ఈ వీడియోలో ఏముందబ్బా అనిపించొచ్చు. కానీ ఇందులో గుడ్ న్యూస్ ఉందంటున్నారు ఈ వీడియోను చూసిన జనాలు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే రాధిక మర్చంట్ తన కడుపుపై చేతులు వేసి, హీల్స్ కు బదులుగా ఫ్యాట్ షూస్ ను వేసుకుని నడుస్తూ కనిపించిది. అంతేకాకుండా.. ఈ వీడియోలో నీతా అంబానీ తన చిన్న కోడలు రాధికా మర్చంట్ చేయి పట్టుకుంది. దీన్ని చూసిన జనాలంతా రాధికా మర్చంట్ గర్భవతి అని అంటున్నారు. 
 

ఇక కామెంట్స్ సెక్షన్ లో అయితే రాధికా మర్చంట్ ప్రెగ్నెంట్ అని ఓ యూజర్ పోస్ట్ చేశాడు. మరో నెటిజన్ 'రాధిక కచ్చితంగా ప్రెగ్నెంట్' అంటూ కామెంట్ చేశాడు. ఆ ఫ్లాట్ షూ, కడుపుపై చేయి, నీతా అంబానీ అదనపు ప్రేమ ఆ విషయాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 

మరో నెటిజన్ 'రాధిక కడుపుపై చేయుంది కాబట్టి ఆమె గర్భవతి కావొచ్చు' అని కామెంట్ చేశాడు. అయితే మరికొందరు పెళ్లై జస్ట్ 2 నెలలే అయిందని కామెంట్లు చేస్తున్నారు. చీరకట్టులో నడవడానికి ఇబ్బంది కావడం వల్లే ఇలా ఆమె చేసి ఉండొచ్చని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే నీతా అంబానీ కోడలిపై ప్రేమ చూపించడాన్ని జనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
 

ఇకపోతే అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ లు కలిసి చదువుకున్నారు. వీరి స్నేహితులుగా ఉండి.. ప్రేమలో పడ్డారు. ఈ ప్రేమ జంట ఈ ఏడాది జూలై 12న అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. వీళ్ల పెళ్లికి  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు, రాజకీయ నాయకులు, అంతర్జాతీయ వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు ఇలా ఎంతో మంది హాజరయ్యారు.

Latest Videos

click me!