బచ్చలి కూర.. బచ్చలి కూర, బ్రోకలీ వంటి ఆకు పచ్చ కూరగాయల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కూడా. వండిన ఒక కప్పు బచ్చలికూరలో 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఐరన్, ఫోలేట్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇవి మన ఆరోగ్యానికే కాదు బరువు తగ్గడానికి కూడా ఎంతో సహాయపడతాయి.