కిడ్నీల్లో రాళ్లున్న వారు ఈ ఆహార పదార్థాలను ఎట్టిపరిస్థితిలో తినకూడదు.. లేదంటే..?

Published : Mar 04, 2022, 03:23 PM IST

Kidney Stone Patients: కిడ్నీలో రాళ్లున్న వారికి ఉప్పు, టొమాటో, పాలకూర లు విషంతో సమానమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీరు ఈ ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే..

PREV
17
కిడ్నీల్లో రాళ్లున్న వారు ఈ ఆహార పదార్థాలను ఎట్టిపరిస్థితిలో తినకూడదు.. లేదంటే..?

Kidney Stone Patients: ప్రస్తుతం రోగాలు లేని మనుషులు లేరేమో కదా. భయంకరమైన రోగాలు ఇప్పుడు సర్వసాధారణంగా మారాయి. అందులో కిడ్నీలో రాళ్ల సమస్య కూడా సాధారణ సమస్యగానే పరిగణించబడుతుంది. 

27

మనం తీసుకునే ఆహారపు అలవాట్ల వల్లే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యతో బాధపడే వారికి కొన్ని రకాల ఆహారాలకు విషంతో సమానమని వైద్యులు చెబుతున్నారు.

37

ఉప్పు, టొమాటో, పాలకూర వంటి ఆహారాలను వీరు అస్సలు తినకూడదు.  తింటే ఏమౌతుంది అంటూ అలాగే తింటే మాత్రం తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

47

గతంలో రాళ్లు ఉండి ఇప్పుడు తగ్గిన వారు కూడా వీటిని అస్సలు తినకూడదు మారుతున్న జీవన శైలి కారణంగానే ఎంతో మంది కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సమస్య వల్ల ఎంతో నొప్పి ఉంటుందో మాటల్లో చెప్పలేనిది. కాబట్టి తెలిసి తెలిసి ఈ ఆహారాలను తింటే మాత్రం నొప్పి తీవ్రస్థాయికి చేరుకునే ప్రమాదం ఉంది. 

57

కిడ్నీలో రాళ్లున్న వారు పాలకూరను పూర్తిగా మానేయాల్సిందే. ఎందుకంటే పాలకూరలో ఆక్సలేట్ ఉంటుంది. ఇది కాల్షియంను పెంచుతుంది.  దీనివల్ల మీకు యూరిన్ ఫ్రీగా రాదు. కాబట్టి కిడ్నీలో రాళ్లుంటే పాలకూరను తినడం పూర్తిగా మానుకోండి.
 

67

కిడ్నీల్లో రాళ్లుండే వారు చాక్లెట్లను కూడా తినకూడదు. ఎందుకంటే వీటిలో ఆక్సలేట్ ఉంటుంది. దీనివల్ల కాల్షియం పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సమస్య ఉన్న వారు చాక్లెట్లకు దూరంగా ఉండండి.
 

77

ఇకపోతే కిడ్నీలో రాళ్లుండే వారు టొమాటోలకు ఎంత దూరముంటే అంత మంచిది. ఇవి వారికి విషంతో సమానమైనవి. ఎందుకంటే టొమాటోల్లో ఆక్సిలేట్ అధికంగా ఉంటుంది. దీంతో కాల్షియం పరిమాణం ఎక్కువ అవుతుంది. దీనివల్ల కిడ్నీ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి టొమాటోలకు దూరంగా ఉండండి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఒకవేళ టొమాటోలను తినాలకుంటే అందులోని గింజలను తీసేసి తింటే ఎటువంటి ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు.   
 

click me!

Recommended Stories