అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఈ ఆహారాలు అస్సలు మంచివి కావు..

Published : Mar 06, 2022, 03:40 PM IST

హై బ్లడ్ ప్రెజర్ ఉన్న వాళ్లు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉంటేనే మంచిది. లేదంటే వారి ప్రాణాలకే ముప్పు రావొచ్చు. మరి అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు ఎలాంటి ఆహారాలను తీసుకోవాలంటే..   

PREV
17
అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఈ ఆహారాలు అస్సలు మంచివి కావు..

ఒకప్పుడు వయసు పైబడిన వారికే అధిక రక్తపోటు సమస్య వస్తుండేది. కానీ ఇప్పుడు అలా లేదు. వయసుతో సంబంధం లేకుండా ఈ అధిక రక్తపోటు సమస్య వస్తుంది. యువత కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారంటే నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 

27
high blood pressure

మారుతున్న జీవన శైలి, క్రమబద్దమైన ఆహారం తీసుకోకపోవడంతోనే ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది సాధారణమే అని తేలిగ్గా తీసిపారేయాల్సిన విషయమైతే కాదు. ఈ సమస్య పట్ల అశ్రద్ద వహిస్తే ప్రాణాలకే ముప్పు రావొచ్చు. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అవేంటంటే.. 

37

High blood pressure బాధితులకు ఉప్పు విషంతో సమానం. ఎందుకంటే ఉప్పులో సోడియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి హైబీపీ రోగులు ఉప్పును ఎక్కువ శాతం వాడకూడదు. కొందరికి ఆహార పదార్థాల పైన ఉప్పును చల్లుకుని తినే హ్యాబిట్ ఉంటుంది. కానీ బీపీ పేషెంట్లు ఇలా అస్సలు చేయకూడదు. వీరు సముద్రపు ఉప్పును ఉపయోగించకూడదు. వీరు రాతి ఉప్పును తింటే మంచిదట.

47

హై బీపీ పేషెంట్లు ప్రాసెస్ చేసిన మాంసాన్ని అస్సలు తినకూడదు. ఎందుకంటే ప్రాసెస్ చేసిన మాంసంలో సోడియం క్వాంటిటి ఎక్కువ మొత్తంలో  ఉంటుంది. ఎందుకంటే దానికి ఉప్పును ఎక్కువగా కలుపుతారు. కాబట్టి వీటికి దూరంగా ఉండండి.

57

అలాగే  ఊరగాయ, బ్రెడ్ తో మాసం, సాస్, చీజ్ లను తింటే మీ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అధిక రక్తపోటు ఉన్నవారు ప్రాసెస్ మాంసానికి దూరంగా ఉండటమే మేలు. 
 

67

బీపీ పేషెంట్లకు కాఫీ అస్సలు మంచిది కాదు. ఎందుకంటే కాఫీలో కెఫిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ కెఫిన్ వల్ల రక్తపోటు మరింత పెరుగుతుంది. అందుకే హైబీపీ పేషెంట్లకు వైద్యులు కాఫీ తాగాలని సలహాను ఇవ్వరు.

77

ప్యాక్ చేసిన ఫుడ్ ఐటమ్స్ కూడా బీపీ రోగులు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో సోడియం ఎక్కువగా ఉంటుందట. మీకు తెలుసా.. సోడియంతో ఎక్కువ మొత్తంలో ఉండే ఆహారాలను తినడం వల్ల బీపీ పెరుతుంది. కాబట్టి స్నాక్స్ ను ఇంట్లోనే తయారుచేసుకుని తినడం ఉత్తమం. 

click me!

Recommended Stories