బ్రేకప్ బాధకు ప్యాకప్ చెప్పే మార్గాలు..

First Published | Mar 6, 2022, 2:00 PM IST

లవ్ లో ఎంత సంతోషంగా ఉంటారో.. వన్స్ అది బ్రేకప్ అయ్యిందంటే చాలు నాకింక జీవితమే లేదు అంటూ తీవ్రమైన డిప్రెషన్ లోకి వెల్లిపోతుంటారు. దీని నుంచి ఎలా బయటపడాలో తెలియక ఏండ్ల తరబడి ఆ బాధలోనే మునిగిపోయి డీలా పడిపోతుంటారు. అయితే బ్రేకప్ బాధకు ప్యాకప్ చెప్పే మార్గాలు చాలానే ఉన్నాయి తెలుసా..
 

ప్రేమలో ఎలా అయితే సంతోషంగా ఉంటారో.. అలాగే బ్రేకప్ లో కూడా తట్టుకోలేని బాధ, దు:ఖంలో ఉంటారు. వీటి మూలంగానే చాలా మంది తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంటారు. గతాన్ని మీరెలాగూ మార్చలేరు. కాబట్టి మీరు ఆ బ్రేకప్ బాధనుంచి వీలైనంత తొందరగా బయటపడితేనే మీరు మీ లైఫ్ ను లీడ్ చేయగలుగుతారు. బ్రేకప్ బాధ వల్ల మీకు వచ్చేది ఏమీ ఉండదు. కాబట్టి దాని నుంచి వీలైనంత తొందరగా బయటపడండి. బ్రేకప్ బాధనుంచి బయటపడేందుకు కొన్ని మార్గాలు ఇక్కడున్నాయి. అవేంటంటే..

టైం తీసుకుని: బ్రేకప్ నుంచి అంత తొందరగా బయటపడటం అంత సులువు కాదు. కాబట్టి దాని నుంచి బయటపడటానికి కాస్త సమయం తీసుకోండి. మీకు మీరుగా సర్ది చెప్పుకోండి. గతాన్ని మార్చలేమన్న సత్యన్ని గ్రహించండి. ఖాళీగా ఉండకండి. నచ్చిన పనులను చేస్తూ ఉండండి. 


షేర్ చేసుకోండి: మనసులోని భాదను పంచుకుంటూనే మీ మనసు తేలిక పడుతుంది. ఆ బాధను దాచుకున్న కొద్దీ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీ సన్నిహితులతో లేదా స్నేహితులకు షేర్ చేసుకోండి. వాళ్లతో మీ బాధను చెపుుకుంటే కొంత రిలీఫ్ పొందుతారు. 

కొత్తవి ట్రై చేయండి:  ఎప్పుడూ ఒకేలా ఉంటే లైఫ్ బోర్ గా ఉంటుంది. ముఖ్యంగా మీరు బ్రేకప్ బాధనుంచి బయటపడాలంటే మాత్రం మీలో దాగున్న నైపుణ్యాన్ని బయటకు తీయండి. వాయిదా వేస్తూ వచ్చిన పనులను కూడా ఇప్పటినుంచే మొదలు పెట్టండి.

గుర్తులు లేకుండా:  బ్రేకప్ నుంచి బయటపడాలంటే ముందుగా మీరు చేయాల్సిన పనులు.. మీ లవర్ వస్తువులను, గుర్తులు ఒక్కటి కూడా లేకుండా చేయండి. వాటిని చూస్తున్నంత సేపు వారే గుర్తొస్తారు. కాబట్టి అవి లేకుండా చేయండి. 

వ్యసనాలొద్దు: బ్రేకప్ అయ్యేదే ఆలస్యం, ఆల్కహాల్ కు, స్మోకింగ్ కు అలవాటు పడిపోయే వారు చాలా మందే ఉన్నారు. దీనివల్ల మీ ఆరోగ్యం చెడిపోవడమే తప్ప మరేదీ ఉండదని మీరు గ్రహించాలి. ఈ పద్దతి బాధనుంచి బయటపడే అసలైన మార్గమైతే కాదు. కాబట్టి వీటికి దూరంగా ఉండండి.

కొత్త వారితో: బ్రేకప్ అయ్యిందని ఇంట్లోనే కాలాన్ని గడిపేయకండి. మీకు తెలుసా కొత్త వారితో పరిచయాలు, కొత్త ప్లేసులతో మనసుకు తెలియని ఆనందం కులుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి వాటి వల్ల పాత ఆలోచనలన్నీ మటుమాయమయ్యి.. కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. 

పదే పదే ఆలోచించకండి:  జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం వల్ల మీకు ఒరిగేది ఏదీ ఉండదు. వాటి గురించి పదే పదే ఆలోచిస్తే మీ బుర్ర కరాబవ్వడమే కాదు మీరు డిప్రెషన్ లోకి వెళ్లిపోయే ప్రమాదముంది. నాకే ఎందుకిలా జరిగింది, ఇలా జరగకపోతే బావుండు అనే ఆలోచనలు కట్టిపెట్టండి. జరిగిందేదో జరిగిపోయింది. నాకూ ఒక లైఫ్ ఉందని యాదిలో ఉంచుకోండి. 

Latest Videos

click me!