Published : Mar 06, 2022, 02:52 PM ISTUpdated : Mar 06, 2022, 03:00 PM IST
Electric Cooker: కనీసం తినడానికే టైం లేని ఈ ఉరుకుల పరుగుల కాలంలో ఇక వండటానికేం సమయముంది. కూర తప్ప మిగతా అన్నింటినీ.. ఎలక్ట్రానిక్ వస్తువుల్లోనే వంటేస్తున్నారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో అన్నాన్ని వండుకుని తినడం వల్ల గుండె సంబంధిత రోగాలు, కీళ్ల వాతం, మధుమేహం, అధిక బరువు వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Electric Cooker: ప్రస్తుత కాలంలో జనాలకు అసలు సమయమే ఉండటం లేదు. కాలంతో పోటీ పడుతున్నారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంతో గడిపేస్తూ.. సమయాన్ని ఏమాత్రం వేస్ట్ చేయడం లేదు. అందులోనూ తినడానికి వీళ్లకసలు టైమే ఉండటం లేదు.
210
టెక్నాలజీకి అనుగుణంగా చాలా తొందరగా, ఈజీగా అయ్యే పనులవైపే మొగ్గుచూపుతున్నారు. అందుకోసం కొత్త కొత్త మార్గాలను ఫాలో అవుతున్నారు.
310
మీకు తెలుసో తెలియదో.. ఒక వ్యక్తి పొద్దున లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఎలక్ట్రానిక్ వస్తువులతోనే కాలాన్ని గడుపుతున్నారు. ఎలాగా అంటారేమో.. ఉదయం స్నానం చేసేందుకు వేడినీళ్లు, మంచి నీళ్లు, కాఫీలు టీలు .. ఆఖరికి మనం తినే ఆహార పదార్థాలు కూడా కరెంట్ ద్వారానే రెడీ అవుతున్నాయి.
410
ఎలాక్ట్రానిక్ ద్వారా వంట తొందరగా అవుతుందని వాటినే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎలక్ట్రానిక్ ద్వారా వంటలను వండటం ద్వారా వాటికి రుచే ఉండదని నిపుణులు చెబుతున్నారు.
510
ఇకపోతే ప్రస్తుతం చాలా మంది కూరొక్కటే గ్యాస్ పై చేసి.. రైస్ మాత్రం ఎలక్ట్రిక్ కుక్కర్ లోనే వండేస్తున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అన్నాన్ని కరెంట్ కుక్కర్ లో వండటం వల్ల అది విషతుల్యంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.
610
ఎందుకంటే ఎక్కువ మొత్తంలో కుక్కర్లు అల్యూమినియంతో తయారుచేసినవే ఉంటాయి. అల్యూమినియం పాత్రల్లో వంట వండటం, వాటిల్లో ఆహారాలను నిల్వ చేయడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
710
ముఖ్యంగా మనం ఆహారాలను వండేటప్పుడు వాటికి గాలి, వెలుతురు తగలాలట. అలా తగిలితేనే అవి మనకు మేలు చేస్తాయి. అవి లేకపోతే మీరు వండిన ఆహారాలు విషతుల్యంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
810
అల్యూమినియం పాత్రల్లో వంట చేసుకుని తిన్నప్పుడు ఆ అల్యూమినియం మన బాడీలోకి చేరుతాయి. అవి కొన్ని నెలలు లేదా సంవత్సరాలకు మనపై చెడు ప్రభావం చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు దీంతో అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
910
అల్యూమినియం పాత్రల్లో వండిన ఆహార పదార్థాలను తినడం వల్ల ఎలాంటి రోగాలొస్తాయంటే.. మధుమేహం, అధిక బరువు, గుండె సంబంధిత రోగాలు, గ్యాస్ ప్రాబ్లమ్, ఉదర సంబంధ సమస్యలు, నడుము నొప్పి, కీళ్ల వాతం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
1010
ఖచ్చితంగా వాటిలోనే వండాలి అని అనుకున్నప్పుడు .. వాటిలో యాసిడ్ కలిగిన లేదా, పుల్లటి ఆహారాలను అస్సలు నిల్వ చేయకూడదు. అంతేకాదు ఈ అల్యూమినియం పాత్రల్లో ఫ్రై లు ఎలాంటి పరిస్థితుల్లో చేయకూడదు. మొత్తమే అల్యూమినియం కాకుండా ఎనోడైజ్డ్ అల్యూమినియం మెటల్ తో తయారైన పాత్రలను వాడండి. వాటితో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావని నిపుణులు చెబుతున్నారు.