Parenting: కూతురు పుట్టిన క్షణం నుంచి ఒక తండ్రి జీవితంలో ఎన్నో మార్పులు మొదలవుతాయి. బయటకు ఎంత కఠినంగా కనిపించే వ్యక్తి అయినా, కూతురి చిరునవ్వు ముందు చిన్న పిల్లాడిలా మారిపోతాడు. కూతురు పుట్టాక తండ్రిలో కనిపించే కొన్ని షాకింగ్ మార్పుల గురించి చూద్దాం.
ఒక కుటుంబంలో కూతురు పుట్టిందంటే.. ఆ తండ్రి జీవితంలో మార్పు మొదలైనట్లే. కూతురి నవ్వు, పిలుపు, అమాయకమైన చూపులు తండ్రి మనసులో ఎన్నో కొత్త భావాలను నింపుతాయి. అంతవరకు కఠినంగా, భావోద్వేగాలను బయటపెట్టకుండా ఉండే వ్యక్తి కూడా కూతురు పుట్టిన తర్వాత పూర్తిగా మారిపోతాడు. అలా కూతురు పుట్టాక తండ్రిలో వచ్చే 5 ముఖ్యమైన మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
26
సున్నితంగా మారిపోవడం
నిపుణుల ప్రకారం, కూతురు పుట్టక ముందు చాలామంది తండ్రులు తమ ఎమోషన్స్ ని బయటపెట్టడానికి ఇష్టపడరు. కానీ కూతురు మొదటిసారి తన వేలిని పట్టుకున్న క్షణం నుంచి వారి హృదయం చాలా సున్నితంగా మారిపోతుంది. ఆమె నవ్వు చూస్తే ఆనందంతో కళ్లు చెమ్మగిల్లడం, ఆమెకు చిన్న గాయం అయినా, చిన్న బాధ వచ్చినా తండ్రి మనసు కలత చెందడం వంటివి జరుగుతుంటాయి. ఇంతకుముందు కన్నీళ్లు పెట్టుకోని వ్యక్తి కూడా కూతురు కోసం ఎమోషనల్ అవ్వడం కనిపిస్తుంది. ప్రేమను వ్యక్తపరచడం, ఆప్యాయత చూపించడం, కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం వంటి మంచి మార్పులు ఈ దశలో కనిపిస్తాయి.
36
ఆడవారి బాధలు అర్థం చేసుకోవడం
కూతురు పుట్టిన తర్వాత ప్రతి తండ్రి తన బిడ్డ భవిష్యత్ గురించి ఆలోచించడం ప్రారంభిస్తాడు. ఆమె ఎదుగుదల, చదువు, భద్రత, సమాజంలో ఆమె ఎదుర్కొనే పరిస్థితులు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో మహిళలు జీవితంలో ఎదుర్కొనే వివక్ష, భయం, అసౌకర్యాలు, బాధ్యతలు ఎంత కఠినంగా ఉంటాయో అతనికి మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఫలితంగా మహిళల పట్ల గౌరవం పెరుగుతుంది.
కూతురు భవిష్యత్ గురించి ఆలోచించే ప్రతి తండ్రిలో బాధ్యత భావం సహజంగానే పెరుగుతుంది. ఆమెకు మంచి చదువు, ఆరోగ్యం ఉండాలి, జీవితంలో ఏ లోటూ లేకుండా చూడాలనే తపన మొదలవుతుంది. ఈ ఆలోచనలే అతన్ని మరింత కష్టపడి పనిచేసేలా ప్రేరేపిస్తాయి. ఉద్యోగంలో మరింత శ్రద్ధ పెట్టడం, ఆర్థికంగా బలపడేందుకు కొత్త అవకాశాలను వెతకడం, పొదుపు చేయడం వంటి అలవాట్లు పెరుగుతాయి.
56
కూతురికి రక్షకుడిగా మారడం
ప్రతి తండ్రి తన కూతురికి మొదటి హీరో. ఆమె సురక్షితంగా ఉండాలని, ఎలాంటి ప్రమాదం ఆమె దగ్గరకు రాకూడదని ప్రతి క్షణం కోరుకుంటాడు. చిన్నప్పటి నుంచి స్కూల్‌కు వెళ్లడం, బయటకు వెళ్లడం, చదువు, స్నేహితులు, భవిష్యత్ ఇలా ప్రతి విషయంలో ఆమెకు అండగా నిలబడాలని భావిస్తాడు. కూతురు భయపడినప్పుడు ధైర్యం చెప్పేది తండ్రే. ఆమె విజయాల్లో గర్వపడేది కూడా తండ్రే. అవసరమైతే తన సౌకర్యాలను కూడా త్యాగం చేసి, ఆమె కోసం ఎలాంటి కష్టాన్నైనా భరిస్తాడు.
66
కూతురే ప్రపంచంగా మారిపోవడం
కూతురు పుట్టిన తర్వాత చాలామంది తండ్రుల జీవితంలో ప్రాధాన్యాలు మారిపోతాయి. ఇంతకుముందు స్నేహితులు, అలవాట్లు, వ్యక్తిగత విషయాలకు సమయం కేటాయించిన వారు ఇప్పుడు ఇంటికి త్వరగా రావాలని, కూతురితో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. ఆమె చిరునవ్వు కోసం ఏం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే కూతురు జన్మించడం ఒక కుటుంబానికి వరం అయితే, ఒక తండ్రికి అది జీవితాన్ని మార్చే అద్భుతమైన అనుభవమని నిపుణులు చెబుతుంటారు.