Cooking Recipes: మళ్లీ మళ్లీ తినాలనిపించే పాలక్ చికెన్.. తింటే వదిలిపెట్టరుగా!

Published : Jun 27, 2023, 01:20 PM IST

 Cooking Recipes: చికెన్ ని ఒకే రకంగా వండుకొని బోర్ కొట్టిందా.. అయితే రండి మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా పాలకూర చికెన్ చేసుకుందాం.  

PREV
16
Cooking Recipes: మళ్లీ మళ్లీ తినాలనిపించే పాలక్ చికెన్.. తింటే వదిలిపెట్టరుగా!

 ఎప్పుడు చికెన్ వేపుడు చికెన్ కర్రీ చికెన్ తందూరి ఇవే వంటకాల అంటూ బోర్ కొట్టిందా.. చికెన్తో కొత్తగా ఏమైనా ట్రై చేయాలనిపిస్తుందా.. అయితే రండి పోషకాలతో కూడిన పాలకూర  చికెన్ చేసుకుందాం. పాలకూర పచ్చివాసన వస్తుందేమో అని భయం అక్కర్లేదు.
 

26

ఈ కూరలో వచ్చే ఇగురు అన్నంలో కలుపుకుంటే టేస్ట్ అదుర్స్. మళ్లీ మళ్లీ ఇదే కూర అని వండుకొని తినాలనిపిస్తుంది. ఇక పదండి ఈ కూర కోసం ఏ ఏ పదార్థాలు కావాలో చూద్దాం. చికెన్ - అరకిలో, పాలకూర- 150 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్  -రెండు స్పూన్లు.
 

36

నూనె- తగినంత, పచ్చిమిర్చి - రెండు, జీలకర్ర పొడి - అర స్పూను,గరం మసాలా పొడి - అర స్పూను,ధనియాల పొడి - అర స్పూను, ఉల్లిపాయ తరుగు - అర కప్పు,ఉప్పు రుచికి - తగినంత. పసుపు - అర స్పూను,కారం-  ఒక టీ స్పూన్.ఇక రండి తయారీ విధానం చూద్దాం..
 

46

చికెన్ని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే పాలకూరని కూడా బాగా కడిగి తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేయాలి నూనె బాగా వేడెక్కాక ఉల్లిపాయ తరుగు వేయాలి ఉల్లిపాయలు కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
 

56

ఆ తర్వాత కాస్త పసుపు, పాలకూర వేసి మూత పెట్టాలి. పాలకూరలో నీళ్లు ఇంకిపోయిన తరువాత చికెన్ ముక్కలు వేసి బాగా కలపాలి. ఇందులోంచి కూడా నీళ్లు బాగా దిగిపోయిన తర్వాత అప్పుడు కారం, జీలకర్ర పొడి ధనియాలపొడి,
 

66

గరం మసాలా చల్లి బాగా కలపాలి. ఒక పావుగంట సేపు చిన్న మంట మీద పెడితే కూర బాగా ఉడుకుతుంది. నోరూరించే రంగులోకి వస్తుంది. ఇంకేముంది నోరూరించే పాలకూర చికెన్ రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో మాకు కూడా చెప్పండి.

click me!

Recommended Stories