ఎట్టి పరిస్థితుల్లో నీటి చుక్క కింద పడకూడదని అని చెప్తాడు. దీంతో రాజు జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ నది వరకు వెళ్లి వస్తాడు. రాగానే సాధువు.. 'నువ్వు నడిచేటప్పుడు ఎవరి గురించి ఆలోచించావు?' అని అడిగాడు. అందుకు రాజు బదులిస్తూ.. "ఏదీ ఆలోచించలేదు. నా దృష్టి మొత్తం ఈ గిన్నెలోని నీటిపైనే ఉంది." అందుకే నీటి చుక్క కింద పడలేదు అని చెప్తాడు.
సాధువు బదులిస్తూ.. జీవితం అంటే ఇదే. నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెడితే, నిన్ను ఎవరూ విమర్శించినా, ఎంత విఫలమైనా, ఎన్ని కష్టాలొచ్చినా, అవన్నీ కనిపించవు. నీ దారి నువ్వే నిర్ణయించుకోవాలి. జీవితంలో ఎంత కోల్పోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా చివరి అవకాశం ఎప్పటికీ ఉంటుంది. దానిని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో మళ్లీ ముందుకెళ్లొచ్చు. అని చెప్తాడు. అది విన్న రాజు చావు సమస్యకు పరిష్కారం కాదని తెలుసుకొని, మరో కొత్త లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకుసాగుతాడు.